.. ఈసారి ఆయన అధికారంలోంచి దిగిపోతాడనే అంటున్నారు. ఎప్పటి నుంచో పరిశీలకులు చెబుతూనే ఉన్నారు. ఎగ్జిట్ పోల్ అంచనాల్లో అవే కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు అవకాశం ఉందా? ప్రజా సమస్యల ప్రచారానికి, పరిష్కారానికి గతంలోలాగా కనీసంగా అయినా ఇప్పుడు ఎన్నికలు ఉపయోగపడతాయా? లేక ఎప్పటిలాగే వంచనలు, ప్రలోభాలు, ఓట్ల కొనుగోళ్లు .. ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయా? ఎన్నికల ఎత్తుగడవాదుల ప్రయత్నాలు ఓట్ల ఫలితాలను కనీసంగా అయినా ప్రభావితం చేస్తాయా? అని ఎంత విశ్లేషణ అయినా ఇవ్వవచ్చు. కాకపోతే పదేళ్ల నియంతృత్వ పాలన మీద ఈ ఎన్నికల సమయంలో కూడా తెలంగాణ పదునైన విమర్శను వినిపించింది. ఎన్నికల రాజకీయాల్లో ప్రత్యామ్నాయాలు లేకపోయినా నిరంకుశ పాలనను చూస్తూ ఊరుకోనని మాత్రం తెలంగాణ ప్రజ గొంతెత్తి చాటింది.
ఈ విమర్శలతో, నిరసనలతో, అసమ్మతితో ఏలినవారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇష్టారాజ్యాన్ని అంగీకరించమనే తెలంగాణ ప్రజలు హెచ్చరికకు భయానికి లోనయ్యారు. ఈ నెల రోజులుగా అనేక రకాలుగా దాన్ని చూశాం. ఓట్లు అడుక్కోడానికి వెళ్లి కూడా బహిరంగ వేదిక మీది నుంచే జనం మీద దొరవారు మండిపడ్డారు. ఎప్పటిలాగే వేలు చూపించి బెదిరించారు. అధికారం రేపో మాపో అది చేజారిపోవచ్చు. అయినా చివరి అస్త్రాన్ని భారత్ బచావో సంస్థ నాయకుల మీద ప్రయోగించారు. ఆ సంస్థ నాయకులు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎం ఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేష్ తదితరులపై ‘ఉపా’ కేసు పెట్టారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు కూడా తన బరితెగింపును చాటుకున్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యానికి ఏకైక ఆనవాలైన ఎన్నికల ప్రక్రియ ఎట్లా ఉన్నదీ చెప్పగల సవాలక్ష ఉదాహరణల్లో ఇదొకటి.
భారత్ బచావో మీద కేసీఆర్‌కు ఎందుకింత ఆగ్రహం కలిగింది?
ఓటమి తప్పదనే ఎరుక కలిగాక కూడా ఎందుకింత తెంపరితనానికి లోనయ్యాడు? బహుశా ఆయన గెలుపు ఓటములను తమ సంస్థ నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తుందని భారత్ బచావో నాయకులు కూడా అనుకోకపోవచ్చు. అయితే కేసీఆర్ నియంతృత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ పౌర సమాజం నుంచి ఏర్పడ్డ అనేక ప్రజా వేదికల్లాగే భారత్ బచావో కూడా ప్రజాగ్రహ వ్యక్తీకరణను ప్రేరేపించి ఉండవచ్చు. ప్రభుత్వంపట్ల విమర్శనాత్మకంగా ఉండమని జనానికి బోధించి ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావు లేదని, హిందుత్వ ఫాసిస్టులను అంగీకరించవద్దని ప్రచారం చేసి ఉండవచ్చు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం లక్ష్యాలుగా ఏర్పడ్డ భారత్ బచావో కేసీఆర్ నిరంకుశ పాలనను, ఆయన చెలిమి చేస్తున్న కేంద్రంలో హిందుత్వ ఫాసిస్టులను ఓడిరచమని ప్రజలకు పిలుపు ఇచ్చి ఉండవచ్చు. ఈ పని అన్ని ఓట్ల పార్టీలు చేసేవే. అసలు ఎన్నికలు అంటేనే అవతలి పార్టీని విమర్శించడం. ఆ పార్టీకి ఓటు వేయవద్దని చెప్పడం. తమకే ఓటు వేయమని కోరుకోవడం. దీని కోసమే కదా ఎన్నికలు నిర్వహించేది. కాకపోతే ఎన్నికల్లో పోటీ చేయని సంస్థలు అన్ని పార్టీలను, అందరు నాయకులను క్రిటికల్‌గా చూడమని చెబుతాయి. భారత్ బచావో కూడా అదే చెప్పి ఉండవచ్చు. అంత మాత్రాన అది చట్టవ్యతిరేక కార్యకలాపం కిందికి వస్తుందా? ఆ సంస్థ నాయకులు నేరస్థులు అవుతారా? గత పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని వందల మందిని ఇలా నేరస్తులుగా ప్రకటిస్తూ వచ్చింది. యుఏపీఏ తదితర కేసులు నమోదు చేస్తూ వచ్చింది. అక్రమంగా నిర్బంధించి జైలుపాలు చేస్తూ వచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుంగు అనుచరురాలిగా చేయగల దుర్మార్గాలన్నీ చేసింది. ఇప్పుడు పోతూ పోతూ కూడా భారత్ బచావో నాయకుల మీద అక్రమ కేసు నమోదు చేసింది.
నియంతృత్వం చెలాయించే పాలకుడికు ఓటమి భయం పట్టుకుంటే అది ఉన్మాదంగా మారిపోతుంది. అక్కసు, అల్పత్వం దాచుకుందామన్నా సాధ్యం కాదు. ఆధిపత్య వ్యక్తిత్వానికి నైతిక శక్తి ఉండదు. ప్రజాభిప్రాయానికి కనీస గౌరవం ఇవ్వలేనివారు ఎట్లాగైనా గెలవాలని అనుకుంటారేగాని ఓటమిని భరించలేరు. దాంతో ఎంతకైనా తెగబడతారు. కనీస విమర్శను సహించలేని పెత్తందారీ స్వభావంతో పేట్రేగిపోతారు. ఇదంతా కేసీఆర్‌లో ఎంత స్పష్టంగా కనిపిస్తున్నది! అక్రమ కేసును ఎదుర్కొంటున్న భారత్ బచావో నాయకులకు విస్తృత ప్రజా జీవితం ఉన్నది. అనేక భిన్నాభిప్రాయాలతో సంభాషించగల పరిణతి ఉన్నది. లౌకికవాదం, ప్రజాస్వామ్యం కోరుకొనే వాళ్లందరికీ ఆ వేదికతో అంగీకారాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలూ ఉంటాయి. ప్రజలను చైతన్యవంతం చేయడం ఒక్కటే శాశ్వత పరిష్కారం అనే విషయంలో తిరుగులేని సమ్మతి ఉంటుంది.
ఇదిగో ఇదే.. కేసీఆర్‌ను భయపెట్టింది. ఆగ్రహం తెప్పించింది. గతంలో ప్రజా ఉద్యమకారుల మీద పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులే అయినా ఇది మరీ నగ్నంగా కనిపిస్తుందనే విచక్షణ కోల్పోయేలా చేసింది. ఈ కేసు ఏమవుతుందనేది పెద్ద ప్రశ్న కాదు. అందరూ అంటున్నట్లు కేసీఆర్ తిరిగి రాకపోవచ్చు. కానీ ప్రజా క్షేత్రంలో పని చేసే మేధావులకు ఆ తర్వాత కూడా చేతి నిండా పని ఉంటుంది. దాన్ని ఇలాంటి కేసులు ఏమీ చేయలేవని ఎన్నడో రుజువైంది కదా.
Pani garu —agree with u sir
He lost because
1–arrogant
2-bad attitude
3 -act like a king
4- my way or highway
5-dictatorship
6-etala.rajender episode
7 -dhalitha Bandu -udoyogabhandu-all r gimmicks
8-other states leaders no one trust him
9-trs in to BRS PARTY
10-RIFT WITH MODI &AMITHSHA
11–NO VISIT to Rajabhavan.
12–no respect towards GOVERNER
13-KTR &KAVITHA DOMINATION
14 -NO RESPECT TO GOVT OFFICERS
15-BAD MOUTH
MORE——
BUCHIREDDY GANGULA