నేను ఉరిమితే
నీ సింహాసనం కదిలింది
నేను వర్షిస్తే
వసంతం పులకించింది
నాలుగు గోడల బందీఖాన
నా ఆలోచల్ని ఆపలేదు
అవి ప్రాణ వాయువులా
ప్రజల ఉచ్వాస నిశ్వాసలను
తడుముతూనే ఉంటాయి
నేను నిర్జీవంగా
ఇచ్చట వాలిపోలేదు
నా నినాదాలు
ప్రపంచ వ్యాపితంగా
ప్రతి ద్వనిస్తూనే ఉంటాయి
నేను స్వేచ్ఛా మానవిని
ఏ చెరసాలకు లొంగే దాన్ని కాదు

Leave a Reply