2023 అక్టోబర్ 28 తెల్లవారుజామున 4 గంటలకు సర్వ ఆదివాసీ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బస్తర్ జన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి కన్వీనర్ తిరుమల్ సర్జూ టేకమ్‌ను ఒక కార్యక్రమంలో ఉపన్యాసం యిచ్చినందుకు ఛత్తీస్‌గఢ్‌లోని మాన్‌పూర్ జిల్లాలోని అతని నివాసం నుండి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295A, 153A, 506B, 435, 34 కింద, అబద్ధపు ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. భారతదేశంలోని సహజ వనరులు అధికంగా ఉన్న బస్తర్‌లో జరుగుతున్న కార్పొరేటీకరణ, సైనికీకరణలకు వ్యతిరేకంగా సర్జూ టేకం తన స్వరాన్నెత్తారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఆ ప్రాంతంలోని భూమి, సహజ వనరులను దోచుకోవడానికి వీలు కల్పించడానికి అనేక మంది ఆదివాసీలను నిర్వాసితులను చేసి, సైనిక క్యాంపులను  ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ప్రజాస్వామిక హక్కుల పోరాటంలో ఆయన క్రియాశీలకంగా వున్నారు.

అదే సమయంలో, అక్టోబర్ 22వ తేదీన కంకేర్ జిల్లాలో రైతులు మోదా రాం పడా, కన్హా రామ్‌లు బియ్యం కొనుక్కోడానికి  వెళ్లి తిరిగి వస్తుండగా మావోయిస్టులనే ఆరోపణతో బూటకపు ఎన్‌కౌంటర్‌లో హత్య చేసారు. హత్య చేసిన తర్వాత వారిద్దరికీ మావోయిస్టు యూనిఫారం వేశారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారిలో మోదా రాం వయసు కేవలం 18 సంవత్సరాలు.

సిలంగేర్‌లో  ఆదివాసీలపై పోలీసులు అకస్మాత్తుగా కాల్పులు జరిపిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో బహిరంగ సైనికీకరణకోసం ఏర్పాటు చేస్తున్న పోలీసు క్యాంపులకు  వ్యతిరేకంగా ఉద్యమం మొలకెత్తింది. ఇది ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కంకేర్, నారాయణ్‌పూర్, సుక్మా, దంతేవాడ, బస్తర్‌లతో సహా ఏడు జిల్లాల్లో చురుకుగా ఉంది. సహజ వనరులను దోచుకోవడానికి, భారత రాజ్య సైనిక సహాయంతో వారి భూములను లాక్కోవడానికి కార్పొరేట్లు ఆదివాసీలను నిర్వాసితులను చేయడానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమంలో భాగంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ధర్నాలలో  వేలాది మంది ఆదివాసీలు పాల్గొంటున్నారు.

ఈ క్రమంలో, పోలీసు క్యాంపు వ్యతిరేక ఉద్యమం బలంగా సాగుతున్న బీజాపూర్ జిల్లా అంబేల్లిలోమహారాష్ట్ర పోలీసులతో భారత రాజ్యం అంతర్ రాజ్య సరిహద్దు కార్యకలాపాలను కూడా చేపట్టింది. అనేక మంది ఆదివాసీలను నిర్వాసితులను చేసి గనులను, పోలీసు క్యాంపులను కలిపే హైవేల నిర్మాణాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలలో 18 నెలల ధర్నా, నిరసనలు జరిపి బెచాఘాట్, కంకేర్‌ హైవే నిర్మాణం కోసం జరిగిన కాంట్రాక్ట్‌ను రద్దు చేయించడాన్ని అలాంటి ఉద్యమ విజయాలలో ఒకటిగా చూడవచ్చు.

తప్పుడు కేసులు, అపహరణలు లేదా అరెస్టులు, బూటకపు ఎన్‌కౌంటర్‌లు వంటి అన్ని రకాల పోలీసు హింసను ఈ పోరాటంలో పాల్గొన్న ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలు ఎదుర్కోవలసి వస్తోంది. బస్తర్‌లో జల్-జంగల్-జమీన్ కోసం జరుగుతున్న పోరాటం పట్ల అవగాహన కల్పించేందుకు గత సంవత్సరం ఢిల్లీకి వచ్చిన కార్యకర్తల బృందంలో వున్న సార్జు టెకమ్ అరెస్టు మూడోది కావడం మరింత దారుణమైన అంశం. బస్తర్‌లో రాజ్య అణచివేతకు వ్యతిరేకంగా గళం విప్పడానికి ప్రయత్నిస్తున్న జర్నలిస్టులు, ఉద్యమకారులను నిశ్శబ్దం చేయడానికి భారత ప్రభుత్వం ఒక సమిష్టి ప్రయత్నం చేస్తోంది. “ఒళ్ళు గగుర్పొడిచే”అనుభవాన్ని కలిగించే ఈ ఉద్యమకారుల అరెస్టులు రాజ్య అణచివేతకు వ్యతిరేకంగా తమ గొంతులను లేవనెత్తాలనుకుంటున్న ఇతరులలో భయాన్ని కలిగిస్తాయి.

అదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో బూటకపు ఎన్‌కౌంటర్లు జరగడం సర్వసాధారణంగా మారింది. మావోయిస్టులతో పోరాడే పేరుతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 17 మంది గ్రామస్థులు మరణించారని, 2012లో జస్టిస్ విజయ్ కుమార్ అగర్వాల్ నేతృత్వంలోని న్యాయ విచారణలో తేలింది.

సుక్మాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులను చంపామనే పోలీసుల వాదనలు వాస్తవానికి ఇటువంటి అనేక బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపబడిన వందలాది నిరాయుధుల మృతదేహాలపై నిర్మించిన నక్సల్ మరణాల గణాంకాలను బలోపేతం చేసుకోడానికి పోలీసులు నిరాయుధులైన పౌరులపై కాల్పులు జరిపిన కేసు అని పోలీసుల వాదనను బహిర్గతం చేస్తూ, 2018లో, స్వతంత్ర మీడియా సంస్థ న్యూస్‌లాండ్రీ కూడా ఒక క్షేత్ర స్థాయి నివేదికను ప్రచురించింది.

కంకేర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ మాదిరిగానే, గత నెలలో చింతాగుఫా పోలీస్ స్టేషన్‌లో సోధి దేవా, రవ దేవా అనే యిద్దరు ఆదివాసీలను హత్య చేసి, వారిని మావోయిస్టులుగా చిత్రించడానికి తాడ్మెట్ల జిల్లాలో వున్న అడవిలో శవాలను పడవేసారు.

ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా 25 గ్రామాల నుండి ప్రజలు తరలిరావడంతో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఈ చర్యలతో పాటు, ప్రజాస్వామిక, పౌర హక్కుల, మానవ హక్కుల, కార్మిక హక్కుల, కుల వ్యతిరేక, మహిళా హక్కులకు చెందిన 64 సంఘాలు, మార్క్సిస్ట్-లెనినిస్ట్ మాత్రమే కాకుండా గాంధీవాద భావజాలం కూడా కలిగిన వారిపై మావోయిస్టులతో సంబంధాలు కలిగివున్నారనే ఆరోపణతో దేశవ్యాప్తంగానూ, పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్‌లోనూ ఎన్‌ఐఎ దాడులు చేసింది. ప్రజాస్వామిక పద్ధతిలో భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే అరెస్టులు, దాడులు, బూటకపు ఎన్‌కౌంటర్లు, ఎరుపంటే భయపడేట్లు చేసే ఎత్తుగడలను అమలుచేస్తున్న భారత దేశంలో తిరుమల సర్జూ టేకం తాజా బాధితుడు.

తిరుమల్ సర్జు టెకామ్ వంటి ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తల నిరంతర అరెస్టులు, వేధింపులను, మోదా రాం, కన్హా రామ్‌ల బూటకపు ఎన్‌కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తున్నాం.

తిరుమల సర్జూ టేకంను వెంటనే, బేషరతుగా విడుదల చేయాలి!

మోదా రాం, కన్హారామ్‌ల రాజ్య ప్రాయోజిత హత్యలపై స్వతంత్ర విచారణ జరిపించాలి!

ఛత్తీస్‌ఘడ్‌లో జరుగుతున్న ప్రజాస్వామిక పోరాటాలపై రాజ్య అణచివేతను నిలుపు చేయాలి!

(రాజ్య హింస  వ్యతిరేక ప్రచారోద్యమంలో భాగస్వామ్య సంస్థలు -ఎఐఆర్ఎస్ఒ, ఎఐఎస్ఎ, ఎఐఎస్ఎఫ్, ఎపిసిఆర్, బిఎఎస్ఎఫ్, బిఎస్ఎమ్, భీమ్ ఆర్మీ, బిగుల్ మజ్దూర్ దస్తా,  బిఎస్‌సిఇఎమ్, సిఇఎమ్, సిఆర్‌పిపి, సిటిఎఫ్, దిశ, డిఐఎస్‌ఎస్‌సి, డిఎస్‌యు, డిటిఎఫ్, ఫోరం అగైన్స్ట్ రిప్రెషన్, తెలంగాణ, ఫ్రటర్నిటీ, ఐఏపిఎల్, ఇన్నోసెన్స్ నెట్‌వర్క్, కర్ణాటక జనశక్తి, ఎల్‌ఎఎ, మజ్దూర్ అధికార్ సంఘటన్, మజ్దూర్ పత్రిక, మోర్చా పత్రిక, ఎన్‌ఎపిఎమ్, ఎన్‌బిఎస్, నిశాంత్ నాట్య మంచ్, నౌరూజ్, ఎన్‌టియుఐ, పీపుల్స్ వాచ్, రిహాయి మంచ్, సమాజ్‌వాది జన్ పరిషద్, సమాజ్‌వాది లోక్ మంచ్, బహుజన్ సమాజ్‌వాది లోక్ మంచ్, ఎస్‌ఎఫ్‌ఐ, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్, యునైటెడ్ పీస్ అలియన్స్, డబ్ల్యూఎస్ఎస్, వై4ఎస్ )

https://en.themooknayak.com/tribal-news/outcry-against-states-actions-in-chhattisgarh-activist-arrest-and-alleged-fake-encounters-denounced

Leave a Reply