ఇసక తిన్నెల మీద
ఇనుపబూట్ల మహమ్మారిని
తరిమి కొట్టి
నిండు ఎడారిలో
నీటిని నింపిన
ప్రేమ మనది
గాలికి తాడు కట్టి
గండ్ర గొడ్డలి తెచ్చి
విష వాయువును నరికి
గరికపూల వనంలో
నిద్రించిన ధీరత్వం మనది
అలసిన అడవిని లేపి
పాటల పరవళ్ళు తెచ్చి
దండోరా మ్రోగించిన
నేర్పు మనది
డియర్
ఈ సుందర
మధురానుభూతులు
చరిత్ర తొలిపొద్దులో
మహోత్తర విప్లవ జ్వాలలై
ఎగిసిపడుతాయి.