విశాఖలో సహజసిద్ధంగా పోర్టు ఎలా అయితే ఏర్పడిందో ఆ పోర్టే స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రాతిప‌దిక అయ్యింది. మత్యకారగ్రామం అయిన విశాఖ సముద్ర తీరంలోని డాల్ఫిన్‌ నోస్‌. డాల్ఫిన్‌ చేపముక్కు సముద్రంలోకి చొచ్చుకొని పొయినట్లు కనిపించే తీరం (యారాడ కొండలు), నౌకలు లంగరు వేసి నిలబెట్టేందుకు అనువైన స్థలంగా మారింది.ఇక్కడ లంగరు వేసిన నౌకలు ఎంత బలమైన తుఫాన్‌ గాలుకు కూడా కొట్టుకొనిపోకుండా ఈ యారాడ కొండ రక్షణగా నిలబడింది. బ్రిటీష్‌కాలం ముందు నుండి (1927 నుండి) ఓడ రేవుగా ఉంటూ 3 బెర్తులతో మొదలయ్యి తరువాత 24 బెర్తులతో మేజర్‌పోర్ట్‌గా విస్తరించి  ప్రపంచ వాణిజ్యానికి ద్వారాలు తెరిచింది.

5వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా స్టీల్‌ ఫాక్టరీ ఎక్కడపెట్టాలని నిర్ణయించేందుకు వేసిన ఆంగ్లో` అమెరికన్‌ కన్సార్షియం సముద్ర రేవు ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఇందుకు విశాఖపట్టణం ఉత్తమమైనదిగా ఎంచింది. స్టీల్‌ తయారికి అవరసరమైన ఐరన్‌కోల్‌, సిెంటర్‌్‌, మాంగనీసు, సున్నపురాయి, డోలమైట్‌ అన్నింటినీ వివిధ ప్రాంతాల నుండి సేకరించుకోని ముడిసరకు తెచ్చుకోనేందుకు ప్లాంట్‌ నిర్మాణ సామాగ్రిని తెచ్చుకొనే ఖర్చు 11.72 కోట్ల ఈ ఓడరేవు అయితే తగ్గుతుందని, తయారైన ఉత్పత్తుల్ని సులభంగా ఎగుమతి చేసుకోవచ్చని, ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థను మెరుగుపరుచుకోని రైల్వేల మీద భారం తగ్గించి తీరంలో మార్కేట్‌ సౌకర్యం కలిగించుకోవచ్చునని, భారీ పరికరాల దిగుమతికి రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం వాటి నిర్వాహణ అంతా తగ్గి డబ్బు ఆదా అవుతుందని, అన్నింటికన్నా సముద్రతీర ఉక్కు కర్మాగారానికి ఇతరుల ఆర్ధిక మద్దతు లభిస్తుంది. అనే ఉద్దేశంతో అంగీకరించారు తప్ప పాలకుల దయాదాక్షిణ్యాలతో విశాఖను ఎంపిక చేయలేదు. ఆంగ్లో అమెరికన్‌ కన్సార్షియం ఇచ్చిన నివేదికను ఆచరణలోకి తెచ్చేందుకు దశాబ్దాకాలం పాటు విశాఖ ఉక్కు ` ఆంధ్రులహక్కు అంటూ రాష్ట్రవ్యాపితంగా ప్రజలు అనేక పోరాటాలు చేశారు. లాఠీచార్జీలకు, బాష్పవాయువులకు గురి అయ్యారు. నిర్భందాల్నిననుభవించి జైళ్ళకి వెళ్లారు. అక్రమ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగారు. 32 మంది ప్రాణాలర్పించి 67 మంది ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాచేసి ప్రజల  ఉపాధికోసం రాష్ట్రాభివృద్ధి కోసం పోరాడారు. అడుగడుగునా మోసం చేయచూసిన కేంద్ర ప్రభుత్వ విధానాల్ని తిప్పికొట్టారు. స్టీల్‌ ప్లాంట్‌ కోసం పకృతి విశాఖను ఎంపిక చేస్తే వెల్లువలా సాగిన ప్రజా ఉద్య‌మం దాన్ని నిర్ణయం చేయించింది.

నిర్వాసిత గ్రామాల త్యాగమే ప్లాంట్‌  నిర్మాణానికి ఊపిరిపోసిందిః
    

68 గ్రామాల్లోని ఉప్పుపండిరచే రైతులు తమ ఉప్పుగళ్లీల్ని  వ్యవసాయం చేసే రైతులు తమ పంటపొలాల్ని , ప్రజలు తమ నివాస స్థలాల్ని  ఉమ్మడి భూముల్ని  అందమైన, ప్రశాంతమైన తీరప్రాంత గ్రామాల్ని , తరతరాల తమ ఙ్ఞాపకాల్ని  మొత్తం ప్లాంట్‌ కోసం ఇచ్చేశారు. ప్రజల నుండి సేకరించిన 22 వేల ఎకరాలు, కురుపాం రాజుల నుండి 6 వేల ఎకరాలు మిగతా ప్రభుత్వభూములు, కొండలు, గడ్డలు, కాలువలు అంతా కలుపుకోని 32వేల ఎకరాల్ని  ప్రభుత్వం స్వాధీనం చేసుకొని 25 కిలోమీటర్ల పొడవున  ప్రహరి కట్టేసింది. 16,600 కుటుంబాలు నిర్వాసితులయ్యారు. 1971 సం॥లో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ శంకుస్థాపన చేసి పూర్తి పెట్టుబడి ఇవ్వకుండా  వదిలేసింది. ప్లాంట్‌ నిర్మాణాన్ని ఆపేందుకు అనేక ఆటంకాలు సృష్టించారు. స్వంతగనులున్న స్టీల్‌ ప్లాంట్‌ ఆధారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) నుండి విడదీసి (ఆర్‌ఐఎన్‌ఎల్‌) రాష్ట్రీయ ఇస్సాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌కు ఏర్పరిచింది. ప్రభుత్వ సహాయ నిరాకరణ వలన ఉత్పత్తి 1991 లో ప్రారంభమైంది. ఆదీ రష్యావారి నిస్వార్ధ సహకారంతోనే సాద్యం అయ్యింది.  వారు ప్లాంట్‌ ప్లానింగ్‌ మాత్రమే కాదు అత్యంత నైపుణ్యం కలిగిన సుశిక్షితులైన  టెక్నీషియన్స్‌ను తీసుకొని ఇక్కడ పనిచేయించి,  ఆపని ఇక్కడ నేర్పారు. రూర్కెలా , దుర్గాపూర్‌ స్టీల్‌ప్లాంట్స్‌లో జర్మనీ వాడి పడేసిన యంత్రాల్ని ఇస్తే రష్యా అత్యంత నాణ్యత కలిగిన ఆధునిక పరికరాలు (బ్లాస్డ్‌ఫర్నెస్‌లు) పంపారు. వారి శిక్షణలో కోకోవెన్‌ డిపార్ట్‌మెంట్‌లో 1250 డిగ్రీల వేడి, బ్లాస్ట్‌ఫర్నెస్‌లలో 1800 డిగ్రీల వేడిని తట్టుకుంటూ గృహ నిర్మాణానికి అవసరమయిన 5ఎమ్‌ఎమ్‌ స్టీల్‌ రాడ్స్‌ నుండి ప్రాజెక్ట్‌లకవసరమయిన 80 ఎమ్‌ఎమ్‌ రాడ్స్‌ వరకు తయారు చేస్తారు. అంతేకాదు ఛానల్స్‌ , రిభార్స్‌ , వైర్‌రాడ్స్‌ , బిల్లెట్స్‌  లాంటి మేలైన ఉత్పత్తుల్ని  తీసుకొస్తున్నారు. ఇంత నాణ్యమైన అధికోత్పత్తిని చేస్తున్న ప్లాంట్‌ నష్టాలలోకి ఎందుకు వెళ్లింది అనేదే ప్రశ్న. ఆ వివరాల్లోకి వెళితే ..

స్టీట్‌ ప్లాంట్‌ను జాతికి అంకితం చేసి బిఐఎఫ్‌ఆర్‌ లో నెట్టిన పాలకులు:

    

స్టీల్‌ ప్లాంట్‌ను ప్రధాని పి.వి నరసింహారావు జాతికి అంకితం చేశారు. ప్లాంట్ డీపీఆర్  (డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు) లో  స్వంతగనులున్నా వాటిని కేటాయించకపోగా వడ్డీ భారం తగ్గించి పెట్టుబడిని పునర్‌వ్యవస్థీకరించలేదు. ప్లాంట్‌ను బిఐఎఫ్‌ఆర్‌ (బోర్డ్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ పైనాన్షియల్‌ రీకనస్టక్షన్‌) లో నెట్టి ధర్మల్‌ పవర్‌ప్లాంట్‌ని, ఆక్సిజన్‌, నైట్రోజన్‌ సరఫరా చేసే ఎయిర్‌ సపరేషన్‌ ప్లాంట్‌ను ముక్కలు చేసి అమ్ముకుందామని  చూశారు. కానీ కార్మికులు ఆనాటి సర్వోదయ, స్వాతంత్రోద్యమనాయకులు పత్తి శేషయ్య , బైరాగి నాయుడు గార్లు  జల సమాధికి సిద్దపడి పోరాటం నడిపారు. ఫలితంగా బిఐఎఫ్‌ఆర్‌ నుండి బయట పడటమే కాదు తయారైన మెటల్‌ను  పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు మెల్టింగ్‌ షాపుల్ని కూడా నిర్మించుకోగలిగింది.

వెంటాడుతున్న గనులగండం:
    

ఆపరేషన్‌ లాబాల్లో ఉన్నా 14 శాతంఅధిక వడ్డీ భారంగా ప్లాంట్‌ నికరనష్టాల్ని చూస్తూ వస్తుంది. ఉత్పాదక వ్యయం పెరగటానికి కారణం ఇనుప ఖనిజాన్ని  కొనుక్కోవలసిరావటమే , స్వంత గనులు లేని స్టీల్‌ ప్లాంట్‌ ఏదైనా ఉంది అంటే అది విశాఖస్టీల్‌ ప్లాంట్‌ మాత్రమే . ప్రైవేట్‌ప్లాంట్స్‌కి, ప్లాంట్‌ కూడా లేని వ్యక్తులకు , విదేశీ కంపెనీలకు కూడా గనులు కేటాయిస్తున్న పాలకులు విశాఖస్టీల్‌ ప్లాంట్‌ కు స్వంత గనులు ఎందుకు కేటాయించటం లేదు ?.

కొనసాగుతున్న గనుల మోసం:

1) 200 సం॥ తవ్వినా తరగని 28.52 బిలియన్‌ టన్నుల ఐరన్‌ఓర్‌ రిజర్వులో ఉన్న సెయిల్‌ నుండి 1982ల విడదీసినప్పుడు బైలదిల్లా గనుల్లోని డిపాజిట్స్‌, 4 మరియు 5 నుండి ఓర్‌ ఇస్తామని గనుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. దశాబ్దాలు గడుస్తున్నా వాగ్దానం అమలు కాకపోగ బైలదిల్లా నుండి ఇనుప ఖనిజం కిరండోల్‌ రైలుమార్గం ద్వారా విశాఖపట్టణం పోర్డ్‌కి జేరి కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా షిప్‌ ఎక్కి జపాన్‌కు వెళ్లిపోతుంది. ఆ జపాన్‌ వాడు ఐరన్‌ఓర్‌ దోచుకెళ్ళేందుకు రైలుమార్గం వేస్తే (దాని నుండే మనం ఆరుకులోయ వరకు ఒక్క ట్రిప్‌ మాత్రమే పాసింజర్‌ రైలు నడుస్తుంది.)  కాల పరిమితి లేకుండా ఇప్పటికి నిరంతరం ఆ ఒప్పందం కొనసాగిస్తూనే ఉన్నారు.

2)ఒరిస్సాలో (ఓఎమ్‌డిసి) నుంచి ఓర్‌ ఇప్పిస్తామని ప్రకటించి అందుకు గాను 380 కోట్లు స్వంతగనులు కోసం కట్టించుకోని కూడా గనులు ఇవ్వలేదు.

3)మన రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా వెంపర్ల, అద్దంకి, సింగరాయకొండ , మనికేశ్వరం , బూరేపల్లి , పేర్నమిట్ల , ఒంగోలు , కొనిజేడు, మర్లపాడు తదితర ప్రాంతాల్లో ఉన్న ఇనుప గనులు కేటాయించమని 28 సార్లు డబ్బు కట్టి అప్లికేషన్స్‌ పెట్టారు. అయినా ఎటువంటి స్పందనలేదు.

4) చివరకు విసిగిపోయిన యూనియన్స్‌ స్వంతగనులు కేటాయించమని  గనులు ఇస్తామన్న ప్రభుత్వ జి.ఓలు అమలు  చేయాలని హై కోర్టులో (డబ్లు.పి.నెం. 25114/2012) కేస్‌ వేశారు.  ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డిగారు ఇంతవరకు ప్లాంట్‌కి స్వంతగనులు లేవా అని ఆశ్చర్యపోయి వెంటనే కేటాయించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆ తరువాత బయ్యారం గనులు కేటాయిస్తూ ముఖ్య మంత్రి  జి.ఓ జారీ చేశారు. ఇది కూడా అమలుకు నోచుకోలేదు.

5) బైలదిల్లాలోని ఎన్‌ఎమ్‌డిసి నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఆర్‌ఐఎన్‌ఎల్‌ రెండూ కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలే  కాబట్టి ఉక్కు మంత్రిత్వశాఖ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నా వారు ఎటువంటి చొరవా చేయలేదు.

6) ఒకొరికొకరు సహకారంతో నైనా సమస్య నుండి బయటపడవచ్చు అనే ఉధ్ధేశ్యంతో చత్తీస్‌ఘడ్‌ లోని నగర్నార్‌ ్‌స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వరంగ సంస్థే దీనికి స్వంత గనులున్నాయి. కానీ సాంకేతిక సమస్యలతో ఉత్పత్తి ప్రారంభం కావటం లేదు. దీన్ని నడిపే సత్తా అత్యంత నైపుణ్యం కలిగిన విశాఖస్టీల్‌కి ఉంది. కావున రెండిరటినీ కలిపితే సాంకేతిక సమస్య , గనుల సమస్య రెండూ పరిష్కారం అవుతాయని ఇరువురూ కోరుకుంటున్నా సమస్యని పరిష్కరించలేదు. గనులుంటే  టన్ను  ఐరన్‌ తవ్వితీసుకొనేందుకు ఒక వెయ్యి యాబై రూపాయలు ఖర్చు అయితే  కొనుక్కుంటే టన్నుకు 7500 ఖర్చు అవుతుంది.ఇలా వేలకోట్లు రూపాయలు అదనంగా ఖర్చు చేయించి  ఎలాగైనా నష్టపరచాలనే పాలకుల దుర్మార్గమైన కుట్ర ఇంకా చాలా అంశాల్లో కొనసాగుతూ వస్తూంది.

అవుట్‌ లెట్‌ లేని  స్టీల్‌ ప్లాంట్‌:

    
దేశంలోనే అత్యున్నత నాణ్యమైన స్టీల్‌ ప్రపంచ అవార్డ్‌లు అందుకొన్న మేలైన ఉత్పత్తుల్ని స్టీల్‌ ప్లాంట్‌      ఉద్యోగి కూడా బయట డీలర్‌ వద్ద కొనుక్కోవలసిందే.  ఏ కంపెనీ అయినా తన ఉత్పత్తుల్ని కంపెనీ అవుట్‌లెట్‌ ద్వారా అమ్ముతుంది . కాని మన విశాఖస్టీల్‌ ప్లాంట్‌కు మాత్రం అవుట్‌లెట్‌ లేదు. విశాఖ ప్రజలు కూడా విశాఖ ఉక్కును ప్రయివేట్‌ డీలర్ల వద్ద (కంపెనీరేట్‌ G కమీషన్‌ రేట్లు) కొనుక్కోవలసిందే ఆ డీలర్లు పాలకుల అండదండలతో కోట్లు గడిస్తున్నారు.
    
గంగవరం పోర్ట్‌ కూడా స్టీల్‌ ప్లాంట్‌ డిపిఆర్‌లో ఉన్నదే.  ప్లాంట్‌ ఎగుమతులు, దిగుమతులు కోసం 300 కోట్లకు పైగా ఖర్చు తగ్గుతుంది. అని స్టీల్‌ ప్లాంట్‌ భూములు రెండువేల ఎకరాలు కేటాయించారు. గవర్నమెంట్‌  డ్రెజ్జింగ్‌ కంపెనీ సహకారాన్ని  ప్రభుత్వ సహకారాన్ని పూర్తిగా వినియోగించి కట్టిన పోర్ట్‌ను ప్రైవేట్‌ వ్యక్తులకు హేండోవర్‌ చేశారు. ఇవి చాలవా ప్లాంట్‌ని నష్టాల ఊబిలోకి నెట్టడానికి?

`ఐరనే గాక బొగ్గును కూడా దొరకుండా కోల్‌బ్లాక్‌లు అమ్ముకుంటుంది. 5 లక్షల ఉద్యోగులున్న కోల్‌ ఇండియా లిమిటెట్‌ 2020 జనవరిలో ఆర్డినెన్స్‌ తెచ్చి అమలుకు పూనుకొని ముడి ఖనిజాల్ని అందకుండా ` వర్క్‌ ఆర్డర్స్‌ ఇవ్వకుండా వేధించింది.
`కార్పోరేట్‌ శక్తుల కంపెనీ నిర్మాణానికి సింగిల్‌ విండో ద్వారా ఒక్క రోజులోనే అనుమతి ఇచ్చే పాలకులు ప్లాంట్‌ విస్తరణ కోసం అనుమతి అడిగితే 2 సంవ‌త్స‌రాల‌ వరకు అతీగతీలేదు. ప్రభుత్వ బ్యాంకుల నుండి వడ్డీ లేని రుణాలిచ్చి, ఆ తరువాత రుణమాఫీ చేసే పాలకులు స్టీల్‌ప్లాంట్‌ రుణాల పై 14  శాతం వడ్డీ తీసుకుంటుంది. ఒక్క పైసా రుణమాఫీ చేయలేదు.

ప్రకృతి వైపరీత్యాల కంటే పాలకుల విధానాల వ‌ల్లే నష్టపోతున్న కార్మికులు,  నిర్వాసితులు :


పర్యావరణాన్ని విధ్వంసం చేసిన ఫలితంగా ఎదుర్కొన్న హూదూద్‌ తుఫాన్‌ వలన స్టీల్‌ ప్లాంట్‌ అపార నష్టాల్ని  చవిచూసింది. ప్లాంట్‌ ఎక్కడికక్కడ ఆగిపోయింది. నిలువునా కాలిపోయినట్లు కనిపించినా మరలా తేరుకొని పచ్చదనమై పలకరించింది.  పున్నాగపూల సువాసనల‌తో, కాగితపూల అందాలతో సిటీలో కంటే 4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేసింది. కార్మికుల అదనపు శ్రమలో పూర్తిస్థాయి జవసత్వాల్ని సంపాదించుకుంది. కానీ పాలకులు చేపట్టే ప్రయివేటీకరణ విధ్వంసం వలన స్టీల్‌ప్లాంట్‌ దీని అనుబంధ పరిశ్రమలు నాశనమయ్యి , ప్రజల కొనుగోలు శక్తి తగ్గి ఈ ప్రాంత అబివృద్ధికి కోలుకోలేని  దెబ్బ తగులుతుంది. లాభాపేక్ష తప్ప సామాజిక బాధ్యత లేని ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి ఈ కంపెనీ వెళితే యస్సీ, ఎస్టీ, ఫిజికల్‌ చాలెంజ్‌డ్‌ పర్సన్స్‌ రిజర్వేషన్లు ఏమి ఆమలు కావు. కొత్త ఉద్యోగాలు రావు. ఉన్న ఉద్యోగాలకు , జీతాలకు పనిగంటలకు గ్యారెంటీ లేదు. ఇక నిర్వాసితుల విషయాని కొస్తే ఎందరి ప్రజల త్యాగాల పునాదిమీద ఈ ప్లాంట్‌ నిర్మించబడ్డతో వారికి అవసరం లేదు. నిర్వాసితుల పట్ల గౌరవం లేదు. ఉపాధి చూపించాల్సిన బాధ్యత తీసుకోని ఫలితంగా వారికి ఉపాధి వారసత్వం  బదులు పోరాట వారసత్వమే మిగిలింది.

Leave a Reply