మణిపూర్ లాంటి ఘటనలు బస్టర్ లో సుదీర్ఘ కాలంగా జరుగుతున్నాయని సోనీ సోరి తదితరులు తమ జైలు జీవిత చిత్రహింసల అనుభవాలను గుర్తు చేసుకుంటూ,  రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం ‘ (సిఎఎస్ఆర్)లో రిమాండ్  చేశారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అన్ని రంగాల్లోనూ అమలవుతున్న రాజకీయ అణచివేతకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలవాలని కోరుతూ 2023 సెప్టెంబర్ 29 శుక్రవారం నాడు ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో 35కి పైగా సంస్థల సమూహం అయిన ‘రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం ‘ (సిఎఎస్ఆర్) సమావేశం జరిగింది. ‘భిన్నాభిప్రాయాన్ని నేరపూరితం చేయడం – ఎవరెవరిని నిర్బంధిస్తారు’ అనే శీర్షికతో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ లకు చెందిన మానవ హక్కుల, భూ హక్కుల కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రారంభంలో ప్రొఫెసర్ సచిన్ ఎన్ మాట్లాడుతూ, అన్ని రకాల హింసాకాండలలో మితవాద పక్షాల వారు పాల్గొన్నట్లు కనిపిస్తుంది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కూడా ఇదే పరిస్థితి. కానీ వాటిని ఆపే పరిస్థితి లేదు. ప్రజల హక్కులు నిరంతరం ఉల్లంఘించబడుతున్నాయి అన్నారు.

విద్యార్థి నాయకుడు ఆసిఫ్ ఇక్బాల్ తాన్హా, ముఖేష్ మౌలాధ్ – జమీన్ ప్రాప్తి సంఘర్ష్ కమిటీ అధ్యక్షుడు, దామోదర్ తురి – విస్తాపన్ విరోధి జన్ వికాస్ ఆందోళన్, బిక్కర్ సింగ్ – ఆర్థిక కార్యదర్శి జమీన్ ప్రాప్తి సంఘర్ష్ కమిటీ, విద్యార్థి నాయకుడు ఆతిక్ ఉర్ రెహమాన్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

“రంజాన్ మాసంలో వున్నప్పుడు సీఏఏ – ఎన్ఆర్‌సి కేసులో పోలీసులు నన్ను అదుపులోకి తీసుకున్నారు. 13 నెలలు జైలులో ఉన్నాను, అక్కడ ముస్లింలను ఉగ్రవాదులు, జిహాదీలు అని పిలిచే పోలీసుల భయంకరమైన స్వరూపాన్ని కూడా నేను చూశాను. అదే సమయంలో లో జైలులో మిగిలిన వారికి రోజాలో(ఉపవాస దీక్ష) లో వున్న వారికి యిచ్చే ఆహారాన్ని నాకు కూడా యివ్వమంటే  నీ సెల్ మార్చేస్తారు, నీకు ఆ ఆహారం ఇవ్వడానికి మాకు అనుమతి లేదని చెప్పి తిరస్కరించి, మీకు స్వేచ్ఛ కావాలి కదా. ఇప్పుడు మీకు స్వేచ్ఛ దొరికింది అని జైలు సూపరింటెండెంట్ అన్నారు.” కోవిడ్ -19 కారణంగా కదలికలను నిషేధించినప్పుడు తనను అరెస్టు చేశారని, అరెస్టు చేసినప్పుడు తాను ఉపవాసంలో వున్నప్పటికీ  శారీరకంగా హింసించారు అని, సిఎఎ-ఎన్ఆర్‌సి వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకు పోలీసులు దారుణంగా కొట్టారని, చెట్టుకు కట్టేసి పోలీసులు బెల్టులతో కొట్టారని విద్యార్థి కార్యకర్త ఆసిఫ్ ఇక్బాల్ తన్హా దేశ రాజధాని తీహార్ జైలులో రాజకీయ ఖైదీగా తన అనుభవాలను పంచుకున్నారు. ఉగ్రవాదం పేరుతో ముస్లింలను జైళ్లలో మగ్గిపోయేందుకు పంపుతున్నారని, 14% ముస్లిం జనాభా ఉన్న దేశంలో 18% ముస్లిం ఖైదీలుగా ఉండటం సిగ్గుచేటు అని, అన్యాయానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాటాన్ని కొనసాగించాలన్నారు.

నిరంతర రాజ్య అణచివేత ఉన్నప్పటికీ, సమాజంలోని వివిధ అణగారిన వర్గాలు న్యాయం కోసం తమ పోరాటాన్ని ఎలా కొనసాగిస్తున్నాయో జమీన్ ప్రాప్తి సంఘర్ష్ కమిటీ అధ్యక్షుడు ముఖేష్ మౌలాధ్ వివరించారు. దళితులపై నిరంతరం దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వారిని అబద్ధపు కేసులతో జైలుకు పంపిస్తున్నారు. మహిళలపై కూడా హింసకు గురవుతున్నారు. మా చురుకైన సభ్యులలో 22 మందిని వివిధ రకాల తప్పుడు కేసులతో జైలులో పెట్టారు. కొంతమంది బయటకు వచ్చినప్పటికీ, కొంతమంది ఇప్పటికీ జైలులో ఉన్నారు.

పంజాబ్ లో దళిత రైతులకు 1960 లో పంచాయతీ భూమిలో మూడో వంతు వాగ్దానం చేసిన భూ పోరాటం ఎన్నడూ నెరవేరలేదని, కానీ ఈ భూమిని డిమాండ్ చేసిన వారిని జైళ్లలో పెట్టారని ఆయన అన్నారు. పంచాయతీ భూమిలో మూడింట ఒక వంతు దళితులకు మాత్రమే లీజుకు ఇవ్వవచ్చని గ్రామ సాధారణ భూమి (నియంత్రణ) చట్టం, 1961 పేర్కొంది.

పంజాబ్ లో ఉన్నత కులాల భూస్వాములు దళితుల కోసం ఉద్దేశించిన భూమిని హుక్ లేదా క్రూక్ ద్వారా పొందడం సాధారణ పద్ధతి అని, తమ భూ హక్కుల కోసం పోరాడుతున్న 17 మందిని మండూర్ పోలీసులు అరెస్టు చేసారని మౌలాధ్ తెలిపారు.

“రాజ్యం చేతిలో బందీలుగా ఉన్న మన రాజకీయ ఖైదీలు విడుదల కావాలంటే, మా భూపోరాటాన్ని ఆపాలని పోలీసులు మాకు చెబుతూనే ఉన్నారు.  చట్టబద్ధమైన హక్కు అయిన మా భూమిని మేము విజయవంతంగా గెలుచుకున్నప్పుడు కూడా, దళిత రైతులపై భూస్వాముల వంటి భూస్వామ్య శక్తుల ద్వారా కుల ఆధారిత హింసను రాజ్యం అమలు చేస్తూంది. “వారు ప్రతి అసమ్మతి స్వరాన్ని అణిచివేయాలని కోరుకుంటారు, కానీ వారు ఎంతగా మా గొంతులను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారో, మేము అంతగా పెంచుతున్నాము” అని జోడించారు.

జార్ఖండ్‌లో నీరు, అడవి, భూమి కోసం జరుగుతున్న ప్రజల పోరాటం ఛత్తీస్‌గఢ్, ఒడిశాతో కూడా అనేక సారూప్యతలను ఎలా పంచుకుంటుందో విస్థాపన్ విరోధి జన్ వికాస్ ఆందోళన్‌కు చెందిన నిర్వాసిత్వ  వ్యతిరేక కార్యకర్త దామోదర్ తురి మాట్లాడారు.

మానవ హక్కుల పరిరక్షకురాలు, భూ హక్కుల కార్యకర్తగా దశాబ్దానికి పైగా పనిచేస్తున్న, బస్తర్ దంతేవాడకు చెందిన సోనీ సూరి, రాజ్యం నక్సలైట్‌గా ముద్ర వేసిన, రెండేళ్లపాటు జైలులో వుండి నిర్దోషిగా విడుదలైన అటవీ హక్కులు, ఖైదీల హక్కుల కార్యకర్త, హిడ్మే మార్కమ్‌లు రాలేకపోవడం వల్ల వారు పంపిన వీడియోను ప్రదర్శించారు.

“గోండి” తప్ప మరే ఇతర భాష మాట్లాడలేని ఆదివాసీ హిడ్మే మార్కం, తన స్థానిక భాషలో బస్తర్‌లోని ఆదివాసీలపై జరుగుతున్న రాజ్య హింసను వివరించి, ఆదివాసీల “జల్, జంగల్, జమీన్”లపై దాడి చేసే ప్రయత్నంలో భాగంగా రాజ్యం తీసుకువచ్చిన పాలసీల గురించి చెప్పింది. 

“పోలీసులు నన్ను ఎందుకు అరెస్టు చేసి జైల్లో పెట్టారో నాకు మొదట అర్థం కాలేదు, తరువాత వారు మన నీరు, అడవులు మరియు భూమిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారని తెలిసింది. దీని కోసం మమ్మల్ని హింసిస్తున్నారు. మమ్మల్ని నక్సలైట్లు అని చెప్పి జైల్లో కూడా పెడుతున్నారు. ఏ ప్రభుత్వమూ ఆదివాసీల గురించి పట్టించుకోదు. ప్రతి ఒక్కరూ మమ్మల్ని నీరు, అడవి, భూమి నుండి దూరం చేయాలనుకుంటున్నారు.

అదానీ భూసేకరణ ‘అభివృద్ధి’ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడి జైలుకెళ్లిన సమయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.”ఆదివాసీ మహిళలు అనుభవిస్తున్న రోజువారీ హింసాకాండ అనుభవాలను, అత్యాచారాలకు గురవడం, కొట్టడం, నగ్నంగా ఊరేగించడంలాంటి విషయాలను మాటల్లో, చిత్రాలలో వర్ణించలేమని అన్నారు.

“మాతో పాటు పోరాడుతున్న మహిళా పోరాటాలను చూసినప్పుడు, మేం ఎదుర్కొన్నది నామమాత్రమని  భావిస్తున్నాను” ” ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాజ్యం  తన అన్ని యంత్రాంగాలతో ప్రతి శక్తిని ఉపయోగించగలదు, కాని మేము స్పష్టంగా ఎదుగుతున్నాము, ఎన్ని రకాల అణచివేతను ఎదుర్కొంటున్నప్పటికీ ముందుకు సాగుతామన్నారు మర్కమ్.

తనపై పెట్టిన తప్పుడు  కేసుకు వ్యతిరేకంగా 12 ఏళ్ల పాటు పోరాడిన సోనీ సూరి, ఇంత కాలం గడచిన తర్వాత కూడా బస్తర్ స్థితి మారలేదన్నారు. పోలీసులు నన్ను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. నేను నిర్దోషినని రుజువైంది. కానీ నన్ను  పోలీసులు నన్ను హింసించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు యిప్పటికీ ఊపిరాడకుండా చేస్తున్నారు, అనవసర విచారణలు జరుపుతున్నారని అన్నారు.

పోలీసులు తరచుగా తన దగ్గరకు వచ్చి పెళ్లి అయిందా, పిల్లలు ఉన్నారా, పిల్లలు ఉంటే పాలిస్తున్నారా అని అడిగేవాళ్లని, తనకు పిల్లలు ఉన్నారని, వారికి పాలిస్తున్నానని చెబితే అది నిజమని నిరూపించుకునేందుకు పోలీసులు తన చనుమొనలని నొక్కారని ఆమె ఆరోపించారు. మావోయిజం పెరగడం, వ్యాప్తి చెందడానికి ఈ వ్యవస్థే కారణమని అన్నారు.

“ఇది చాలా సులభం, ఇది రాజ్యం చేతిలో ఉంది, ప్రజలకు సమాన హక్కులు ఇవ్వడం ద్వారా ప్రజలకు వారి భూములను వారికిచ్చేయడం ద్వారా మావోయిజాన్ని అంతం చేయవచ్చు, కానీ, వాస్తవమేమిటంటే, మావోయిజాన్ని అంతం చేయడం కాదు, ప్రజలకు చెందిన వనరులు అధికంగా ఉన్న భూములను లూటీ చేయడంలోనే వారి ఆసక్తి” అని ఆమె తెలిపారు.

మణిపుర్ ప్రజలకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ, అక్కడి పరిస్తితి చాలా వేదనాభరితంగా వుందని, అయితే ప్రతి రాష్ట్రమూ అదే విధానాన్ని అవలంబిస్తోందని, అలాంటి ఘటనలు బస్టర్‌లో చాలా కాలం నుంచి జరుగుతున్నాయి, అలాంటివి మాకు కొత్త కాదు అని అంటూ మణిపూర్, ఛత్తీస్‌గఢ్‌లలో రాజ్య హింసాకాండ గాథలలో వున్న సారూప్యతను ఎత్తి చూపారు. పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్లు దాఖలు చేయమని ప్రజలు మహిళలను, మమ్మల్ని అడుగుతున్నారని, అయితే నేరస్థులు పోలీసులే అయినప్పుడు పోలీసులే దౌర్జన్యానికి పాల్పడినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేస్తాం అన్నారు.

 “పోలీసులే నేరస్థులయినప్పుడు, చట్టం ఎలా పని చేస్తుంది? మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ రారు, చట్టం మిమ్మల్ని రక్షించదు అని బాహాటంగానే చెప్పే పోలీసులను ఎవరు పర్యవేక్షిస్తారు? ఈ చట్టం ఎలా సహాయం చేస్తుంది?అని ప్రశ్నించారు.

ప్రభుత్వమూ, పోలీసులూ రెండూ అదానీ కోసం పనిచేస్తున్నాయి. ఆడానికి బెలాడిలా కొండలపై కన్ను పడింది. మన సుదీర్ఘ పోరాటం వల్ల ఈరోజు అదానీ, ప్రభుత్వం కొండలను, అడవులను దోచుకోవడంలో విజయం సాధించలేకపోతున్నారు. మా పోరాటం చాలా కాలం పాటు కొనసాగుతుంది. అందుకు మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము.

 “మేం పోరాడతాం, నీరు, అడవి, భూమి కోసం మాట్లాడతాం” అని దృఢంగా చెప్పారు.

https://maktoobmedia.com/india/activists-recount-custodial-torture-for-opposing-govt-urges-for-release-of-all-political-prisoners/

Leave a Reply