మలయ మారుతాలెక్కడివి
దేశం నిండా ముళ్ల కంచలే 
పచ్చని పంటలాంటి పైటలెక్కడివి 
రథచక్రాలు నడిచిన దారిలో
చితికిన అంగాంగాల ప్రదర్శన సాగుతూనే వున్నది

నా శరీరానికి రంగేమిటని
నన్నడగబోకు
ఏ జాతికి చెందినదాన్నో
నన్నడగబోకు
సిరి సంపదలున్న దేశంలో
సీకులు దిగిన దేహం నాది
గంగా నదిలో పారుతున్నది ఏమిటని 
ఇంకా నన్ను అడగబోకు

సరస్వతీ దేవిని చావబాదిన చరిత్ర నీది
లక్ష్మీదేవిని నగ్నంగా ఊరేగించిన ఘనత నీది
పార్వతీ దేవిని చెరిచిన  మేధస్సు నీది
తిరంగ జెండాను చీల్చడానికి
త్రిశూలాలను తయారు చేసిన చెడ్డీ నీది 
నీ పార్టీ హిట్లర్ పార్టీని ఎప్పుడో మించిపోయింది
ఫాసిజంలో ఫస్టు ర్యాంకు నీదే గురు

వందేమాతరం పాటలో
పాపం ఎంతమంది  దేవతల పేర్లున్నాయో వెతుకుతున్నారు
కాషాయ జెండాలకున్న కర్రలు
ఏరోజు ఏ దేవతల యోనుల్లోకి పోతున్నాయో
అంచనా వేయడం కష్టంగా వున్నది
ఏ బుర్ఖాలోకి చొరబడి
ఏ సున్నితమైన చర్మానికి గుచ్చుకుంటుందోనని
భయం భయంగా వున్నది 

నరబలులకు నగ్నదేహాల ఊరేగింపులకు
చరిత్ర పొడుగునా రథయాత్రలే సాక్ష్యం!

ఈ దేశంలో దుర్గాదేవి పేరు పెట్టి
గంగానదిలో ముంచి సంపుతారు
పేరు మరో మతానిదైతే
చంపడం మరింత సులువు

ఇది
చల్లని వెన్నెల కలిగిన రాత్రేమీ కాదు 
తెగిపడిన స్తనాలు
మచ్చ వున్న చందమామ వలె అగుపిస్తున్నవి
ఇది
చల్లని వెన్నెల కలిగిన రాత్రేమీ కాదు
వెచ్చవెచ్చగా నలుపుపై ఎరుపు కారుతా వున్నది!

రామబాణం రక్షణ కోసమేనని నమ్మినంత కాలం
ఎందరో సీతలను నగ్నంగా ఊరేగిస్తారు
మణిపూర్  మొదటిది కాదు, చివరిది కాదు
పోలీసు మిలిటరీ కుక్కలకూ తెలుసు
ఖద్దర్ చొక్కాలకూ తెలుసు
ఆదివాసులెందరు
నగ్నంగా నిలువునా చీల్చబడ్డారో!

Leave a Reply