( మణిపూర్ లో హింస ను “స్టేట్ -స్పాన్సర్డ్ ” అని , నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ నుండి ముగ్గురు సభ్యుల నిజనిర్ధారణ బృందం తన నివేదికలో బహిర్గతం చేసింది. ” రాష్ట్రంలో జరుగుతున్నది మతహింస కాదు లేదా రెండు వర్గాల మధ్య పోరు కాదు, ఇది భూమి, వనరులు, మతోన్మాదులు,  మిలిటెంట్ల చుట్టూ తిరుగుతూ ఉంది.  ప్రస్తుత సంక్షోభానికి దారితీసిన

కార్పొరేట్ అనుకూల ఎజెండా అమలు సాకారం చేసేందుకు ఫాసిస్టు ప్రభుత్వం చాకచక్యంగా వ్యూహం పన్నినందువలన  హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. NFIW  ప్రధాన కార్యదర్శి ఆని రాజా , జాతీయ కార్యదర్శి నిషా సిద్దు , స్వతంత్ర న్యాయవాది దీక్ష ద్వివేది తో కూడిన బృందం తమ నివేదికలో పేర్కొంది. ఆక్రమిత భూమి లో నిర్మించారనే నెపంతో న్యూచెకాన్లో ప్రభుత్వం మూడు చర్చలను కూల్చివేయడం, కంగ్ పోప్కి , తెంగూపాల్ ప్రాంతాల నుంచి కుకీ గ్రామస్తులను తొలగించటం, అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ పేరుతో వారి ఇళ్లను కూల్చివేయడం,  మెయితీలకు మణిపూర్ కోర్టు ఎస్టీ హోదా ప్రకటించటం)

నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ జనరల్ సెక్రటరీ, ఆనీరాజా జాతీయ కార్యదర్శి నిషా సిద్దు, డిల్లీ న్యాయవాది దీక్షా ద్వివేది నిజనిర్ధారణ బృందం 28 జూన్ 2023 నుంచి జులై 1 వ తేదీ వరకు మణిపూర్ లో పర్యటించారు. రాజ్యాంగ వ్యవస్థ ల వైఫల్యం, జీవించే హక్కుకుప్రమాదం, సంక్షోభం వలన NFIW  ఈ విషయంలో చొరవ తీసుకునేలా ప్రేరేపించింది.

మణిపూర్ సందర్శనకు మునుపే అక్కడ నుంచి పారిపోయి డిల్లీ చేరిన కుకీ,మెయితీ కమ్యూనిటీలకు  చెందిన మహిళలతో  NFIW  డిల్లీ లో వరుస సమావేశాలు నిర్వహించింది.  వారివలన కొన్ని విషయాల్లో స్పష్టత వచ్చింది.  రాష్ట్రంలో శాంతి, సుస్థిరతకు ,మహిళలకు , పిల్లలకు రక్షణ కల్పించాలంటే  పౌరసమాజం ప్రజాస్వామ్య జోక్యం అవసరమని బృందం సభ్యులు భావించారు.  మణిపూర్ లో ఈ బృందం వివిధ వర్గాల ప్రజలను కలిసి సంప్రదింపులు జరిపింది. జూన్ 28 న ఇంఫాల్ తూర్పు లోని మూడు సహాయ శిబిరాలను,ఒక ప్రభుత్వ ఆసుపత్రిని బృందం సందర్శించినది. ( రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ )

జూన్ 29 వ తేదిన  బిష్ణుపూర్ జిల్లా మెయిరాంగ్ లోని రెండు సహాయ శిబిరాలను, జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని బృందం సందర్శించింది.సాయంత్రం   IMA  మార్కెట్ ను కూడా సందర్శించి మెయిరా పెయిబిస్తో మాట్లాడారు. 30 వతేది బృందం చురాచాంద్ పూర్ జిల్లా ను సందర్శించింది. రిలీఫ్ క్యాంపులో హింసకు గురైన అనేక మంది బాధితులను కలుసుకుంది.వీరిలో  ఇద్దరు యువతులపై మెయితీ యువకుల గుంపు దారుణమైన  దాడికి , హింసకు పాల్పడ్డారు.

ఈ బృందం చురాచాంద్ పూర్ జిల్లా కలెక్టర్ ను, బిష్ణుపూర్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ను కూడా కలిసి సహాయక శిబిరాల్లో బాధితుల కోసం అక్కడ పరిస్థితి మెరుగు పరచాలని కోరింది.

 జులై 1వతేదిన ఇంఫాల్ వెస్ట్ డిస్ట్రిక్ట్ లోని మణిపూర్ బాప్టిస్ట్ కన్వెన్షన్ సెంటర్ చేర్చి మరియు కాథలిక్ బిషప్ హౌస్ ను బృందం సందర్శించింది.

బృందం పరిశీలనాంశాలు:

మణిపూర్ ప్రజలకు సాధారణ జీవితం ఇప్పుడు లేదు.  రోజువారి జీవితం అబద్రతలో

గడుస్తున్నది. శాంతి,  సామాజిక, ఆర్థిక. స్థిరత్వం నాశనమై పోయాయి. ఫాసిస్టు ప్రభుత్వం చాకచక్యంగా కార్పొరేట్ అనుకూల ఎజెండా ను సాకారం చేసుకోవడానికి ప్రస్తుత సంక్షోభానికి దారితీసిన వ్యూహాలను అమలు చేసింది.

ఇది రాష్ట్ర ప్రాయోజిత హింస:

మే 3 వతేదిన  జరిగిన హింస  స్వతహాగా జరగలేదు.పూర్తిస్థాయి అంతర్యుద్ధం లాంటి పరిస్థితి నెలకొల్పడానికి రాష్ట్రం, కేంద్రంలోని అధికార యంత్రాంగం రెండు వర్గాల మధ్య అపనమ్మకం,ఆందోళనలు రేకెత్తించింది. 2023 మార్చి, ఏప్రిల్ నెలల్లో అనేక సంఘటనలు జరిగాయి.హింసాత్మక ఘర్షణలు  నివారించకుండా ప్రభుత్వం  కౄరమైన హింస  వ్యాప్తి చెందటానికి అనుమతించింది.

మణిపూర్ లో మెయితీలకు ఆధిపత్య స్థితిలో ఉన్నారు.కుకీలను అనాగరికులుగా తక్కువగా చూస్తారు.రాజ్యాంగ బద్దమైన హామీల మూలంగా కుకీలు విద్యా బ్యాసం, ఉద్యోగావకాశాలు పొంది సామాజిక అభివృద్ది సాధించారు.కుకీల్లోని అభివృద్ధి మెజారిటీ మెయితీ  కమ్యూనిటీల కోపం , ద్వేషానికి కారణమైంది. మణిపూర్ ప్రజల జీవితాలను , జీవనోపాధిని కాపాడటానికి చర్యలు  తీసుకోవటానికి బదులు ప్రభుత్వం రెచ్చ గొట్టే చర్యలు కొనసాగిస్తూనే ఉంది.ఇది ఆ రెండు తెగల మధ్య అగ్ని కి ఆజ్యం పోసింది.

కొన్ని ముఖ్యమైన అంశాలు:

ఆక్రమిత భూమి లో నిర్మించారనే సాకు తో  న్యూచెకాన్లో ప్రభుత్వం మూడు చర్చలను కూల్చివేయడం.

అటవీ సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ పేరుతోకంగ్ పొప్కీ,తెంగూపాల్ ప్రాంతాల నుంచి కుకీ గ్రామస్తులను తొలగించి,వారి ఇళ్ళను కూల్చివేసింది.

మెయితీలకు ఎస్టీ హోదా కు మణిపూర్ హైకోర్టు  ఉత్తర్వులు

సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ కు ముగింపు పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన  ప్రయత్నం. 

ఈ సంఘటన లకు వ్యతిరేకంగా  ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ , మణిపూర్ మే 3వతేదీన చురాచాంద్ పూర్ జిల్లా లో మధ్యాహ్నం 12 గంటలకు శాంతి ర్యాలీ ని ప్రారంభించారు.మద్యాహ్నం 3గంటలకు హింస మొదలైంది.

శాంతి యాత్రపై మెయితీలకు కోపం.అందుకే  పవిత్ర ఇండో ,కుకీ వార్ మెమోరియల్ ను తగులబెట్టేందుకు ప్రయత్నం చేశారని కుకీలు ఆరోపించారు. మెయితీలు చురాచాంద్ పూర్ కు పెద్ద సంఖ్యలో వచ్చారు. వాళ్ళు కుకీ ల ఇళ్ళను ముందు గానే గుర్తించారు. ఇదే సమయంలో మతోన్మాదులు, మిలిటెంట్ల, దుర్మార్గులు ఈ స్థితిని  ఉపయోగించుకున్నారు.

మేం 3,4తేదీలలో మెజారిటీ ఇళ్ళు దగ్ధం అయ్యాయి.హింస నియంత్రణలో రాష్ట్ర పోలీసు అధికారులు, భద్రతాదళాలు అలసత్వం వహించాయి.

రాష్ట్రం తగులబడుతుంటే ముఖ్య మంత్రి రాత్రి 7గంటలవరకు ఉపరాష్ట్రపతి కి ఆతిథ్యం ఇవ్వటంలో, ట్విట్టర్ లో చిత్రాలను అప్లోడ్ చేయటంలో బిజీగా ఉన్నాడు. ముఖ్య మంత్రి అసమర్థత ఈ పరిస్థితికి కారణమని రెండు వర్గాల భావన.

సహాయ శిబిరాలు:

రిలీఫ్ క్యాంపులు పౌరసమాజం,ఇతర సంస్థల సహకారంతో నడుస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు  సహాయక శిబిరాల్లో బాధితుల పరిస్థితి ప్రభుత్వ నిరాసక్తత కు అద్దం పడుతుంది. ఇది స్పష్టంగా వారిని అగౌరవ  పరచటమే.

శిబిరాల్లో రోజువారీ కూలీలు, కార్మికులు,సాధారణ ప్రజలు న్నారు.   పిల్లలు, యువకులు. తమ చదువులు కొనసాగించలేక,ఉపాధి పొందలేక భవిష్యత్తు పై అనిశ్చితి తో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. శిబిరాల్లో ప్రజలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారాలకు సంబంధించిన  కమీషన్ కూడా ఏర్పాటు చేయలేదని తెల్సింది.   శిబిరాల్లో 1నెల వయసు నుంచి 80ఏండ్ల వృద్దుల వరకు ఉన్నారు.  గర్భిణులు,రకరకాల అనారోగ్య సమస్యలతో  బాధపడుతున్నారు‌ వైద్యం అందటంలేదు. ముఖ్యంగా చిన్నారులు,వృద్ధులు, ప్రభు త్వం అందించే ఆహరం  సరిపోవటం లేదు.. స్వచ్చమైన నీరు, పారిశుధ్యం శానిటరీ ప్యాడ్ ల కొరత ఉంది.

ముగింపు:

రాష్ట్రప్రభుత్వం పనిచేయటం లేదు ‌.సంక్షోభం కొనసాగుతోంది. కేంద్రం నేరపూరిత ఉదాసీన వైఖరితో పరిస్థితి మరింత తీవ్రతరం చేసింది.మహిళలపై, పిల్లలపై దారుణమైన అణిచి వేత,హింస కొనసాగుతోంది. రాష్ట్రం ప్రభుత్వ ప్రైవేటు ఎజెండా మణిపూర్ వర్తమానానికి కారణం.మణిపూర్ పౌరులు శాంతిని ,సాధారణ స్థితిని కోరుకుంటున్నారు.   ప్రభుత్వం, భద్రతాదళాలు పోషించే పాత్ర పట్ల వారికీ నమ్మకం లేదు.

డిమాండ్ల చార్టర్:

  • అన్ని సమూహాలను,వ్యక్తులను నిరాయుధులను చేయటం.
  • శాంతి సామరస్యం కోసం అన్ని ప్రయత్నాలు ప్రారంభించాలి.
  • మహిళా సంస్థలను కలుపుకొని
  • విశ్వాసం పెంపొందించే చర్యలు ప్రారంభం కావాలి.
  • ముఖ్య మంత్రి బీరేన్ సింగ్ తక్షణం రాజీనామా చేయాలి.
  • సుప్రీం కోర్టు న్యాయ ప్రక్రియ ను  పర్యవేక్షించాలి.
  • ఎఫ్  ఐ ఆర్ లు నమోదు  చేయాలి.
  • క్లెయిమ్ కమీషన్ ఏర్పాటు చేసి బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి
  • సహాయక శిబిరాల్లో పరిస్థితులు  తక్షణమే మెరుగు పరచాలి.
  • జీవనోపాధిని అవకాశాలతో పాటు పునరావాసం, ఉపశమన చర్యలు వేగవంతం చేయాలి.
  • విద్యార్థులు విద్యను కొనసాగించేలా తక్షణం చర్యలు తీసుకోవాలి. 
  • రెండు వైపులా ఒకే భద్రతాదళంతో బఫర్ జోన్ ను  సెటప్ చేయాలి..

(జనతా వార పత్రిక నుంచి)

One thought on “మణిపూర్ హింస మతపరమైనది కాదు, ప్రభుత్వ ప్రాయోజిత కార్పొరేట్ ఎజెండా

Leave a Reply