ఒకరి గురించి దుఃఖపడడం గుండె కవాటాలను మెలితిప్పుతుంది కదా .... పెంచిన చేతులలోనే చివరి శ్వాస వదిలే పసిపాపల కనులను చూస్తూ ఆ గుండెలు మూగబోవా! .... నీకేమి కాదు మెదడులోకి ఇంకినది హృదయంలోకి ఇగరని మనిషివి కదా .... నాకెందుకో నా చెవులలో ఆ పసిపాపల రోదనలు తప్ప ఏమీ వినిపించదు .... ఆ కూలిన ఆసుపత్రుల గోడలనంటిన నెత్తుటి చారికల మధ్య నా మొఖం అగుపిస్తోంది .... ఎన్నిసార్లు రాసినా నీ దుఃఖ వాక్యమే మరల మరల వెంటాడుతోంది పాలస్తీనా ..... అంతరించిపోతున్న నీ నేల పచ్చని గురుతులు దుఃఖాన్ని ఆలపిస్తూ .