బస్తర్ లో వివిధ ప్రాంతాల్లో ఆదివాసీల ఉద్యమాలు జరుగుతున్నాయి. గత ఏడాదిన్నర నుంచి ఆదివాసీలు తమ వివిధ డిమాండ్లతో ఉద్యమాలు చేస్తున్నారు.  అణచివేత ద్వారా లేదా ఒత్తిడి తీసువచ్చి కొన్ని ఉద్యమాలను పోలీసులు, ప్రభుత్వమూ ధ్వంసం చేశారు, అంతం చేశారు. కానీ కొన్ని చోట్ల ఉద్యమాలు నేటికీ కొనసాగుతూనే వున్నాయి.

వాటిలో ఒకటి నారాయణపూర్‌లోని ఓర్చాలో కొనసాగుతోంది.

ఓర్చాలో వందలాది మంది ఆదివాసీలు గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ఆందోళన చేస్తున్నారు. వందలాది గ్రామాల నుంచి వందలాది మంది గ్రామస్తులు యిక్కడ వున్నారు, భోజన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

ఓర్చాను మాడ్ ముఖద్వారంగా భావిస్తారు యిక్కడ నుంచే మాడ్‌లోకి ప్రవేశిస్తారు..

యిక్కడ మాకు భోజన ఏర్పాటు కూడా చేశారు. పొద్దున్న కోడి కూర తినిపించారు. రాత్రికి చేపల కూర చేశారు.

యువతీ, యువకులు ఉద్యమ బాధ్యత వహిస్తున్నారు.

మూలవాసి బచావో ఆందోళన్ బ్యానర్ క్రింద ఈ ఉద్యమం నడుస్తోంది.

అనేక గుడిసెలు వేశారు. ఒక గ్రామాన్ని ఏర్పాటు చేశారు. ఇది రాత్రి సమయం..సరిగా కనబడడం లేదు. రోడ్డుకి రెండు వైపులా ఇలా గుడిసెలు వేశారు.

ఇతను  ఉద్యమ ప్రారంభం నుంచి బాధ్యతలలో వున్నాడు. మూలవాసి బచావ్ మంచ్ సభ్యుడు. రానూ పూడియా కూడా బాధ్యుడు.

రానూ పూడియా: మా ఆందోళన 2023లో మొదలైంది. అనియమిత కాల ధర్నా ప్రద్రర్శన జరుగుతోంది. మావి మూడు అంశాల డిమాండ్లు. ఛత్తీస్‌ఘడ్‌లో విష్ణు దేవ్ సాయ్ రాష్ట్ర ప్రభుత్వం, అంతకు ముందు భూపేష్ బాగేల్ ప్రభుత్వానికి మేం చేసిన డిమాండ్లు – మా షెడ్యూల్డ్ ప్రాంతంలో గ్రామ సభ ఏర్పాటు చేయాలి .. పెసా చట్టం కింద గ్రామ సభ అనుమతి లేకుండా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టకూడదు. దీంతో పాటు నూతన పోలీసుక్యాంపుల ఏర్పాటు తీర్మానాన్ని రద్దు చేయాలి. రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమాన్ని నిలుపు చేయాలి. పెద్ద పెద్ద ట్రక్కులు, గనుల త్రవ్వకాల్ని తీసుకెళ్లడానికి వీలయ్యే రోడ్లను వేయాలనుకుంటోంది ప్రభుత్వం. మాకు ఆ రోడ్లు అవసరం లేదు. మా ఆదివాసీలకు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఇంట్లోకి సబ్బులు, నూనె కొనుక్కోవడానికి లేదు. అలాంటప్పుడు యింత పెద్ద వాహనాలు వెళ్ళే రోడ్లు వేయాల్సిన అవసరం ఏముంది? మాకు ఆసుపత్రికి వెళ్లడానికి కి, స్కూళ్ళకి టీచర్లు వెళ్లాలంటే లేదా ట్రాక్టర్లు వెళ్లడానికి చిన్న రోడ్లు చాలు. కానీ ప్రభుత్వం పెద్ద హైవే రోడ్లు వేయాలనుకుంటోంది. మేం దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మేం రోడ్డు వద్దు అనడం లేదు. మాకు రోడ్లు కావాలి కానీ అది ట్రాక్టరు వెళ్లడానికి. పెద్ద రోడ్లు వేయడానికి పెద్ద పెద్ద చెట్లను కొట్టేస్తున్నారు. మా తాత, ముత్తాతలు కాపాడుకొచ్చిన చెట్లను కొట్టేస్తున్నారు. ప్రాకృతిక నష్టం జరుగుతోంది. గనుల త్రవ్వకం ఎక్కువైపోతోంది. అనేక కొండల్లో బొగ్గు, బాక్సైట్, వజ్రాలు, వెండి, బంగారం, ఇనుప ఖనిజాలు వుండచ్చు. వాటన్నిటినీ మా బస్తర్ నుంచి తీసుకెళ్లిపోతున్నారు. యిది ఆపేయాలనే డిమాండ్ తో మేం ధర్నా చేస్తున్నాం.

మా మొదటి డిమాండ్ మొదటి పెసా చట్టం 1994 ని అమలు చేయాలి. గ్రామసభ తీర్మానం చేయకుండా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టకూడదు. అది మా రాజ్యాంగ హక్కు.

రానూ పూడియా: మమ్మల్ని లక్ష్యంగా చేసుకుని లఖ్మా దాదాని అరెస్టు చేసి జగడల్ పూర్ జైలులో పెట్టారు. ఆయన  మొదట అధ్యక్షుడిగా వుండేవాడు.

రానూ పూడియా: షెడ్యూలు ప్రాంతంలో ప్రాధమిక హక్కుల చట్టం గ్రామసభ బస్తర్‌లో లేదా 5వ షెడ్యూలు ప్రాంత రాష్ట్రాల్లో అభివృద్ధి జరగలేదు ప్రజలు అట్లాగే వున్నారు. అలాంటి ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ప్రజల ప్రయోజనం కోసం చేయాలి. వారందరినీ ఒక దగ్గర కూచోబెట్టాలి. గ్రామసభలో అడగాలి. కలెక్టర్ రావచ్చు, తహశీల్దార్ రావచ్చు యిక్కడ ఏమి యిబ్బందులు వున్నాయి, ఏం అభివృద్ధి జరగాలి అని ఆలోచించాలి. రాష్ట్ర పథకాల వల్ల పని దొరుకుతుంది అని ప్రజల మధ్యకు వచ్చి చెప్పవచ్చు. గ్రామ సభను గుర్తించడం లేదు. రాజ్యాంగాన్ని గుర్తించడం లేదు. మీరు అసెంబ్లీలలో, పార్లమెంటులో వుంటున్నారు. నక్సలైట్లు కూడా రాజ్యాంగాన్నిగుర్తించడం లేదు. ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడవడం లేదు. ఉల్లంఘిస్తోంది. పెసా చట్టం లేదా ప్రాధమిక హక్కుల చట్టం ప్రకారం చూస్తే వాటిని నేరుగా ఉల్లంఘిస్తున్నారు.

రానూ పూడియా: అవును. నేను చెప్పేది అదే. రాజ్యాంగం దేశ ప్రజలందరి కోసం వుంది. ప్రజాస్వామికంగా వుండాలి. జీవించే అధికారం అందరికీ వుండాలి. కేంద్ర స్థాయిలో పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీలు వున్నాయి. మా హక్కుల గురించి చెప్పే అధికారం బాబా సాహెబ్ అంబేద్కర్ వల్ల వచ్చింది.  అణగి వుంటే మరింత అణచివేస్తారు.. మూలవాసీలందరూ సమానంగా వుండే అధికారం వుంది . కానీ ఈ నాడు హక్కులన్నింటినీ లాగేసుకుంటున్నారు. భూములను లాక్కుంటున్నారు, గనుల త్రవ్వకాన్ని విస్తరిస్తున్నారు, గ్రామ సభల అనుమతి లేకుండా అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి కోసం పోరాడుతుంటే నక్సలైట్లు అంటున్నారు.  జైళ్ళలో పెడుతున్నారు. 22 చోట్ల ఆందోళన జరుగుతోంది. అన్నీ చోట్లా జైలుకు పంపుతున్నారు. కుట్రతో చట్ట వ్యతిరేక చర్యలు అమలుచేస్తున్నారు. అదానీ అంబానీ లాంటివారి లాభాల కోసం ప్రభుత్వం వారితో కుమ్మక్కై వారికి అనుకూలంగా చట్టాలు అమలు చేస్తోంది.

రానూ పూడియా: మూడవ డిమాండ్ గనుల త్రవ్వకానికి సంబంధించినది. గుండా కొండ క్రింద బంగారం వుంది అంటారు. మొదట్లో బ్రిటీషు వారి కాలంలో బంగారాన్ని తీసేవారు. ఎడ్ల బండ్లలో వేసుకొని తీసుకెళ్ళేవారు అని మా తాత, ముత్తాతలు అంటారు. మొత్తం తవ్వేసి మట్టి దిబ్బలు మిగిల్చారు. 1933లో చేశారు అని అంటున్నారు. అక్కడ మళ్ళీ త్రవ్వకాలను మొదలుపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రజలు కూడా తెలుసుకున్నారు, గనుల త్రవ్వకాల్ని విస్తరిస్తే కనక చుట్టూ ప్రక్కల గ్రామాల మీద ప్రభావం పడుతుంది మేకలు ఆవులు గేదెల లాంటి జంతువులకు మనుషులకు నష్టం జరుగుతుంది. కాలుష్యం పెరిగితే చెట్లు చేమలు కూడా నష్టమైపోతాయి. పంటలు పండవు. బొగ్గు గనుల త్రవ్వకాలు జరిగితే పొలాలకు నష్టం కలుగుతుంది, నీళ్ళు పాడైపోతాయి. అందుకని వ్యతిరేకిస్తున్నాం.

రానూ పూడియా: ప్రజలకు ఏం ప్రయోజనం వుంటుంది? నష్టమే జరుగుతుంది. అక్కడ నుంచి వర్షాకాలంలో ప్రవహించే నీరు నదిలోకి వెళ్ళి నీరు ఎర్రగా మారిపోతుంది. జారా ఘాటీలో నీళ్ళను పైపుతో లాగి గనుల నుంచి తీసిన ఇనుమును కడుగుతారు. కడిగినప్పుడు ఎర్ర నీళ్ళు పారుతాయి. పొలాల్లోకి ప్రవహిస్తాయి. దానివల్ల పొలాలు ఎండిపోతాయి. అక్కడి ప్రజలు డోంగర్ ప్రాంతంలోని గ్రామాల ప్రజలు కష్టాల్లో వున్నారు.  కలెక్టర్‌ను కూడా అక్కడికి పిలిచారు. రాస్తా రోకో చేశారు. గనుల త్రవ్వకాల వల్ల అభివృద్ధి కాదు, లాభాలు సంపాదించాలనే వారి కోరిక కనబడుతోంది.  డోంగర్ ప్రజలకు ట్రక్కులు యిస్తున్నారు, మోటారు సైకిళ్ళు యిస్తున్నారు, పైసలు యిస్తున్నారు.

రానూ పూడియా: మీకు అట్లా అనిపించవచ్చు. మా దగ్గర రాఛాలో ఒక గాని త్రవ్వకం జరుగుతోంది.  ఉదాహరణకు చెప్తున్నా. ఓర్చా ప్రజలకు ట్రక్కులు యిస్తారు ప్రభుత్వం కోసం పని చేస్తారు. దాని వల్ల ఏం లాభం జరుగుతుంది. మా బస్తర్ కోసం గుండాధుర్ పోరాడాడు ఈ బస్తర్ ను రక్షించడానికి. ఉరే గుండా కొండలో గనుల త్రవ్వకం విస్తరణ జరిగినప్పుడు గుండాధుర్‌తో పాటు మా తాత ముత్తాతలు పోరాడి రక్షించారు. యిప్పుడు ఆ గని త్రవ్వకం మొదలుపెడితే వారి త్యాగం వృధా అయిపోతుంది.  గనుల త్రవ్వకం మొదలుపెట్టి ఈ చుట్టుప్రక్కల గ్రామాలను అభివృద్ది చేస్తే మంచిదే.

Leave a Reply