న్యాయమూర్తులు చట్టానికి కట్టుబడి దానిని అమలు చేయడం చాలా గొప్ప విషయం. అందు కోసమే వారు ఉన్నారు. ఇటీవలి కాలంలో, న్యాయమూర్తులు “ఉగ్రవాదం”,  “అర్బన్ నక్సల్స్” అనే పదాలపై కొట్టుకుపోవడాన్ని మనం చూశాము. అలా కాని న్యాయమూర్తులు కనిపిస్తే మంచిగా అనిపిస్తుంది. కానీ న్యాయవాదుల బృందం కూడా చట్టంపై దృష్టి సారించింది, చట్టాన్ని ఎలా ఉల్లంఘించారో చూపించింది అనే విషయం నేను తప్పక చెప్పాలి. అలా చేయడం వల్లనే వారు  నిర్దోషులుగా విడుదల కాగలిగారు. ఏదేమైనా, ఈ విజయంతో పాటుగా, ఏ న్యాయస్థానం కూడా వారికి కోల్పోయిన సంవత్సరాలను, ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వదు అనే నిరుత్సాహకరమైన అంశం కూడా వుంది. వ్యవస్థ చాలా మారాలి అనేది స్పష్టమైన విషయం.

చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అవసరమైన విచారణకు అనుమతి లేకపోవడం అనే అంశం మీద ఈ తీర్పు సుదీర్ఘంగా చర్చిస్తుంది. పోలీసులు తరచుగా దీనిని “విధానపరమైన లోపం”గా తోసిపుచ్చారు. దీని ఆధారంగా మీడియా కూడా “కేవలం సాంకేతిక కారణాలతో” వారు నిర్దోషులు అని వివరిస్తుంది. ఈ తీర్పు ద్వారా దీనికి ఇచ్చిన ప్రాధాన్యత ఈ అవగాహనల్లో ఏమైనా మార్పును కలిగిస్తుందా?అనేది సందేహమే.

 జీవించే హక్కు, స్వేచ్ఛ అంటే ఏమిటి? చట్టం ద్వారా ఏర్పాటైన విధానం ద్వారా తప్ప ఏ వ్యక్తికీ జీవితం, స్వేచ్ఛలను  నిరాకరించకూడదు. ‘టెక్నికల్‌’ (సాంకేతికత)కు  అర్థం ఆర్టికల్ 21. సాంకేతిక చట్టాన్ని ఉల్లంఘించడం అనేది  మూలాధార చట్ట (సిద్ధాంత న్యాయశాస్త్ర) ఉల్లంఘనకు దారి తీస్తుంది. ఈ తీర్పు నుండి ఒక ఉదాహరణ తీసుకోండి. స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఎలాంటి హాష్ విలువ తీసుకోలేదు. స్వాధీనం చేసుకున్న తర్వాత వారు ఆ విషయాలు పెట్టలేదు అని ఎలా తెలుస్తుంది? స్వాధీనం చేసుకున్న వస్తువులకు సీలు వేయలేదు. స్వాధీనం చేసుకున్నాక ఏం పెట్టారో మనకు ఎలా తెలుస్తుంది?  న్యాయానికి ‘ప్రక్రియ’ సేవకుడు  అని అంటారు. నేడు మనందరినీ నరకానికి పంపకుండా వుండే  ఏకైక విషయం ఇది.

 ఇది కేవలం హెచ్చరిక కాదు. ఈ సందర్భంలో, ‘అనుమతినివ్వడం’ అనేది  శూన్యమైపోయింది. ఇది మెదడును ఊపయోగించకపోవడం అవుతుంది. ఇది యాంత్రిక ఆంక్షలు ఇవ్వడాన్ని నిరుత్సాహపరుస్తుంది. మన సంస్థలు తమ స్వాతంత్య్రాన్ని కోల్పోయాయి, ముఖ్యమైన విధుల్లో ఉన్నవారు చెప్పినచోట వేలి ముద్ర వేస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్ల తగిన పరిణామాలు ఉంటే తప్ప, పరిస్థితి మారకపోవచ్చు.

 నిస్సందేహంగా పనిచేస్తుంది.  స్వతంత్ర సమీక్ష (నిందితులకు వ్యతిరేకంగా ఉన్న అంశాల ఆధారంగా యుఎపిఎ కింద మంజూరైన అనుమతి) అంటే స్వతంత్ర సమీక్ష అనే అర్థం. అయితే, నేటి భారతదేశంలో “స్వతంత్ర” అధికారులు ఎక్కడ కనబడతారు? ఇది ఒక సవాలు. ఉపా సందర్భంలో “స్వతంత్ర” అంటే ఏమిటో కోర్టు స్పష్టం చేసి వుంటే బాగుండేది అని నేననుకుంటున్నాను.

 చెప్పలేను. ట్రయల్ కోర్టులు బెయిల్ మంజూరు చేయడం గురించి భారత ప్రధాన న్యాయమూర్తి ఏమి చెబుతున్నారో మీరు విన్నారు. ఈ సమస్యలపై సుప్రీంకోర్టుకే న్యాయ విధానం లేనప్పుడు, ట్రయల్ కోర్టుల నుండి మనం ఏమి ఆశించగలం? ఈ సమస్యను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నాయకత్వం అవసరం.

 అవును, ఎలక్ట్రానిక్ పరికరాలను సాక్ష్యంగా చూపించే కేసులకు, ఈ తీర్పు ఒక పూర్వ ప్రమాణంగా వుంటుంది.  హాష్ విలువను తీసుకోకపోతే అది వాస్తవంగా విలువ లేని సాక్ష్యం అవుతుంది. భీమా కోరెగావ్‌ కేసులో కూడా ఇదే జరిగింది. అయితే ఈ అంశాన్ని లేవనెత్తడానికి మనం 11 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అరెస్టులు జరిగి ఇప్పటికే ఐదేళ్లు కావస్తుండటం బాధాకరం. హైకోర్టు దీన్ని ప్రాధమిక అంశంగా నిర్ణయించాలని కోరుతున్నాం.

 నిధుల కొరత, ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తుల కొరత రాజ్యానికి లేదు కాబట్టి  రాజ్యానికి అది ఒక విలాసవంతమైన వ్యాజ్యం అవుతుంది. వారిని వ్యాజ్యం చేయనివ్వండి. ఆ వ్యక్తులు ఇప్పుడు బయట ఉన్నారు. వారు కోరుకున్నది స్వేచ్ఛ, వారు దానిని పొందారు. భయపడాల్సిన పనిలేదు.  స్వేచ్ఛగా వుండి మేధో పోరాటం చేయడం సాధ్యమే. చట్టం తెరిచిన పుస్తకమని, చట్టాన్ని ఎలా అమలు చేయాలో తమకు తెలుసని ఈ న్యాయమూర్తులు నిరూపించారు.

 యూఏపీఏని రద్దు చేయాలి. దురదృష్టవశాత్తూ,  ఏ చట్టాన్ని ఉపయోగించాలో నిర్ణయించడం అసాధ్యం అయ్యేలా కొత్త చట్టంలో కూడా ఇలాంటి నేరాలనే పెట్టారు: పాతదా, కొత్తదా లేదా రెండూనా?

 చట్టాన్ని రూపొందించడం అనేది ఒక ప్రత్యేక కళ. పదాలను జాగ్రత్తగా ఉపయోగించాలి. కొత్త కోడ్‌లో జాగ్రత్తగా ఉపయోగించలేదు, కాబట్టి దుర్వినియోగం చేయడానికి,  అసమ్మతివాదులను లక్ష్యంగా దాడి చేయడానికి పూర్తిగా అవకాశాలున్నాయి.

మార్చ్ 07, 2024

జ్యోతి పున్వానీ ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్.

https://frontline.thehindu.com/interviews/uapa-must-be-scrapped-indira-jaising-interview-g-n-saibaba-acquittal/article67924871.ece

Leave a Reply