ఈ నేలకు చెందిన నా తల్లులకు, తండ్రులకు, అక్కలకు, చెల్లెళ్ళకు,
మీ కోసం నేనురాసే ఒక బహిరంగ లేఖ. మీకీ లేఖ రాయాలని చాలా ఏళ్ళ క్రితమే అనుకున్నాను. చాలా కాలం నుంచి రాయకుండా ఈ లేఖ అలా ఉండిపోయింది. మా సంస్థలో రొట్టెలు కాలుస్తున్నప్పుడు నా శరీరం కాలడంతో తొలిసారిగా నా కలాన్నిలా కదిలించాను. అమ్మా.. నీ అడుగుల్లో అడుగులు వేసి నడుస్తున్నప్పుడు నీకు రాయాలనుకున్నాను. ధనికులుగా, పేదలుగా, స్త్రీలుగా పురుషులుగా విభజించే విధానం పెరిగిపోతుండడం గురించి మా సంస్థలో తొలిసారిగా చర్చించాం. మన సమాజంలో వీటిని ఎలా అర్థం చేసుకోవాలో, ఆ చణలో వీటిని ఎలా అధిగమించాలో చర్చించుకున్నాం. ఈ విభజన రేఖను చెరిపేయడానికి అడుగులు వేయకుండా దీనికి వ్యతిరేకంగా నిలబడ్డాముని ఎలా చెప్పగలుగుతా చెప్పు? తల్లులు ఇంటి పనుల్లో పడిపోయి విపరీతమైన చాకిరీ చేయడం చూస్తున్నాం. అడబిడ్డలు తప్ప ఆమె కష్టంలో ఎవరూ పాలుపంచుకోవడం లేదు. స్త్రీ, పురుష విభజన ద్వారా వారసత్వంగా వచ్చిన ఇంటి పని భారం వారిని విడిచి పెట్టడం లేదు. మీ మనోభావాలను అర్థం చేసుకోవడానికి, ఈ భూస్వామ్య సంస్కృతిని బద్దలు కొట్టడానికి శ్రమ విభజనలో స్త్రీ పురుష ప్రాతిపదికగా తేడా ఉండకూడదని మేం ఆచరణలో చూపిస్తున్నాం. ఒక మంచి సమాజాన్ని మనం కోరుకుంటున్నట్టయితే, ఈ రోజే దాన్ని ఆచణలో చూపించాలి. ఈ రోజు నేను చేసిన రొట్టెలే ఆ రోజు అమ్మపడిన కష్టం గురించి నాకు గుణపాఠం నేర్పాయి.
తమ అదృష్టాన్ని దెబ్బతీస్తున్నారని మన అమ్మానాన్నలు బాధపడుతుంటారు. వారికి మనుగడే సమస్యగా తయారైంది. మతాన్ని విశ్వాసాలను, జాతుల విభజనను నమ్మని కమ్యూనిస్టుల గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. మనపై వాళ్ళు ‘జాతి వ్యతిరేకులు’ అని ముద్ర వేస్తారు. మునం కాలేజీలకు, యూనివర్సిటీలకు వెళ్ళి ఇతరుల దృష్టిని మరల్చడానికి నిరనన తెలిపి, గొడవలు సృష్టిస్తామని వారు ఆరోపిస్తుంటారు. దేశంలోని భారతీయ సంస్కృతిని కించపరిచి, దానికి వ్యతిరేకంగా పశ్చిమ దేశాల సంస్కృతి ప్రచారానికి నిలబడుతున్నామని అంటారు. భారతదేశంలో పశ్చిమ దేశాల వలనవాద ఆలోచనలకు మనం మార్గదర్శకులమని కూడా అంటారు. ఇదంతా వారి ప్రచారం. కానీ నా తల్లులకు, తండ్రులకు, అక్కలకు, చెల్లెళ్ళకు, అన్నలకు, తమ్ముళ్ళకు నేనేం చెప్పదలుచుకున్నానో అది చెపుతున్నాను.
మనం మతానికి వ్యతిరేకులు అంటున్నారు?
మతాన్ని అనుసరించనివారు, మతానికి వ్యతిరేకమైన వారు అన్నవి రెండు వేర్వేరు విషయాలన్నది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ‘మార్కిస్టులు మతాన్ని విశ్వసించరు’ అని మతతత్వ వాదులు అసంబద్దంగా అంటారు. మానవ చరిత్రలో ఉత్పత్తి సంబంధాలు మారినప్పుడు, కాలంతో పాటు ‘మతం’ స్వభావం ఎలా దూరుతోందో, మతం నిర్వహించిన చారిత్రక పాత్రను మార్కిస్టులమైన మనం అర్థం చేసుకుంటాం. వివిధయుగాల్లోని మానవ నాగరికతల్లో, పాలక వర్గాల అవసరాల మేరకు, దానికి వ్యతిరేకంగా కూడా భిన్న ఉత్పత్తి పద్ధతుల్లో భిన్న మతాలు ఏర్పడ్డాయి. ఫ్యూడల్ వ్యవస్థకు పూర్వ వ్యవస్థలో బ్రాహ్మణ మతం ఏర్పడి, ఆ నాటి ఉత్పత్తి స్వభావానికి అనుగుణంగా అది రూపు దాల్చింది. మరొక పక్క ఫ్యూడల్ వ్యవస్థలో ఏర్పడిన ఇస్లామ్ బానిస విధానాన్ని ప్రతిఘటించే క్రమంలో స్వాభావికంగా రూపుదాల్చింది. బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఉద్దేశ్యం ఇస్లాంకు లేదు. ప్రజల్లో విప్లవ చైతన్యాన్ని కల్పించలేదు. మధ్య తూర్పు దేశాల్లో బానిస యజమానులను ప్రజలు బలంగా ప్రతిఘటించే చైతన్యాన్ని కల్పించడానికి సంస్థలను అనుమతించింది. ఉద్యమం ఊపందుకుంది. ఈ విషయం ఒకే వైపు అభివృద్ధి చెందాయి. ఇటుకలు తయారు చేయడానికి ముందే మట్టి సిద్ధమైంది అని మార్కిస్టులమైన మనం చెపుతాం.
తొలుత రాళ్ళతో ఇళ్ళను నిర్మించాం. కాలం గడిచేకొద్దీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని ఏ రకమైన సమాగ్రి ఉపయోగించాలనే జ్ఞానం పెరిగింది. అదే సమయంలో మతం అనేది సమాజంలో ఒక భాగం. భిన్న ప్రాంతాల్లో, భిన్న యుగాల్లోని మానవ నాగరికతల్లో ఉన్న తమకున్న ఏకైక లక్షణాల వల్ల భిన్న మతాలు ఏర్పడ్డాయి. ఆయా కాలాల్లో సమాజంలో ఉన్న పదార్థ చైతన్యానికి భిన్నంగా ఈ ఏకీకృత చర్యలు జరగలేదు. మార్క్సి స్టు లైన మనం ఉనికిలో, పెరుగుదలలో మతాని సంబంధించిన అసలైన వాస్తవాన్ని తిరస్కరించలేం. అది నిలబడడానికి కారణాలు దోహదం చేశాయో గమనిస్తాం. మతానికి సంబంధించిన ఆ వాస్తవాన్ని మనం నమ్ముతాం.
మనం జాతి వ్యతిరేకులమని వారంటారు?
పేదరికంతో, దారుణమైన దారిద్య్రంతో మన తల్లులు ప్రాణాలను పోగొట్టుకోవడం వల్ల అన్ని ఆటంకాలను అధిగమించిన నా దేశ భక్తి మోత మోగిస్తోంది. మన అక్క చెల్లెళ్ళను నగ్నంగా ఊరేగించినప్పుడు, మత ఊరేగింపులో దారుణంగా వారిపై అత్యాచారం చేసినప్పుడు, వారి శరీరాలనుంచి లావా ఉప్పొంగి నా దేశ భక్తి ఎరుపెక్కింది. తాము పండించిన పంటకు న్యాయమైన ధర కావాలని మన తండ్రులు కోరినప్పుడు, ఢిల్లీ అధినాయకత్వం బలవంతంగా వారి చేత లాఠీ దెబ్బలు తినిపించినప్పుడు నా దేశ భక్తి పంటపొలాల నుంచి అగ్నికీలల్లా ఎగిసిపడింది. మన అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ముల చేతులు ఫ్యాక్టరీల్లో, కంపెనీల్లో పనిచేసినప్పుడు, వారి శ్రమను దోచుకుని, తిరిగి భూమిని కార్పొరేట్ రంగానికి అతి తక్కువ ధరకు వెండిపళ్ళెంలో సమర్పించినప్పుడు, వారి అగ్రహానికి నా దేశభక్తి వల్ల కన్నీళ్ళు, రక్తం ఎరుపెక్కాయి. మన అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అలసిపోయేలా పనిచేసి, తమ తమ స్థానాల్లో నిద్రలేకుండా శ్రమిస్తున్నప్పుడు, వారింకా తమ ఆత్మలను కూడా అమ్ముకోవాలని యజమానులు భావిస్తున్నప్పుడు, వారితో పాటు నా దేశభక్తి అవిశ్రాంతంగా మొల్కొంటుంది. మన అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఈ మతిమరుపులో తమని తాము పోగొట్టుకున్నప్పుడు, తమ నుంచి తాము వేరు పడినప్పుడు, శూన్యంగా భావించినప్పుడు, అసంతృప్తితో ప్రయోజనం లేకుండా ఉన్నప్పుడు, మానసిక అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నప్పుడు నా దేశభక్తి ‘క్లైమోర్’ మందు పాతర వారిని “ఎవరికోసం మీరు పనిచేస్తున్నాం?” అని ప్రశ్నించాలనుకుంటుంది. మనం ఇష్టపడే వారంతా మోసానికి గురైనప్పుడు, నకిలీ శాస్త్ర విజ్ఞాన వాదనలతో ప్రభుత్వం మనల్ని తెలివితక్కువ వారిగా చేసినప్పుడు, మృత్యువు సమీపిస్తున్న పిల్లలకు ఆవు మూత్రంతో గుండె జబ్బులు నయమవుతాయని నమ్మిస్తూ, కనీస సాయం అందక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మన ప్రజలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు నా దేశ భక్తి పోరాడుతుంది.
భారతీయ సంస్కృతికి మనం వ్యతిరేకమన్న ఏడుపు?
మన భాష ఏమిటి? మన సంస్కృతి ఏమిటి? మా నాయనమ్మ/అమ్మమ్మ ఎప్పుడూ హిందీలో మాట్లాడలేదు. ఆమె ప్రేమ, దయ అన్నీ భోజ్ పురిలోనే ఒలకబోస్తుంది. నేను ఎప్పుడూ అంజిక(ఇండో ఆర్యన్ భాష)లో మాట్లాడితేనే మా పచారి (వెచ్చాల) షాపు ‘చాచాజీ’ కి ఇష్టం. ఈ జాతికి ఆధిపత్యభాషగా హిందీని అంగీకరింపచేసి, మన మాతృభాషలో మాట్లాడడం తక్కువని ఎప్పుడు ఎలా భావించామో తెలియదు. అది అక్కడితో ఆగలేదు. విస్తృత ప్రజాబాహుళ్యానికి ఎవరి హిందీ బాగా అర్థమవుతుందనే విషయాన్ని పక్కన పెట్టేసి, ఎవరి హిందీ స్వచ్ఛమైనదని పోపటీపడుతూ గిరిశోధన చేస్తున్నాం. భారతదేశంలో కులం ద్వారా, వర్గం ద్వారా భాష స్వచ్ఛత నిర్ణయమవుతోంది. తొలుత నగరాలకు వచ్చి స్థిరపడిన వారు ‘స్వచ్ఛమైన హిందీ’ అంటూ మొదలుపెట్టి ఇంగ్లీషును అంగీకరించారు. వలసపాలకుల కాలం నుంచి ఇంగ్లీషు మనకొక చట్టబద్ధతను కల్పిస్తోంది. భారతదేశంలో అధికార వ్యవస్థ తమ ఆకాంక్షలకు అనుగుణంగా భాషలకు స్థాయి భేదాలను ఏర్పాటుచేసింది. బహుళ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించాలన్నా, విదేశాల్లో డబ్బు పెట్టుబడి పెట్టాలన్నా ఇప్పుడు మనం ఇంగ్లీషును పరిశీలించాలి (ఇంగ్లీషు ప్రపంచంలో సాధారణ అనుసంధాన భాష). తమ ఆకాంక్షల్లో ఉన్న ప్రస్తుత దళారి అధికారుల వ్యవస్థ దీన్నొక విలువైనదిగా అన్వేషించే పవిత్ర కర్తవ్యంగా భావిస్తోంది.
దేశ పునర్నిర్మాణానికి అందరికీ కలిపి ఒక భాష అవసరం. మన తమిళ తండ్రి తన మాతృభాషతోనే పెనవేసుకుని ఉంటాడు. మణిపూర్, పంజాబ్ కు చెందిన అక్కచెల్లెళ్ళు మణిపురి, పంజాబీ భాషలతోనే సౌకర్యవంతంగా ఉంటారు. నా అస్సాం సోదరుడు తన నేలలో పామాయిల్ నాటడానికి అస్సలు ఇష్టపడడు. వరి సాగు ద్వారా తనని తాను నిలదొక్కుకోవాలనుకుంటాడు. కానీ, ఇలాంటి స్వతంత్ర సంస్కృతి, ఆర్థిక విధానాలను ఈ దేశంలో అనుమతించరు. విదేశాలపై ఆధారపడ్డాం కనుక (విదేశీ ఆర్థిక సాయం, విదేశీ పెట్టుబడులు) ఈ దేశాన్ని సామ్రాజ్యవాదం తనవైపు లాగేసుకుంటోంది. సామ్రాజ్యవాదం తన ప్రయోజనాల కోసం గరిష్ట లాభాలను ఆర్జించే ఒక పెద్ద మార్కెట్ గా ఈ దేశాన్ని తయారు చేస్తోంది. ‘జాతీయ వాదులు’ గా కొత్తగా ఏర్పడిన కొందరు ప్రయోజనకరమైన ‘జాతీయవాదం’ అనే వ్యాపారం నుంచి లబ్ధిపొందుతున్నారు.
గతించిన వలసపాలనలో మున భాషాబానిసత్వాన్ని నిర్ధారించిన విషయం గురించి మనం ఆలోచించడం లేదు. వలసవాదం పైన ఆధారపడడం నుంచి మనం ఇంకా బైటపడలేదు. వెంటాడుతున్న వారి సాంస్కృతిక ఆధిపత్యాన్ని, కనీసం వారి జోక్యాన్ని గుర్తించడంలో కూడా మనం విఫలమయ్యాం. ఒక అబద్దాన్ని ఎదుర్కొనే క్రమంలో నిదానంగా లోపభూయిష్టమైన ఇల్లు పడిపోతోంది. కొత్తగా ఏర్పడిన ‘జాతీయ వాదులు’ జాతీయ వాదం గురించి మాట్లాడతారే కాని స్వతంత్ర ఆర్థికాభివృద్ధి గురించి మాట్లాడడం లేదు. ‘స్వచ్ఛమైన హిందీ’ని పరిరక్షించాలనే ఉద్యమానికి విదేశీ నిధులు అందుతున్నాయి. మనం స్వతంత్ర ఆర్థిక పునాదిని ఏర్పాటు చేసుకోకుండా విదేశీ సంస్కృతి ఆధిపత్యాన్ని పక్కన పెట్టే స్థితి మనకు రాదు. పనిచేసే రంగాన్ని పరిశీలించినట్టయితే 42 శాతం మంది పట్టబద్రులైన యువతరం నిరుద్యోగులుగా ఉన్నారు. వ్యవసాయ రంగంపైన అత్యధిక ప్రజలు ఆధారపడ్డారు. పెద్ద సంఖ్యలో రైతులు అప్పులపాలై ఉన్నారు. ఈ దేశ వాసులకు ఒక ప్రశ్న వేద్దాం. ఈ పరిస్థితికి పాకిస్థాన్ ప్రభుత్వమే కారణమని వారిని నిందిద్దామా? మన శ్రామిక జనసంఖ్య గురించి మాట్టాడుకుందామా, లేక మన ప్రధాని విదేశీ పర్యటనల గురించి మాట్లాడుకుందామా? స్వతంత్ర పారిశ్రామిక ఉత్పత్తి గురించి చర్చిద్దామా, దున వనరులను తేలిగ్గా తీయడం కోసం జాతీయ రహదారుల గురించి గర్విద్దామా? మనకు ఆత్మగౌరవం లేదంటారు?
స్వతంత్రమైన అభివృద్ధిలోనే మన ఆత్మగౌరవం ఇమిడి ఉంది. మన దేశంలో స్థానిక అవసరాలు తీర్చడానికి స్థానిక తరహా స్వతంత్రమమైన ఉత్పత్తి సాధించడంలోనే మన ఆత్మగౌరం ఇమిడి ఉందే తప్ప, విదేశీ మార్కెట్ కోసం ఉత్పత్తి చేయడంలో లేదు. ఈ దేశానికి తిండి పెట్టడం కోసం రైతులు తమ ఎముకలను ముక్కలు చేసుకుని, ప్రాణాలను అర్పించడంలోనే అత్మగౌరవం ఉంది తప్ప, ‘ను’ లోని వ్యవసాయ భూముల్లో తమ బూడిదను వెదజల్లడంలో లేదు. దున భౌగోళిక సార్వభౌమత్వాన్ని కాపాడడంలోనే మన ప్రజల ఆత్మగౌరవం ఉంది. మన దేశంలో కులవ్యవస్థను సమర్థించే ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడడంలోనే మన ఆత్మగౌరవం ఉంది.
కులం, దుతం, ప్రాంతం పేరుతో దేశాన్ని విభజించే శక్తులకు, సామ్రాజ్యవాదానికి, కుల విధానానికి వ్యతిరేకంగా సమష్టిగా పోరాడే శక్తిని తగ్గించే వారే ‘జాతి వ్యతిరేకులు’. మతం ప్రాతిపదికగా ఏ జాతీయ వాదమూ పోరాడ లేదు. దేశభక్తి లేని విభజన వాద, వైయుక్తిక ధోరణి వల్ల మతం ప్రాతిపదికగా మన పోరాటాలను చీల్చాలని ప్రయత్నిస్తున్నారు. తమ జాతి వ్యతిరేకత ముఖాన్ని బైటపడకుండా భయంతో దాచుకునే వారిని మనం బహిర్గతం చేయాలి. వారు ‘జాతీయ వాద’ ప్రచారాన్ని కొనసాగిస్తారు. దేశంలోకి వచ్చిపడే విదేశీ పెట్టుబడుల ప్రవాహం గురించి సంప్రదించరు. ఎందుకంటే, మన వనరులను పెద్ద పెద్ద సంస్థలు తీసుకుని వందేళ్ళ క్రితం జరిగినట్టు సామ్రాజ్యవాదం ముందు మరొకసారి మనల్ని బిచ్చగాళ్ళను చేయడానికి చూస్తున్నారు.
వార్తా చానెళ్ళను ఒక సారి చూడండి. పాలస్తీనా చరిత్రను ఒక సారి చదవండి. పాలస్తీనియన్ల అభిప్రాయాలను పరగణనలోకి తీసుకోకుండా వారి చరిత్రను రాశారు. జియోనిస్ట్ రాజ్యం తొలుత సామ్రాజ్యవాదులతో, పెట్టుబడిదారులతో సత్సంబంధాలు పెట్టుకుని, సంపద కల వారు పెద్ద భవంతుల్లో ఉండిపోయారు. మిగిలిని జివ్స్ కు చెందిన శ్రామిక వర్గాన్ని జర్మనీలోనే మీ చావు చావండని వదిలేశారు. ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో నడిచే పత్రికలు, చానెళ్ళు చెప్పేవాటికి భిన్నంగా వార్తల గురించి మీరు చదవాలి, నేర్చుకోవాలి. వర్గ ప్రాతిపదికగా జరిగే ఈ మారణ హెూమం మనకంతా చూపిస్తుంది. కానీ వాస్తవం ఏమిటి?
జాతీయతను, జాతి విముక్తిని కోరుకోవాలనే ఆకాంక్షగలవారు తమ వనరులను దోపిడీ చేయడాన్ని ప్రోత్సహించరు. అజంఘర్ లోని రైతులు తమ భూముల కోసం ఏడాదిగా పోరాడుతున్నారు. ఆదాని ఆగ్రో పరిశ్రమకు అధిక లాభాలు చూకూర్చడానికి హిమాచల్ ప్రదేశ్ లోని యాపిల్ పంటను కారుచౌకగా అమ్మమని రైతులపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. కేరళ, చెన్నైలలో జెట్టి (తీరప్రాంతంలో అలల నుంచి రక్షించడానికి నిర్మించిన నన్నని పొడవాటి రహదారి) కార్మికులు తమ నీటిని, భూమిని మన నేల సార్వభౌమాధికారానికి ఇవ్వడానికి తిరస్కరించారు. వారిని కూడా జాతి వ్యతిరేకులంటున్నారు? మనదేశ వనరులను రక్షించాలని జెట్టి కార్మికులు నిలబడుతున్నప్పుడు, మన నేలను కాజేయాలని కార్పొరేట్ శక్తులు, దోపిడీ శక్తులు ప్రయత్నిస్తుంటే, వీరితో ఎవరు చేతులు కలుపుతారు? వాళ్ళే నిజమైన జాతి వ్యతిరేకులు! మన తల్లులు, అక్కచెల్లెళ్ళను నగ్నంగా ఈ దేశం ముందు ప్రదర్శిస్తున్నప్పుడు, జాతి వ్యతిరేక శక్తులు ఈ దారుణాలను తగ్గించి చూపిస్తూ, ‘ఇలాంటివి ఎక్కడైనా జరుగుతాయి’ అని అంటున్నారు. ఈ భౌగోళిక ఎన్నికల ముఖం ముందు నా దేశభక్తి ఎప్పటికీ నా తల్లుల వైపే నిలబడుతుంది. ఏ జాతి అయితే తన ప్రజల గౌరవాన్ని, హుందాతనాన్ని రక్షించలేదో, అలాంటి జాతి ఎన్నటికీ స్వతంత్ర మనుగడను, అభివృద్ధిని సాధించలేదు.
జాతి వ్యతిరేక శక్తుల చేత నిర్లక్ష్యానికి, దోపిడీకి గురవుతున్న ప్రజలు దేశం కోసం తమ రక్తం ధారపోయకతప్పదు. తమను దోపిడీ చేయడం గురించి, న్యాయమైన కోర్కెల గురించి ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఈ పీడితులను బలిపశువులను చేసి, వారిపైన పీడకులు జాతి వ్యతిరేక శక్తులు అని ముద్ర వేసి, నిజమైన జాతివ్యతిరేక శక్తులు మరొకసారి నేరానికి పాల్పడతారు. ఓ నాన్నా.. వాట్సప్ లో వచ్చే బోగస్ మెసేజ్ లను నమ్మువద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే, ప్రవాహంలా వచ్చిపడే ఈ అబద్దాల మెసేజ్ లు తండ్రీ కొడుకుల మధ్య అపార్థాలను పెంచుతున్నాయి. దేశ అభివృద్ధి ప్రజల అభివృద్ధి కాదని నీ కొడుకు చెపుతున్నాడు. వాళ్ళు ఏం చెపుతున్నారో కూడా విను. వారి మాటల వెనుక దాగిన అసలు నిజం ఏమిటంటే, ధనవంతులు రోజు రోజుకూ మరింత ధనవంతులు అవుతుంటే, పేదల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తడవ తడవకు పెరిగిపోతున్న ఆర్థిక మాంద్యం ఫలితంగా అమ్మ వంటిల్లు, చెల్లెలి చదువు రాజీపడకతప్పడం లేదు. పేదల ఆకాంక్షల అణచివేత అనేది పెరిగిపోతున్న ధనికుల దోపిడీతో ముడిపడి ఉన్నది. పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు మాత్రమే మనుగడ సాగించే ఈ జాతీయత నిజమైందా? మైనారిటీ మతస్తులకు, దళితులకు, ఆదివాసీలకు, మహిళలకు, శ్రామిక వర్గానికి, ఇతర జాతుల వారికి, రైతులకు ఏమైనా చోటు లభిస్తుందా?
మనల్ని పరిపాలించాలనుకునే దోపిడీదారుల్లోనే ‘జాతి వ్యతిరేకులు’ మాట వినిపిస్తోంది. ప్రజాబాహుళ్యాన్ని విభజించి, తమ తప్పుడు మార్గాన్ని బలపరచడంపైన దృష్టి సారించడానికి తమ శక్తి యుక్తులన్నిటినీ వెచ్చిస్తున్నారు. దేశాన్ని నిదానంగా దిగజార్చడంలో ఈ జాతి వ్యతిరేకులే నిజమైన నేరస్తులు. దేశభక్తులు వీధుల్లో పోరాడుతుంటే, జాతివ్యతిరేకులు వెండి సింహాసనంపైన ఊరేగుతున్నారు. మన అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ముల బుజాలపైన కాలం చారిత్రాత్మక బాధ్యతను మోపింది. ఈ జాతి వ్యతిరేకులకు, వారి పక్షపాత ధోరణికి వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం వారిపైన ఉంది. ప్రశ్నించడానికి వీలు లేదనే వారి వాదనలను ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడింది. రైతులు, శ్రామిక వర్గంతో యువతరం నిలబడి, సమాజంలో ఉన్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలి. యువతరం తమ ఆశలు, ఆకాంక్షల కోసం ఉపాధిని వెతుక్కోవడంలో పరాయీకరణ మింగేస్తోంది. అక్కాచెల్లె ళ్ళు, అన్నాతమ్ముళ్ళారా, మన శక్తియుక్తులను దారి మళ్ళించడానికి ఇది సరైన సమయం కాదు. మన ధోరణిని మార్చుకోకపోతే మనం భవిష్యత్తును కోల్పోతాం. ఆదుర్దా, కుంగిపోవడంతో మునిగిపోయిన మన వర్తమానాన్ని కొనసాగించడానికి ప్రయత్నిద్దాం. ఈ అదుర్దా, కుంగిపోవడానికి కారణమైన దోపిడీ రాజ్యానికి బదులు మనని మనమే నిందించుకుంటాం. ఇది తప్పు. ప్రభుత్వ ఉద్యోగాలు రోజు రోజుకూ తగ్గిపోయి, ప్రైవేటు కంపెనీలు దెయ్యాల్లా పెరిగిపోతున్నాయి. గంటలకొద్దీ మన చేత పనిచేయించుకుని, తిరిగి పనిచేయడం కోసం అతి తక్కువ జీతాలిస్తున్నారు. ప్రయాణంలో ప్రజలకు వనరులు, మనుగడ లేకుండా చేయడం అనేది పోరాటంలో అతి పెద్ద సమస్య. మనం ఆర్థికంగా అవిటివాళ్ళమైనప్పుడు, వారి అరాచక విధానాలు మనల్ని దుర్భలులుగా చేస్తున్న ఈ విధానం అంతం లేనిదిగా కొనసాగుతూనే ఉంది. మన నుంచి ఒక్కొక్కటీ లాగేసుకుంటూ, దురాశతో మన శ్రమను నరమాంస భక్షకుల్లా మెక్కేస్తున్నారు.
నా ప్రియమైన తల్లుల్లారా, అక్కాచెల్లెళ్ళారా, అన్నాతమ్ముళ్ళారా మీరెవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వారిని గెలవనివ్వకూడదు. మన సమష్టి స్పృహ, చర్యలు రాజును ఓడించి తీరుతాయి. సరుకులను కీర్తించడానికి బదులు, మనకు జీవిత విలువలు కావాలి. వైయుక్తిక ప్రయత్నాలను కోరుకునే బదులు లోతైన సమష్టి ప్రేమను, విశాలమైన దయాహృదయాన్ని పెంచుకోవాలి. పీడితులు, దోపిడీకి గురయ్యే వారి మధ్య ఉన్న సమష్టి ప్రేమ విద్వేషకులను తప్పకుండా పడగొడుతుంది. ఒకరికొకరు చేసే మన సమష్టి త్యాగాలు విభజన రాజకీయాల పాలకవర్గాలను తప్పకుండా కూల్చివేస్తుంది. మన సందేశం మీకు స్పష్టమైందనుకుంటా. ఈ నేలకు చెందిన ప్రియమైన కుటుంబీకుల్లారా మీ ఆవేశాలకు, ప్రేమకు ఎప్పటికీ మేం వ్యతిరేకం కాదు. ప్రజలను విభజించే వారికి వ్యతిరేకంగానే మేం నిలబడతాం. అమ్మా ఇతరుల పిల్లల్ని కూడా మీ పిల్లల్లాగే ప్రేమించినప్పుడు నేనొక్కడినే నీ బాధ్యత కాదు. అదొక అందమైన ప్రపంచమువుతుంది. సోదరీ.. నీ హక్కుల్ని నీవు సమర్థించుకుంటే నీకది చాలా మంచిది. వేలాదిమంది సోరదీమణులు తమ సమష్టి హక్కుల కోసం పోరాడుతూ, నీ వైపు నిలబడతారు.
నీ కోసం మళ్ళీ రాస్తాను. ఈ ఉత్తరంలో ఇంతే. నీ కొడుకులు, నీ కూతుళ్ళు జాతి వ్యతిరేకులా, దేశభక్తులా నీవే నిర్ణయించుకోవాలి.
ఏదో ఒక రోజు నీవు కూడా మాతో చేరతావని నమ్ముతూ, చిత్తశుద్ధి గల నమ్మకంతో ప్రేమను, శుభాకాంక్షలను పంపుతున్నాను.
(నజారియా పత్రిక సౌజన్యంతో)
అనువాదం రాఘవ శర్మ