తలమీది నీడను 
త్యాగం చేసుడు
తమవల్ల కాదని
తెల చెప్పినోళ్ళు

కాళ్ళ కింది నేల 
కడుపాకలి తీర్చే
వొనరది మాకు
వొదలమన్నోళ్ళు

రిజర్వాయరు
రక్కసి కోరని 
ఎరుగక జిక్కి 
అల్లాడెటోళ్ళు  

యాడాది పైనాయె
ఎద బాదుకుంటు
మొరల్ బెట్టి బెట్టి
మోసపొయ్నోళ్ళు

దొంగలోలె పట్టి
టేషన్లకు దెచ్చి
బైండోర్లు జేసెనే
దొరోల్ల రాజ్యం

ఇంత కెవరీళ్ళో
సెప్పనైతి నేను
ఎత్తిపోతల కత్తి
ఎదలోకి దిగిన

సిన్నోని పల్లెంట
బతుకగ్గి పాలై
బజారు పడిన
పల్లె రైతులీళ్ళు

ఎట్లైతె అట్లాయె
ఇట్లైతె కాదంటు
లీడర్ల రంగెరిగి
రణం దిక్కైన్నోళ్ళు.

Leave a Reply