( కా. జీతన్ మరాండీ మన కాలపు గొప్ప వాగ్గేయకారుడు. ఆయన గానానికి, ప్రసంగాలకు రాజ్యం భీతిల్లిపోయింది. మరణ దండన విధించింది. ఆయనతోపాటు తన నలుగురు సహచరులకు కూడా. ఈ ఆదివాసీ, దళిత సాంస్కృతికోద్యమ కళాకారుల కోసం సమాజమంతా కదిలింది. వాళ్లను ఉరి తాడు నుంచి తప్పించింది. జీతన్ ఈ నెల 13 న అనారోగ్యంతో అమరుడయ్యాడు. జైలులో ఉన్నప్పుడు ఆయన గురుంచి, ఝార్ఖండ్ ఉద్యమం గురుంచి అమృత రాసిన వ్యాసం ఇది. అయన స్మృతిలో పునర్ముద్రిస్తున్నాం.- సంపాదకవర్గం )
జీతన్ మరాండీని నేను చూడలేదు. అనిల్‌రామ్, మనోజ్ రాజ్‌వర్, ఛత్రపతి మండల్‌ల గురించిన వివరాలు నాకు తెలీవు. కానీ జూన్ 23 డేట్‌లైన్‌తో వచ్చిన వార్తను (పదిరోజుల తర్వాత) చదివాక మరణదండన విధించబడిన ఈ అపరిచితులతో నాకు గల ఏదో అవినాభవ, అనిర్వచనీయమైన సంబంధం పరిచిత అపర్ణ ద్వారా ఒక్కసారిగా అనుభూతమైనట్టయ్యింది. దట్టమైన ఝార్ఖండ్ హరితవనాల్లో ఎత్తైన ఆ పర్వతసానువుల్లో, ఆదివాసీ గుండెలోతుల్ని సూచించగల ఆ లోయల్లో, సంథాలీ, ముండా ఆదివాసీ యువతుల నవ్వుల్ని లోభంగా లాక్కుని వాటిని గలగలా పారించే యేరుల ఒడ్డెమ్మడి సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ప్రకృతి ఒక రుతువు నుండి మరో రుతువుకు పచ్చపచ్చగా మారే కాలంలో, భారత విష్ణవోద్యమ చరిత్ర ‘చీకటి అధ్యాయం’ నుండి ఉజ్వలమైన భవిష్యత్తుకు మారబోతున్న ఆ మునివాకిట గడిపిన ఆ అపూర్వమైన రోజులు గుర్తుకువచ్చి మనసంతా ఎగసిన పాలనురుగుల కెరటాలు ఇంతలోనే ఆ స్వచ్చమైన ప్రకృతినీ, మానవ ప్రవృత్తులని హరించేయడానికి నిప్పులు చిమ్ముతూ మీదికొస్తున్న ఆపరేషన్ గ్రీన్ హంట్ డ్రాగన్ ధాటికి అవి చప్పున చల్లారినట్లయ్యి అణువణువునా పరుచుకుంటున్న ఓ మూగవేదన. కాని వెన్వెంటనె సరిగ్గా జీతన్, జీతన్ లాంటి వందలాది, వేలాది ఆదివాసీ, ఆదివాసేతర కామ్రేడ్స్ అక్కడ ఎత్తిపట్టిన తిరుగుబాటు బావుటాలలో రెపరెపలాడుతున్నది మన ఆకాంక్షలే అనీ తోచి గొప్ప ఆశ్వాసన.
జీతన్ మరాండీ గురించి నేను మొదటిసారి విన్నదప్పుడే. ఝార్ఖండ్ అభేన్ (ఝార్ఖండ్ జాగృతి అని అర్ధం) యుద్ధనృత్యానికి కాలు కదిపి, నా జీవితంలో నేను విన్నపాటల్లో కెల్లా మృదుమధురంగా తోచిన సంథాలీ ‘సిరింగ్’లను పలవరించి, ఝార్ఖండి జనజీవనంలో దాని పాత్రను అవగాహన చేసుకునే ప్రయత్నం చేసిందీ అప్పుడే. అపర్ణ జీతన్ సహచరిగా తర్వాత పరిచయమైంది. ముందుగా ఆమెతో నా పరిచయం నారీ ముక్తి సంఘం కార్యకర్తగా, నాయకురాలిగా, మాకు ఎన్ఎంఎస్ నీ , ఝార్ఖండ్ అభియాన్‌నీ పరిచయం చేసిన అనేకమందిలో ఒకరిగా, అక్కడి గ్రామాల్లో పర్యటించినప్పుడు మాతో తిరిగిన గైడ్‌గా, యుద్ద నృత్యంలో నాట్యకత్తెగా, ఝార్ఖండ్ కార్యకర్తల్లో కొట్టొచ్చినట్టుగా కనిపించే ఓ అపురూపమైన ప్రేమా, అక్కర, ఆదరణలను ధారాళంగా పంచి యిచ్చి అక్కడున్నన్ని రోజులూ మమ్మల్ని తన రెక్కల కిందకి చేర్చేసుకున్న నెచ్చెలుల్లో ఒకరిగా – అన్నిటికంటే ఎక్కువగా ఎన్‌ఎంఎస్ కార్యకర్తలందరితో పాటు దేశవ్యాప్త విప్లవ మహిళోద్యమ భవిష్యత్తుకూ, ఝార్ఖండ్ అభేన్’ కార్యకర్తలందరితో పాటు దేశవ్యాప్త విప్లవ సాంస్కృతికోద్యమ భవిష్యత్తుకూ ఒకానొక సూచికగా! ఝార్ఖండ్లో వివిధ నిర్మాణాల్లో పని చేసే కార్యకర్తలందరికీ వుండే సాధారణ నేపథ్యమే అపర్ణకూ ఉండింది, అంటే ఆమె కూడా చిన్నప్పుడు ఝార్ఖండ్ అభేన్‌లో పని చేసి ఎన్‌ఎంఎస్ ఆర్గనైజర్‌గా రూపాంతరం చెందింది.
జీతన్ మరాండీ గురించి ఆ తర్వాత చాలాసార్లే విన్నాను. ఆయన అనేకసార్లు అరెస్టులు అవ్వడం, రక్తాలు కారేలా ఆయన్ను కొట్టడం, అక్కడి మావోయిస్టు పార్టీ ఏదైనా మిలటరీ చర్య చేసినప్పుడు ఆయన పేరూ, ఆయనతో పాటు వుండే సాంస్కృతిక బృందం సభ్యుల పేర్లూ భవిష్యత్తులో వారిని తప్పుడు కేసుల్లో ఇరికించే ఓ పాలకవర్గ కుట్రలో భాగంగా పేపర్లో వస్తూ వుండడం, 2007లో రాంచీలో రాజకీయ ఖైదీల విడుదలకై ఆయన చేసిన “నిప్పులు కక్కే” ఉపన్యాసంకై ఆయన్ని అరెస్టు చేయడం, తప్పుడు కేసుల్లో ఇరికించడం…చివరిగా ఇప్పుడీ మరణదండన వార్త. 2008లో అనుకుంటా ఝార్ఖండ్ ఎన్‌ఎంఎస్ కార్యకర్తల ద్వారా అపర్ణ ఎలా వుందో కనుకున్నప్పుడు ఆమె గర్భంతో ఉన్న విషయం తెలిసింది. 2011లో తెలుసుకున్నప్పుడు జీతన్ జైలులో ఉన్నాడు కనుక పిల్లాడిని పెట్టుకుని ఆయన విడుదల కోసం ప్రయత్నం చేస్తూ తిరుగుతున్నదని తెలిసింది. చివరిగా పేపర్లో జీతన్‌కు సెషన్స్ కోర్టు మరణదండన విధించాక ఆయనకు వ్యాన్ ఎక్కేముందు పిల్దాడ్ని అందించిందనీ, ఆయన పిల్దాడ్ని ఎత్తుకుని ఆమెను ఓదార్చాడని, ఈ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కోర్టులోనే కాక బైటా పోరాడుతామనీ, మానవ హక్కుల కమిషన్‌కూ నివేదిస్తామనీ ఆమె అన్నదన్న వార్త.
జీతన్ మరాండీ గురించి నేను చాలాసాన్సే ఊహించుకున్నాను. బుడిబుడి అడుగుల పిల్లల నుండీ టీనేజీ దాకా అన్ని వయస్సుల పిల్లలూ ఝార్ఖండ్ అభేన్ సభ్యులుగా, ఎన్‌ఎంఎస్ అక్కల సంరక్షణలో, వారి మార్గదర్శకత్వంలో మాతోపాటే గ్రామాలు తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ ప్రజల కళ్ల వెలుగులుగా బాసిస్తున్నప్పుడు జీతన్ ఇలాగే మొదలయ్యి వుంటాడని ఊహించాను. వారిలాగే ఆయన కళల్నీ, రాజకీయాల్నీ జమిలిగా నేర్చుకుని ఒక ఉత్తమ ప్రజాకళాకారుడిగా ఝార్ఖండ్ ప్రజల, దేశంలోని మొత్తం పీడిత ప్రజల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే విప్లవ కళా, సంస్కృతులను తన గానం ద్వారా, నాటకాల ద్వారా ప్రచారం చేసే కార్యకర్తగా ఎదగడాన్ని ఊహించాను. ఆ పిల్లల నోళ్లలో నిరంతరం నానుతున్న ఆయన పేరును వింటూ ఆయన రోజువారీగా వాళ్లకు అన్నీ నేర్పే గురువుగా ఎలా పరిణామం చెంది ఉంటాడో ఊహించాను. భారత దేశ విప్లవోద్యమానికి ఝార్ఖండ్ విష్టనోద్యమం చేసిన అత్యుత్తమ చేర్పుల్లో ఒకటిగా అనేకమంది ఆదివాసీ నేపథ్యం నుండి వచ్చిన కామ్రేడ్స్ వేర్వేరు నిర్మాణాల్లో అత్యున్నత నాయకత్వ స్టానాల్డోకి రావడం అనేది వెలుగులు చిమ్మే సత్యంగా గోచరించినప్పుడు (సిపిఐ (మావోయిస్ప) కేంద్రకమిటీలోకి వచ్చిన మొదటి మహిళ ఆదివాసీ కావడం ఆ పార్టీకి, ఈ దేశ విష్ణవోద్యమానికి ఎంత గర్వకారణం! ఆ చేర్చు చేసినది ఝార్ఖండ్ విప్లవోద్యమమే) అందులో భాగంగా సాంస్కృతికోద్యమ నాయకుడిగా జీతన్ మరాండీ ఎదుగుదలను ఓ ‘సహజ పరిణామం’గా ఊహించాను. దాదాపుగా అపవాదు లేకుండా ఈ నాయకులంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పటినుండీ తీర్చిదిద్దబడినవారే, తమను తాము తీర్చిదిద్దుకున్నవారే. ఇది దేశంలోని నలుమూలలా ఉద్యమాలు తమ ప్రాంతాలకు అన్వయించుకుని పదే పదే తీర్చిదిద్దాల్సిన నమూనా అనేది నా మనసులో గాఢంగా ముద్రవేసుకున్నది. చివరిగా ఆయనకు మరణదండన విధించిన వార్త చదువుతూ “వినగానే ఏం చేసి ఉంటాడు?” అని ఊహించుకోబోయాను. కానీ నిజానికి ఇది మాత్రం ఊహించనవసరం లేదు. ఒక కళాకారుడు అందునా ఒక ఆదివాసీ కళాకారుడు, ఒక విప్లవ సాంస్కృతికోద్యమ కార్యకర్త/ నాయకుడు ఏం చేస్తాడు? ఆయనా అదే చేశాడు, ఆయన సంస్థ చెప్పే రాజకీయాల్ని, వాటికి సాధనమైన ఝార్ఖండీ కళల్నీ అభిమానిస్తూ కోర్టు హాలులో నిండిపోయిన ప్రజలందరూ ఆయన్ను అనుసరించారు. వాళ్లు పాడారు. ఈ దేశాన్ని సామ్రాజ్యవాద కోరల నుండీ, భూస్వామ్య సంకెళ్ల నుండీ, దళారీ నిరంకుశ బూర్జువా పంజాల నుండీ విడిపించి తీరుతామనీ ‘వో సుబహ్ కభీ తో ఆయేగీ” (ఆ ఉదయం ఎప్పటికైనా వస్తుంది) అనే గొప్ప ఆత్మవిశ్వాసాన్ని వారు గానం చేశారు. చెరసాలలు, ఉరికొయ్యలు తమ విప్లవ చేవనూ, తమ ప్రజల విముక్తి కోసం పోరాడే తమ సంకల్పాన్ని దెబ్బ తీయలేవని ఆలాపించారు.
ఆపరేషన్ గ్రీన్ హంట్ దురాగతాలు బీహార్-ఝార్ఖండ్లలో ఎంత పాశవికమైన రూపాల్లో కొనసాగుతున్నాయనేది ఇంకా చాలా నమోదు కావల్సే వున్నది. బీహార్‌లో కరడు గట్టిన భూస్వామ్యానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా జరగుతున్న వర్గపోరు చాలా భీకరంగానే సాగింది. అక్కడి రాజ్యం ఎంచుకున్న అణచివేత పద్ధతుల్లో విప్లవ రైతాంగ కార్యకర్తలకు ఉరిశిక్షలు వేయడం ప్రముఖమైన అణచివేత రూపంగానే ఉంటూ వస్తోంది. ఇక 2004లో సిపిఐ (మావోయిస్టు) పార్టీ ఏర్పడి, మన్మోహన్ సింగ్ దాన్ని ‘భారతదేశ అంతర్గత భద్రతకు అతి పెద్ద ముప్పు’గా ప్రకటించాక బీహార్-ఝార్ఖండ్లలో అత్యధిక సంఖ్యలో సిపిఐ (మావోయిస్టు) నాయకుల్ని, అంటే పొలిట్‌బ్యూరో మొదలుకొని, రాష్ట్రస్థాయి, జిల్లాస్టాయి, ఏరియా స్థాయి నాయకుల వరకు అరెస్టులు చేసి ఎక్కడెక్కడి కేసులో (ఆంధ్రప్రదేశ్ నుండి అస్సాం దాకా) వారి మీద బనాయించి, బెయిల్స్ ఇవ్వక, వయసు మీరిన, అనారోగ్యంతో ఉన్న వారికి సరిగా వైద్య సదుపాయాలు ఇవ్వక రకరకాలుగా వేధిస్తున్నారు. నారీ ముక్తి సంఘం అధ్యక్షురాలు, మన దేశం సగర్వంగా మొదటి వరుసలో చెప్పుకోవాల్సిన విప్లవ మహిళా ఉద్యమ నాయకురాలు కామ్రేడ్ షీలాదీదీని అరెస్ట చేసినప్పుడు, జైల్లో వున్నప్పుడూ కూడా రకరకాలుగా వేధించారు. అనారోగ్యం పాలయినా సరిగా వైద్య సహాయం అందివ్వడం లేదు. బెయిల్స్ వచ్చినా గేటు ముందే తిరిగి అరెస్టు చేసి తిరిగి లోపల పడేశారు. కామ్రేడ్ భూపేష్‌దా, కామ్రేడ్ జనార్థన్‌జీలు దక్షిణ, ఉత్తర బీహార్‌లలో భూస్వామ్య విధానాన్ని నడ్డి విరిచి రైతాంగాన్ని ఆత్మవిశ్వాసంతో తలెత్తేలా చేసిన వ్యవసాయ విష్ణవోద్యమ నిర్మాతలు. కామ్రేడ్ భూపేష్‌దా వయసు 72 సం॥లు, అనేక సంవత్సరాలుగా అనారోగ్య పీడితుడు. జనార్ధన్‌జీ 60వ పడిలోకి అడుగు పెడుతున్న మనిషి నేడు పదుల సంఖ్యలో విప్లవోద్యమ వివిధ స్థాయిల నాయకులు జైళ్లలో మగ్గిపోతున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పేరుతో వీరికి కఠిన శిక్షలు విధిస్తూ వారిని శాశ్వతంగా జైళ్లలోనే సమాధి చేసే కుట్రను సోనియా-మన్మోహన్-చిదంబరం ముఠా పన్నుతూ దేశప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి మాత్రం చర్చల చిలకపలుకులు వల్లిస్తోంది. రాష్ట్రపతితోనూ వల్లింపజేస్తోంది.
ఝార్ఖండ్లో ఆపరేషన్ గ్రీన్ హంట్ గానీ, అంతకు ముందు నుండీ కొనసాగుతున్న ‘సేంద్ర’ అనే పేరుగల విప్లవ ప్రతీఘాతుక హంతక క్యాంపెయిన్ గానీ అక్కడున్న అక్కడ గల అపారమైన ఖనిజ సంపదను కొల్లగొట్టడానికే అనేది నేడు స్కూలు పిల్లలకు కూడా అర్థమైన విషయమే. అక్కడ వారి ‘దోపిడీకి ఉన్న అతి పెద్ద అడ్డంకి” మావోయిస్టు ఉద్యమం బలంగా వుండడం, విస్థాపన వ్యతిరేక ఉద్యమం బలంగా వుండడం. బీహార్ (ఇప్పటి ఝార్ఖండ్ని కలుపుకొని) బ్రిటిష్ పాలనకూ, ‘దికూ’ల (బయటివారి) దోపిడీకీ వ్యతిరేకంగా గొప్ప ఆదివాసీ తిరుగుబాట్లకు నెలవైన ప్రాంతం. సంథాలీ ఆదివాసులు ఒకటి కాదు అనేక సాయుధ తిరుగుబాట్లు లేవనెత్తారు. బీర్సా ముండా ‘ఉల్‌గులాన్’ గురించి మహాశ్వేతాదేవి పుస్తకం ద్వారా, ఇతరత్రా ఆంధ్రప్రదేశ్‌లోని సీరియస్ పాఠకుల్లో తెలవని వారు వుండరు. ఆ విప్ణవవీరుల వారసులు ఇవ్వాళ అక్కడ బరిగీసి నిలిచారు. వారు సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల్నీ, వారి తొత్తుల్నీ తమ సహజ వనరుల్ని, తమ అరుదైన, అపారమైన ఖనిజ సంవదనూ, తమ అద్వితీయమైన ప్రాచీన కళా, సంస్కృతుల్నీ, తమ జీవన విధానాన్ని, తమ పిల్లల భవిష్యత్తునూ ధ్వంసం చేయనివ్వకుండా తమ గుండెలనొడ్డి అక్కడ నిలబడ్డారు. అక్కడి రూర్ధండ్, అభేన్ వంటి కళా, సాహిత్య సంస్థలు తమ ప్రజల పోరాటాలకూ, ఆకాంక్షలకూ కళారూపాన్నిస్తూ వారికి గట్టి సాంస్కృతిక దన్నుగా నిలుస్తున్నారు. విస్థాపన వ్యతిరేక పోరాటంలో ఆదివాసులకు ఊపిరి అయిన ఆట, పాట, నాటకం ఆయుధాలుగా మారిపోయాయి. జీతన్ మరాండీ గానీ, మిగతా సాంస్కృతిక కార్యకర్తలు గానీ నిజంగా తాము బనాయించిన తప్పుడు కేసుల్లో నిందితులు కారని రాజ్యానికి తెలియనిది కాదు. జీతన్ మరాండీని వాళ్లే అరెస్టు చేసి జైల్లో బంధించినప్పుడు జరిగిన కొన్ని యాక్షన్ల కేసులను కూడా వారు ఆయన మీద బనాయించడాన్ని ఏమనాలి? ‘ప్రజాపక్షం వహించే కళాకారులను వేధించి, లొంగదీసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నదనేది ఒక వాస్తవమైతే ఈ “పాటల తూటా’లకూ, ‘ఆటల మందుపాతర’లకూ రాజ్యం తక్కువ భయపడ్డం లేదనేదీ మురొక వాస్తవం. కళకుండే శక్తే అటువంటిది కదా. (దండకారణ్యానికి వెళ్లినప్పుడు ఒక కామ్రేడ్‌ను పేరు అడిగితే ‘జీతన్ అన్నాడు. ‘అరే, ఝార్ఖండ్లో సాంస్కృతికోద్యమ నాయకుడి పేరు కూడా జీతన్ తెలుసా?” అన్నా. ఆయన మెత్తగా నవ్వి, ‘ఆయన పేరే పెట్టుకున్నా” అన్నాడు. ‘ఆయన్ని చూశావా’ అంటే లేదు, ఆయన్ని చూసిన ఒకాయన ఇష్టంగా నాకీ పేరు పెట్టుకున్నాడు” అన్నాడు. ఇన్ని రకాలుగా వుండచ్చన్నమాట ప్రభావం అనుకున్నా). ఇప్పుడా శక్తినే మళ్లీ తమను తాము పరిరక్షించుకోవడానికి కూడా ఆ కళలు, కళా సంస్థలు, కళాకారులూ ఉపయోగించాల్సిన తరుణమిది. సుబ్బారావు పాణిగ్రాహి, చినబాబు, పద్మ, దివాకర్‌లను భారత ఫాసిస్టు రాజ్యం బలిగొంది. పదులమంది ఎపి, ఎన్‌టి, ఏఓబి జెఎన్నెం, పితూరి ఏందన దళం, దండకారణ్య చేతనా నాట్సమంచ్ కళాకారులను బూటకపు ఎన్‌కౌంటర్లు, ఎన్‌కౌంటర్లలో ప్రభుత్వ బలగాలు చంపేశాయి. కళాకారిణులను అత్యాచారాలు చేసి చంపిన ఘటనలున్నాయి. కుమారి, దాసూరాం మలేకాలను కూడా రాజ్యమే మలేరియా రూపంలో మింగింది. సల్వాజుడుంను ఎండగడుతూ దేశమంతా సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తూ (ఎపిలోనూ) ప్రచారం చేసిన సాంస్కృతిక బృందం నాయకుడు ప్రమోద్ కిడ్నీ సమస్యతో చనిపోయాడు. రాజ్య నిర్బంధం లేకుంటే వీరూ చనిపోయేవారు కాదు, జెఎన్నెం భాస్కర్ కృష్ణానదిలో మునిగిపోయేవాడూ కాదు. ఇప్పుడు జీతన్ మారండీని, ఇతర కళాకారులనూ మింగాలని రాజ్యం అనే కొండచిలువ నోరు తెరుచుకుని ముందుకొస్తోంది. ఆ ‘సంథాలీ సిరింగ్‌ను రాజ్యం మింగేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.
జీతన్ మరాండీ అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమాఖ్యలో కూడా నాయకత్వ కామ్రేడ్. ఆయనతో పాటు శిక్ష పడినవారిలో దళిత, ఆదివాసీ కళాకారులున్నారని వార్తాపత్రికల కథనం. వీరి ఉరిశిక్షలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారాందోళనలు చేపట్టాల్సిన అవసరం విప్లవ కళా, సాహిత్య సంస్థలన్నిటిపైనా మరింతగా వున్నది. వీటి నేపథ్యంలో బీహార్-ఝార్ఖండ్ లలో ఆపరేషన్ గ్రీనహంట్ వికృత రూపాలను మరింతగా వెలుగులోకి తీసుకురావడానికి ఓ పనిగా పూనుకోవాల్సిన అవసరమూ వున్నది. కెజి కన్నాబిరాన్, పత్తిపాటిల స్ఫూర్తితో మొత్తంగానే ఉరిశిక్షల రద్దుకు వ్యతిరేకంగా విశాల ఉద్యమంగా దీనిని మలచాల్సిన అవసరమూ వుంది. ఇటీవల బీహార్‌లోని కటిహార్‌లో అరెస్టయిన ముగ్గురు సిపిఐ (మావోయిస్టు) నాయకుల్లో ఒకరైన విజయ్ కుమార్ ఆర్య కన్నాబిరాన్ చనిపోయినప్పుడు ఆయన్ను గుర్తు చేసుకుంటూ బీహార్ విప్లవ రైతాంగ కార్యకర్తలకు ఉరిశిక్షలు విధించినప్పుడు ఆయన వాటిని రద్దు చేయించడానికి చేసిన కృషిని ఎంతగానో కొనియాడాడు అనీ, తాను అప్పుడు ఈ పని మీద ఆయన వద్దకు హైదరాబాద్ వెళ్లి కలిసినప్పుడు ఆయన నుండి పొందిన ఆదరణను హృదయపూర్వకంగా గుర్తు చేసుకున్నాడనీ, బీహార్. సాయుధ వ్యవసాయక విప్లవోద్యమం ఆయన సేవలను ఎన్నడూ మరువదంటూ నివాళి అర్పించాడని ఆయన ఉపన్యాసం విన్నవారు చెప్పారు. బీహార్, ఆంధ్రప్రదేశ్ విప్లవోద్యమాలు, విప్లవ ప్రజాసంఘాలు, పౌరహక్కుల పోరాటాలు అన్నీ ఇటువంటి ఎన్నో విడదీయరాని బంధాలతో పెనవేనుకుని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఉరిశిక్షలు మళ్లీ అటువంటి ఒక సందర్భాన్ని ముందుకు తెచ్చినట్టుంది.
2003లో బీహార్- ఝార్ఖండ్ లలోని విశాల మైదాన, అటవీ ప్రాంతాల్లో చురుగ్గా పని చేస్తూ బలమైన విప్ణవ మహిళా సంఘంగా ఎదిగిన నారీ ముక్తి సంఘంతో ఇతర ప్రాంతాల్లోని మహిళా ఉద్యమ అనుభవాలు కలబోసుకుని, ఒకరి నుండి ఒకరం నేర్చుకోవడానికని నేనూ, మరొక సీనియర్ మహిళా ఉద్యమ నేత రాజశ్రీఝార్ఖండ్ వెళ్ళాము. ఒక నెల పైగా వారితో కలిసి వున్నాం, వారితో గ్రామాలు తిరిగాం, వర్క్‌షాపులు నిర్వహించుకున్నాం. నా జీవితంలోకెల్లా అత్యంత విలువైన అనుభవాల్లో 1991లో మొదటిసారిగా దండకారణ్యంలో అడుగుపెట్టి క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం గడ్చిరోలి డివిజన్ మొదటి మహాసభలకు హాజరై వారితో అక్కడి గ్రామాల్లో వారితో పాటు తిరగిన రెండు నెలల కాలాన్నీ (అమరురాలు కామ్రేడ్ ఎల్లంకి అరుణ ఆధ్వర్యంలో), 2003లో నారీ ముక్తి సంఘం వారితో కలిసి కా. షీలాదీదీ ఆధ్వర్యంలో గడిపిన ఈ నెల కాలాన్నీ నేను తప్పక లెక్కవేస్తాను. నేటి ఈ రెండు బలమైన విప్లవ మహిళా ఉద్యమాలూ ప్రధానంగా ఆదివాసీ (ప్రాంతాల ఉద్యమాలే కావడం యాదృచ్చికం కాదు, అనివార్యమే అన్పిస్తుంది – అక్కడి పోరాట చరిత్రలను వలస వ్యతిరేక ఉద్యమాల కాలం నుండి కూడా పరిశీలించినప్పుడు. అప్పటివరకూ స్థానికంగా తప్ప ఎన్‌ఎంఎస్ గురించి ఎక్కువగా మనకెవరికీ తెలీదనేది అర్ధమై ఆ ఉద్యమాన్ని పరిచయం చేస్తూ ఒక వ్యాసాన్నీ, ఎన్‌ఎంఎస్ అధ్యక్షురాలు కా. షీలాదీదీని ఇంటర్వ్యూ చేసి దాన్ని ఇంగ్లీషులో ప్రచురించగా తర్వాత అవి తెలుగు, హిందీ భాషల్లోకి అనువాదమై వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. (బహుశా గోండీలో కూడా అయ్యాయేమో). ఆ కాలంలోనేఝార్ఖండ్ అభేన్ నాయకులు, సభ్యులు కలిసినప్పుడు (ఎన్ఎంఎస్ అంటేఝార్ఖండ్ ఎభేన్ పిల్లలూ కలిసే వుంటారు దాదాపుగా) వారి నుండి తెలుసుకున్న విషయాలు కూడా స్థానికంగా తప్ప ఎక్కువగా మనకెవరికీ తెలీదు అని అర్ధమై అప్పుడు తూర్పు కనుమల్లో జెఎన్నెం బాధ్యతలను నిర్వహిస్తున్న కామ్రేడ్ బద్రికి ఒక లేఖ రూపంలో రాశాను. అక్కడి “తూర్పు కనుమ’ పత్రికలో ప్రచురణ కోసం పంపాను. కానీ ఏవో కారణాల చేత అది ప్రచురణ కాలేదని తెలిసింది. జీతన్ మరాండీకీ, ఇతరులకూ ఉరిశిక్ష పడిన నేపథ్యంలో ఈ వ్యాసంతో పాటు దానినీ దుమ్ము దులిపి ‘అరుణతార’కు పంపిస్తున్నాను. 2003కీ, ఆ తర్వాతకీ చాలా మార్పులే వచ్చి వుంటాయి ఆ సంస్థలో, దాని ఎదుగుదలలో. అయినప్పటికీ ఆ సంస్థ కృషిని ఒక మేరకు పరిచయం చేసేదిగా, ఉరిశిక్షల వంటి రూపంలో అక్కడ కొనసాగుతున్న ఆపరేషన్ గ్రీనహంట్ దురాగతాలకి వ్యతిరేకంగా క్యాంపెయిన్సు నిర్మించాల్సిన అవసరం ఉన్న తరుణంలో ఏ మేరకైనా ఉపయోగపడ్డుందనే దానితోనే పంపిస్తున్నాను. ఎఐఎల్‌ఆర్‌సీ సభ్యసంస్థగా రూర్ధండ్ అభేన్ గురించి గానీ, ఈ రెంటికీ నాయకుడిగా జీతన్ మరాండీ, ఇతర కళాకరుల గురించి గానీ విరసం, ఎఐఎల్‌ఆర్‌సీ తమ పద్దతిలో తాము ప్రచారంగానీ, ఉరిశిక్షల వ్యతిరేక క్యాంపెయిన్‌ను గానీ చేపట్టే వుంటాయని ఆశిస్తున్నాను. ఆ సంస్థలు ప్రజలకు చేస్తున్న మంచీ-మేలూ, వారిపై రాజ్యం చేస్తున్న ఘోరాలూ వెలికి రావాలి. వాటిని తెలుసుకుని జనం ప్రభంజనం అవ్వాలి. అసలు విషయం అదీ.
( అరుణతార, మే-జూన్ 2011 )