భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బట్టబయలు చేస్తూ, రాజ్యాంగ ఆదర్శాలను అవహేళన చేస్తూ, ఇది అధికారికంగా కూడా హిందుత్వ రాజ్యమని ప్రకటిస్తూ మే 28న కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని అనేక రాజకీయ పార్టీలు బహిష్కరించాయి. అట్లాగే  మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై   చర్యలు తీసుకోవాలని కోరుతూ చాలా కాలంగా  పోరాడుతున్న క్రీడాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశ ప్రతిష్టను క్రీడాకారులు దశ దిశలా వ్యాపింపజేస్తారని పొగిడే పాలకులు న్యాయమైన డిమాండ్‌ మీద రాజీపడకుండా పోరాడుతోంటే తమ సహజమైన అణచివేత చర్యలకు పాల్పడ్డారు.  ఒక పక్క సకల హిందూ లాంఛనాలతో,  సాధు సంతుల సమక్షంలో మత క్రతువులతో  ఈ దేశ లౌకిక, ప్రజాస్వామిక పాలనా కేంద్రమైన పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభిస్తూ  లైంగిక వేధింపులకు గురైన క్రీడాకారులకు న్యాయం చేయాలని ఆందోళన చేసిన ఒలింపిక్‌ ఛాంపియన్స్‌ సాక్షి మాలిక్‌, వినేష్‌ ఫోగట్‌ తదితరులపై దారుణంగా  హిందుత్వ మోదీ ప్రభుత్వం దాడి చేసింది. మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌  కొత్త పార్లమెంటు  ప్రారంభ క్రతువుల్లో పాల్గొన్నాడు. అతని చేతిలో అవమానాలకు గురైన క్రీడాకారులు ఆందోళనకు దిగితే అరెస్టు చేశారు. 

చాలా కాలంగా సాగుతున్న  మహిళా మల్ల యోధుల న్యాయ పోరాటం పట్ల ప్రభుత్వ వైఖరి మరోసారి కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభం సందర్భంగా బైటపడిరది. హిందుత్వ న్యాయభావనకే కాదు. మౌలికంగా అది మానవతకే వ్యతిరేకం. పితృస్వామ్య ఆధిపత్య స్వభావంతో స్త్రీల లైంగికతపై దాడి చేస్తుంది. మామూలుగా సమాజమంతా వ్యాపించి ఉండే పితృస్వామ్యం హిందుత్వ రాజ్యంలో స్త్రీలపై క్రూరమైన దాడి చేస్తుంది. సమాజంలో గుర్తింపు ఉన్న మహిళలను కూడా అది అణచివేస్తుందని ఈ ఘటన తాజాగా రుజువు చేస్తోంది.  అయితే  ఢల్లీి లోని జంతర్‌ మంతర్‌ వద్ద రెజ్లర్లు చేస్తున్న  నిరసన దీక్షకు సమాజంలోని అనేక ప్రగతిశీల సంస్థలు మద్దుతు ఇచ్చాయి. వ్యక్తులు సంఫీుభావం ప్రకటించారు. అణచివేతను ఎదుర్కొంటూ ప్రజా పోరాటాలతోనే హిందుత్వ ఫాసిజాన్ని నిలేయాలని, వేరే దారి లేదని ఈ ఘటన రుజువు చేస్తోంది.

Leave a Reply