(చుండూరు మార‌ణ కాండ మీద అక్టోబ‌ర్ 1991న విప్లవ రచయితల సంఘం, జనసాహితీ సాస్కృతిక సమాఖ్య, ప్రజా రచయితల సమాఖ్య త‌ర‌పున విడుద‌ల చేసిన ఈ క‌ర‌ప‌త్రాన్ని సి. రామ్మోహ‌న్‌గారు రాశారు. ఆయ‌న స్మృతిలో పున‌ర్ముద్ర‌ణ‌)

చుండూరు దళిత ప్రజా పోరాటానికి మద్దతు నీయండి

భూస్వామ్య, దోపిడి, పీడన సంస్కృతులను నేలమట్టం చేయండి.

గురజాడ, వీరేశలింగం పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణగారల సంఘ సంస్మరణోద్యమానికి గుంటూరు జిల్లా కేంద్రస్థానం, త్రిపురనేని హేతువాదఉద్యమం, జమీందరీ వ్యతిరేక ఉద్యమాలు, గుంటూరు జిల్లాను కదిలించివేసినవి. పన్నుల సహాయనిరాకరణ ఉద్యమం, పల్నాడు రైతాంగ తిరుగుబాటు, కన్నెగంటి హనుమంతు అమరత్వం చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకున్నవి. ఆధునిక సాహిత్యంలో స్తీ స్వేచ్ఛ‌ కోసం గర్జించి కలం పట్టిన చలం, శాస్త్రీయ ఆలోచనాతరంగాలను మీటిన కొడవటిగంటి, సాంఘిక పీడనకు, ఆంటరానితనానికి వ్యతిరేకంగా కలం ఝ‌ళిపించిన గుర్రం జాషువా ఇంకా శారద తదితర అనేక మంది రచయితల సాహిత్య కృషిద్వారా తెనాలి “సాహిత్య రాజధాని” అని పేర్కొనబడింది. అనేక దశాబ్దాలుగా నాటబడిన అభ్యుదయ, ప్రగతిశీల ఉద్యమ భావజాలం మరేమైనట్టు ? ఈరోజు గుంటూరు జిల్లా కులాల కురుక్షేత్రంగా ఎందుకు మారుతోంది.

సాహిత్య, సామాజిక రంగాలలో ఎన్నెన్నో ఉద్యమ వెల్లువలకు కేంద్రమైన గుంటూరు జిల్లా ‘చుండూరు”లో జరిగిన ఘోర సంఘటన మానవ చరితకే మలినం. అది మున్నెన్నడూ కనీ వినిఎరుగని హత్యాకాండ, ఆగ్రకుల దురహంకారం అత్యంత క్రూరంగా తన మృగ స్వభావాన్ని వెల్లడి చేసుకుంది. నేలతల్లి బిడ్డలైన  దళితులు కిరాతకంగా హత్య చేయబడినారు. 8 మంది శవాలు లభించగా,  మిగతా 23 మంది ఆచూకీ తెలియడం లేదు. స్థానిక పోలీసుల సహకారంతో, రాజ్యాధికారం తమ వారిదే నన్న ఆహంకారంతో చెలరేగిన అగ్రవర్ణ భూస్వాములు దళితుల్ని ముక్కలు ముక్కలుగా నరికి, గోనె సంచుల్లో కుట్టి, తుంగభద్రా డ్రైయిన్‌లో పారవేశారు. సుమారు 500 మంది రెడ్డి భూస్వాములు మిగతావారిని కలుపుకొని దళితుల్ని వెంటాడి, వేటాడి, బరిసెలతో, గొడ్డళ్ళతో నరికి నరికి, అమానుషంగా  హత్య చేశారు. ఆత్మగౌరవ పోరాటంలో వొరిగిపోయిన దళిత వీరుల్ని స్మరిస్తూ, దళితులు రాష్ట్ర వ్యాప్తంగా హంతకులను శిక్షించాలని కోరుతూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. చుండూరు సంఘటనకు దేశవ్యాప్తంగా ప్రతిస్పందన రగిలి, దళితుల పోరాటానికి అఖిల భారత స్థాయిలో సంఘీభావం, మద్దతు లభించింది. కాని రాష్ట్ర పాలకులకి, గుంటూరు పోలీసు అధికార్లకు చీమకుట్టినట్లయినా లేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌(ఐ) ప్రభుత్వం దళితుల, పీడిత ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయి, అ(గ్రకుల భూస్వాముల ఏజెంటుగా పాలనసాగిస్తున్నట్లుగా స్పష్టంగా తేలిపోయింది. ఎలాంటి రాజకీయ విశ్లేషణ అవసరం లేకుండానే “’మాలపల్లిలో దళితుడు తెల్సుకున్న సత్యమిది.

1832-88  ప్రాంతంలో గుంటూరు జిల్లాలో కనీవిని ఎరుగని కరువు ఏర్చడి వికృతంగా ప్రజల్ని పశువుల్ని బలి తీసుకుంది. వ్యవసాయ కూలీలు, చేనేత కార్మికులు ఆకలితో మలమల మాడిపోయారు. భూమిశిస్తు పడిపోయి, జమీందార్లు కూడా చేతులెత్తేయగా ఈస్టిండియా కంపెనీకి రెవిన్యూ ఆదాయం పడిపోయింది. గోదావరి, కృష్ణా నదులకు అనకట్టలు కట్టి నీటి పారుదల సౌకర్యాలను కల్గించే పథకం 1850లో సిద్దమైంది. జమీందార్లకు మూడు పూవులు, ఆరుకాయలుగా పంట పొలాలు ఫలించి సిరులు పొంగుతుంటే, జమీందారీ ఆగడాలకు వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమాలు చెలరేగినవి. కాల ‘క్రమాన వ్యాపార మధ్యతరగతి రైతాంగ సెక్షన్లు పుట్టుకొచ్చినవి. కోస్తా జిల్లాల ప్రాంతంలో పంట నుండి మిగులు పట్టణాలకు వ్యాపించి, విద్యా సాంస్కృతిక కేంద్రాలుగా అనేక పట్టణాలు మొలుచుకు వచ్చినవి. సాహిత్య, కళారంగాల్లో అభ్యుదయ ధోరణులకు, రాజకీయాల్లో జాతీయోద్యమానికి పునాదులు ఏర్పడినవి. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆయిల్‌ మిల్లులు రైసు మిల్లులు పెరిగి, మిగులు వ్యవసాయ రంగంలో వ్యాపార వర్దాలను సృష్టించింది. సినిమా పరిశ్రమ మిగులును స్వంతం చేసుకుంది. కోయంబత్తూరు, బొంబాయి బట్ట మిల్లులకు ‘ప్రత్తిపంట కేంద్రంగా గుంటూరు జిల్లా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత మిర్చి, పసుపు, పొగాకు వంటి వ్యాపార పంటలకు గణనీయమైన స్థాయిలో ఉ త్ప్పత్తి కేంద్రమైంది. కృష్టా గోదావరీ జలాలు భూస్వాముల షవర్‌ బాత్‌లై, హరిత విప్లవం సృష్టించిన మిగులు సంపద ఒక మేరకు మాత్రమే పరిశ్రమలకు తరలింపబడి, ఎక్కువ భాగం అనుత్పాదక రంగాల్లో స్థానం ఏర్పరచుకుంది.

సినిమాలు, బార్‌లు, లాడ్జింగ్‌లు మొద‌లైన‌వి  పెరిగి పెరిగి, అభివృద్ధి వికృత రూపం తన వైరుధ్యాలను భిన్న రూపాలలో ప్రకటించుకుంది. సినిమా, పత్రిక, వ్యాపార రంగాలపై ఆధిపత్యం సంపాదించిన వర్గాలే రాష్ట్ర పాలక పార్టీలలో ప్రబల స్థానం కల్గివున్నారు. సంపదల పంపకంలో, రాజ్యాధికారం సంపాదించుకోవడంలో పాలక పార్టీల మధ్య వైరుధ్యాలున్నప్పటికీ, మౌలికంగా ప్రజాఉద్యమాల అణచివేతలో, అగ్రవర్ణ భూస్వామిక శక్తులను కాపాడడంలో, దళితులపై అత్యాచారాలు చేయడంలో వారంతా ఐక్యంగానే వున్నారు. కారంచేడు, చుండూరు రెండు హత్యాకాండలు ప్రజలకు రాజకీయ శాస్తాల అధ్యయనం లేకుండానే రాజకీయాలు నేర్చిన పుస్తకాలు.

పారిశ్రామిక రంగంలోనైనా, వ్యవసాయ రంగంలోనైనా పెట్టుబడి ఒక సామాజిక సంబంధమే. మనదేశ పెట్టుబడి అస్వతంత్రమైనది; సామ్రాజ్యవాదంతో మిలాఖతైనది. అందుకే భూస్వామిక నిర్బంధం నుండి వనరులను, శ్రమశక్తిని విముక్తి చేయలేకపోయింది. గుంటూరు జిల్లా జాతీయ, సంస్కరణవాద ఉ ద్యమాలకు కేంద్రమైనప్పటికీ, అభివృద్ధి పేరిట వ్యవసాయ రంగంలో ఆధునాతన మార్పులు ప్రవేశపెట్టబడినప్పటికీ భూమి సంబంధాలలో మౌలికమైన మార్పులు మాత్రం రాలేదు. సామాజిక సంబంధాలలో మౌలిక మార్పులకు ప్రధానమైన భూసంస్కరణలు అమలు జరపబడలేదు. పెట్టుబడి ఉపరితలంతో తలపడి రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామిక భావజాలాన్ని నిర్మించలేకపోయింది అస్వతంత్రమైన పెట్టుబడి తన గత భద్రతారాహిత్యం వలన కులాన్ని ఒక సామాజిక సంబంధంగా మరింత బలపడదేలా చేసింది. కోస్తా జిల్లాలలో వ్యవసాయ రంగంలో ఆధునాతన విధానాలు, పెట్టుబడిదారీ పద్దతులు ప్రవేశించిన మొదటి దశలో నూతనంగా తలెత్తిన వర్గాల వల్ల ప్రగతిశీల ఉద్యమాలు కూడా పుట్టుకొచ్చాయి. అభివృద్ధి వెలుగులో ఒక వర్గం మరింత సంపన్నులుగా కాగా, అభివృద్ధి చీకటిలో పేదవారు మరింత పేదవారై, కాలక్రమాన ఒకనాటి ప్రగతిశీల స్వభావం కల్గిన సెక్షన్స్‌ సైతం అభివృద్ధి నిరోధకులుగా, తిరోగామి శక్తులుగా, ముందుకు వచ్చాయి. జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు, విశాలాంధ్రలో ‘ప్రజరాజ్యం ఉద్యమాలకు న్యాయకత్వం వహించిన పార్టీలు కూడా కుహనా ప్రగతిశీలురుగా మారి పాలకపార్టీల జెండాలను తమ భుజాన మోస్తున్నారు. అంతర్లీనంగా వర్గానికి, కులానికి గల సంబంధం ఒక భౌతిక వాస్తవంగా వారి రాజకీయాల ఐక్యకార్యాచరణలో చూడవచ్చు.

1924లో రచింపబడిన ఉన్నవ లక్ష్మినారాయణ గారి నవలలో దళితనాయకుడు రామదాసు జాతీయోద్యమంలో గాంధీజీ అనుచరుడై గాంధీజీ కుట్ర పూరిత హరి జనోద్ధరణ కార్యక్రమానికి పరిమితమై, చివరకు రామదాసయతీంద్రునిగా సాక్షాత్మారమిస్తాడు. ఆనాటికి గుంటూరు జిల్లాలో మాల మాదిగలు జాతీయోద్యమంలో పాల్గొన్నారు. “స్వరాజ్యం వస్తే తామంతా  సామాజికంగా, ఆర్థికంగా సమానత్వం పొందుతాం” అని ఆకాంక్షించారు. కాని 1947 అధికార మార్చిడి తరువాత, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో నీటిమీద వ్రాతలై, నెహ్రూ సోషలిజం దేశాన్ని సామ్రాజ్యవాదుల అంతర్జాతీయ విపణిలో తాకట్టు పెట్టింది. గుంటూరు జిల్లా దళితులు  రామదాసయతీంద్రుని బోధనల వలన లాభంలేదని, వేంకటదాసు ధిక్కార స్వభావాన్ని ప్రేరణ చేసుకుంటున్నారు. గాంధీ హరిజనోద్దరణను, పాలక పార్టీల సంక్షేమ చర్యల హద్దుల వరకే దళితులు పరిమితమైతే, ఆర్థికరంగంపై, భావజాల రంగంపై ఆధిపత్యం గల ఆగ్రవర్ణ భూస్వామిక శక్తులకు ‘పేచీలేదు. కానీ రాజ్యాంగ పరిధిలోనైనా సరే. దళితులు హక్కుల సాధనకై చైతన్యంతో కదిలితే ఏలినవారికి, వారికి పునాదులైన వర్గాల వారికి ఒళ్ళు మండుకొస్తుంది. కండకావరం పెరుగుతుంది. ఇక వారు వెంకటదాసుని, దళితపులిని మింగలేరు. కనుక తమ అమానుష వికృత ఆధిపత్యం సాంస్కృతిని ప్రదర్శిస్తారు.

దోచుకోవడమే ప్రధానమైన రాజకీయ వ్యవస్థలో ‘ప్రజలపట్ల ప్రజాఉ ద్యమాల పట్ల అన్ని రకాల అణచివేత పాలకవర్గాల ప్రధాన విధానమౌతుంది. పీడితులు ఉద్యమించిన చోట్ల పోలీసు బలగాలతో, నిర్బంధ చట్టాలతో, ఆర్ధ సైనిక బలాలతో, అణచివేత వేట ప్రయోగిస్తారు. హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసమో ప్రజలు సంఘటితం కావడం మొదలయితే, కులపరమైన దాడులు చేస్తారు. అన్ని నిమ్నకులాల వారి ఐక్యత ఒక నినాదంగా, వాస్తవంగా రూపు దిద్దుకుంటే, మత పునరుద్ధ‌రణవాదంతో విభజిస్తారు. ఆగ్రకులాలలోని పేద, మధ్యతరగతి ప్రజల ఆశాంతిని, పేదరికాన్ని కలం, మతం పేరుతో సొమ్ముజేసుకొని దళితులపైనా, అల్పసంఖ్యాక వర్ణాలపైన భౌతిక, సాంస్కృతిక దాడులకు పురికొల్పుతారు.

కంచికచర్ల కోటేష్‌ సజీవ దహనం నుండి చుండూరు సామూహిక దళిత హత్యాకాండ వరకు, జరుగుతున్న చరిత్ర అంతా రణరక్త ప్రవాహసిక్తమే. ఏ దేశ చరిత్రలోనైనా, ఏకాలంలోనైనా సాధించిన పరమార్ధం కాస్త‌నైనా వుంటుందేమోకాని, మన దేశ చరిత్ర సమస్తం దరిద్రుల్ని దళితుల్ని కాల్చుక తినడమే. చుండూరు లాంటి రాచపుండులకు మొత్తం వ్యవస్థాపరంగానే శస్త్ర చికిత్స జరగాలి. పాలకపార్టీల కుట్ర పూరిత సహాయక చర్యలు, ఓదార్పు చిలుక పలుకులను దళితులు అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. రివిజనిస్టు పార్టీల మొసలి కన్నీళ్ళు చుండూరు బాధితుల ఆగ్రహాన్ని చల్లబరచలేవు. జస్టిస్‌ గంగాధరరావు కమీషన్‌ న్యాయం కల్లిస్తుందని విశ్వసించడం లేదు. అందుకే నేటి ఘోరకలికి బాధ్యతగా ముఖ్యమంత్రి జనార్ధన్‌రెడ్డిని, నాటి కారంచేడుసంఘటనలో న్యాయం కూర్చని యన్‌.టి. రామారావును, వారి మిత్రపక్షాలను దళితులు తిరస్మరించారు. కారంచేడు బాధితులు చీరాలలో విజయనగర కాలనీలో ఆశ్రమం పొందితే చుండూరు బాధితులు తెనాలి నుండి “చుండూరు” వెళ్ళారు. అమరుల అంత్య క్రియలు జరిపిన రక్త క్షేత్రంలో “రాజీలేని పోరాటం కొనసాగిస్తాం” అని ప్రతిన పూనారు. అక్కడే శిబిరం వేసి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామిక పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.ఎన్నిరాయితీలు, కల్లబొల్లి గారడీ మాటలు చెప్పినా దళితులు ఒక్క మాటపై, పాటపై, త్రాటిపై నిలబడి, ప్రజాస్వామిక, విప్లవ శక్తులు అందిస్తున్న సంఘీభావంతో పోరాడడంతో, రాజ్యాంగయంత్రం తల్లడిల్లి పోయింది. పిచ్చెక్కిన, త్రాగిన కోతిలా చుండూరు బాధితుల శిబిరంపై పోలీసు బలగాలతో దాడిచేసింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న దళిత నాయకులను అరెస్టు చేసింది. శిబిరంలోని  వస్తువులను విధ్వంసం చేసింది. ఇనుప బూట్లు, లారీలు దళిత మహిళలపై కవాతుచేసినవి. దళితుల హత్యాకాండలో స్థానిక పోలీసు అధికారుల కుమ్మక్కును బయట పెట్టగల ప్రధాన సాక్షి శ్రీ అనిల్‌ కుమార్‌ను ఉద్దేశ్యపూర్వకంగా కాల్చి చంపించింది. పోలీసు బలగాలతో చుండూరు దిగ్భంధనం చేయబడింది. అగ్రవర్ణ భూస్వామిక అహంకారానికి సివిల్‌ పాలనాధికార్లు చేతులెత్తేసి, సాయుధ పోలీసులకు చుండూరును ఒప్పచెప్పింది.

చుండూరు హత్యాకాండ వెంటనే అందరూ ఆ దుశ్చర్యలను ఖండించారు. ఇక మెల్లమెల్లగా రెండవ రకం భావజాలం వ్యాప్తిలోకి తేబడుతున్నది. దళితుల ఉద్యమానికి ప్రజాస్వామిక వాదులు, ప్రగతిశీల శక్తులు, విప్లవ శక్తులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుండగా, మరొక వైపు దళిత వ్యతిరేక భావజాలాన్ని క్రొత్తగా వెలిసిన సంస్థలు, పత్రికలు, పాలకపార్టీలకు చెందిన వారు ప్రచారంలోకి తెస్తున్నారు. ఏర్పడిన, ఏర్ప‌ర‌చ‌బోతున్న వాతవరణంలో కులాల ప్రాతిపదికగా మనుషులు ఆలోచించే ధోరణి ప్రవేశించింది. దోపిడీ రహిత సమాజం ఆకాంక్షించే రచయితలుగా, ప్రజా పోరాటాలకు, త్యాగాలకు కళా, సాహిత్య రూపం యిచ్చే రచయితలుగా, కళాకారులుగా మేం “చుండూరు” సంఘటనను ఖండిస్తున్నాం. వారి పోరాటానికి పూర్తి మద్దుతును ప్రకటిస్తూనే, కులాల ప్రాతిపదికగా ప్రజల్ని విడగొట్టే సాంస్కృతిక భావజాలాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వాస్తవాలను ప్రజల ముందుంచుతున్నాం.

వ్యాపార పంటల ఉత్పత్తికి అగ్ర స్థానం పొందిన గుంటూరు జిల్లాలో హౌరా – మద్రాసు రైల్వేలైను మీద తెనాలి పట్టణానికి 15 కీ.మీ. దూరంలోచుండూరు గ్రామం వుంది. ఆరు వేల జనాభా గల్గిన చుండూరులో 800 రెడ్డికుటుంబాలు, 500 దళిత కుటుంబాలు, 200 తెలగ కుటుంబాలు, 25 బ్రాహ్మణ కుటుంబాల వారున్నారు. వ్యాపార పంటలు సమృద్ధిగా పండగల్లి. భాగం ‘రేటు కల్గిన భూమి 1200 ఎకరాలు రెడ్డి భూస్వాములు కల్లి వుండగా, కేవలం 80 ఎకరాలను మాత్రమే దళితులు కల్గియున్నారు. రైల్వేలైను, తెనాలి-పొన్నూరు పట్టణాల సాంగత్యం, క్రైస్తవ మిషనరీల సేవాకార్యక్రమాలు, రిజర్వేషన్‌ సౌకర్యాల వలన దళితులు చాలా మంది విద్యవంతులైనారు. ఉన్నత విద్యను పొందినారు. గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ విద్య పొందినవారు చుండూరులో రెడ్డి యువకుల కంటే దళితుల్లోనే ఎక్కువగా యున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో ఉ ద్యోగాలు చేస్తున్న వారున్నారు. చదువుకున్న తరం, నేటి దళిత తరం, స్వరం

మార్చి “మేం బానిసల్లా ప్రతకలేం, మాకూ ఆత్మ గౌరవం వుందని ప్రశ్నించడం ప్రారంభించారు. కారంచేడు సంఘటనతో వెలసిన దళిత మహాసభ నుండి సంఘటిత చైతన్యం ప్రదర్శిస్తున్నారు. శ్రీ జ్యోతిరావుపూలే, డా॥ అంబేద్మర్‌ రచనల నుండి సాంఘిక సమానత్వ స్పృహను దళితులు పొందుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పీడిత రైతాంగ ఉద్యమాల ప్రేరణ నుండి వర్గస్పృహను అవగాహన చేసుకుంటున్నారు.

                చుండూరు గ్రామంలో పొట్టి శ్రీరాములు, నేతాజి సుభాష్‌ చంద్రబోసు విగ్రహాల ప్రక్మనే డా! అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు దళిత యువకులు పోరాటం చేసి, విజయం పొందారు. ఒక సంవత్సరం క్రిందట అభ్యుదయ భావాలు గల రెడ్డి కులానికి చెందిన అమ్మాయి, వో దళిత అబ్బాయి వివాహం చేసుకోవడం రెడ్డి భూస్వాములకు కంటగింపుగా తయారైంది. అడుగడుగునా దళితులు ప్రశ్నించడంతో, తరతరాలుగా కొనసాగుతున్న ఆధిపత్య పునాదులు కదిలి పోతున్నట్లుగా భూస్వాములు భావించడంలోనే కులం అహం వుంది. మానవ సమానత్వం కోసం దళితుల ఆక్రందన, ఆవేశం ఒకవైపు, అగ్రకుల భూస్వాముల అహంకారం మరొకవైపు సంఘర్షణ పడిన సంఘటన లెన్నో చుండూరులో జరిగాయి. దళిత యువతరం చైతన్యం చుండూరు నుండి చుట్టు ప్రక్కల గ్రామాలకు వ్యాపించడం జరిగింది. సారవంతమైన పొలాలపై ఆధిపత్యం కల్గిన చుండూరు, చుట్టు ప్రక్కల రెడ్డి భూస్వాములకు దళితులు కొరకరాని కొయ్యగా మారడంతో వారి అహం విషాన్ని చిమ్మింది. ప్రజాస్వామిక, బద్దంగా, సంఘటితంగా తమ అశాంతిని, అసంతృప్తిని వ్యక్తీకరించుకుంటూ, సమానత్వం  కోసం, ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటంలో రాజీ పడేది లేదని దళితులు

చాటిచెప్పారు.

ఆగస్టు ఆరవ తేదీ ఘఫోర సంఘటన కంటే ముందుగానే చుండూరు భూస్వాములు స్థానిక పోలీసులతో, రాజకీయ నాయకత్వంతో సంప్రదించుకొని శాశ్వతంగా దళితులను అణచివేసే పథకాన్ని సిద్దం చేసుకున్నారు. రెడ్డి భూస్వాములు స్థానిక పోలీసులతో, రాజకీయ నాయకత్వంలో సంప్రదించుకొని శాశ్వతంగా దళితులను అణచివేసే పతకాన్ని సిద్దం చేసుకున్నారు. రెడ్డి భూస్వాములు తప్పుడు కుల చైతన్యం ఆసరాగా తెలగ భూస్వాములను, యితరులను కలుపుకొని ఒక గ్రామ కమిటిగా ఏర్పడి దళితులపై బహిష్కరణ ఉత్తర్వులను జారీ చేశారు. పంట పొలాల్లో వ్యవసాయ పనుల నుండి దళితుల్ని బహిష్కరించారు. దళితులు కౌలుకు చేస్తున్న మూడు వందల ఎకరాల భూమిని, ఆయా రైతుల ఒప్పందాలను వాపసు తీసుకున్నారు. అగ్రవర్థాలకు చెందిన  వీదుల్లోకి దళితులు రాకూడదని ఆంక్షలు విధించారు. దళితుల కెవరికీ ఆరోగ్య సౌకర్యం కల్గించరాదని ఆదేశించారు దళితేతరులు ఎవరూ దళితులతో ఎలాంటి వ్యవహారాలు, సంబంధాలు కలిగి వుండరాదని ప్రకటించారు. రాజ్యాంగం సమాధి చేయబడి ‘మనుధర్మం” చుండూరు శాసనంగా ప్రకటింపబడింది. ఆత్మగౌరవం కోనం ప్రారంభింవబడిన పోరాటం ఆర్థిక కార్యకలాపాల నుండి బహిష్మరింపబడడంతో దళితులు దిగిరాలేదు. కదా! ‘ఊరు మనది, వాడమనది” అంటూ తమ పోరాటం కొనసాగించారు. చుండూరులో నిషేదాజ్ఞలు ప్రకటింపబడినవి. సాయుధ పోలీసులు, అధికారుల పర్యవేక్షణలో శాంతి సమాధి చేయబడింది. రాజ్యాంగ విధులంటే అగ్రకుల భూస్వాములకు వత్తాసు పలకడమేనని విశ్వసించిన పోలీసులు, తమ విధులను గాలికి వదిలేసి, దళితులపై జరిగే కిరాతక చర్యలకు భూస్వాములకు తోడ్చాటునందించారు. మంత్రి వర్గ విస్తరణలో తమ వర్గం వారికే ఆధిక్యతా పీఠం వేయబడడంతో, “మనదే రాజ్యం, మనదే చట్టం” అనే కుల-వర్గ తాదాత్యత అగ్రకుల భూస్వాముల్లో రాక్షస ప్రవృత్తికి స్వాగతం పల్మింది. చుండూరు అగ్రకుల భూస్వాములు అలా మానసికంగా భావించడంలోనే కులానికి, వర్షానికి గత విడదీయరాని బంధాన్ని భారత రాజకీయ సామాజిక జీవనంలో కులం పట్టును, పాత్రను, మనం అర్థం చేసుకోవాలి. ఆగస్టు ఆరవ తేదీనాడు విచ్చలవిడిగా సాగిన దమన కాండ, ఆగస్టు 15 స్వాతంత్ర్యపు మేడిపండు బూటకపు స్వభావాన్ని బయట పెట్టింది.

కారంచేడు సంఘటన తరువాత అగ్రకుల భూస్వామిక శక్తులు లోలోపల సంతోషించి వుండవచ్చుగాని బహిరంగంగా ఎవరూ ఆచర్యల్ని సమర్ధించలేదు. చుండూరు సంఘటన వెంటనే ఆగ్రకుల భూస్వాములు తమ దమన కాండను సమర్ధించుకునేందుకు, ముందు ముందూ ఇలాంటి చర్యలే జరగగలవనే హెచ్చరికతో పాటు, తమ నిర్మాణాన్ని రూపొందించుకున్నారు. “సర్వ  జనాభ్యుదయ పోరాట సమితి”ని స్థాపించి, చుండూరు కిరాతక చర్యలకు సమర్థ్ధనగా కుల దురహంకారులు రంగ ప్రవేశం చేశారు. “ప్రతిభి తమ సొంతం, జాగీరు అని భావించే అగ్రకుల యువకులు, పాలక పార్టీలైన కాంగ్రెసు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు పరోక్షంగా సర్వజనాభ్యుదయ పోరాట సమితికి మద్దతునిస్తున్నారు. రిజర్వేషన్ల సమస్యపైనా, మతకల్లోలాలపైనా పైకి ఒకమాట, లోపల మరో ఆచరణ గల ఊసరవెల్లి రంగుమార్చిడి రాజకీయాలను ప్రజలు మరచిపోలేదు.

పులి గోవుతోలు కప్పుకొని నీతి భాష్యాలు పలకినట్లుగా గౌతమీ బుద్ధునీ చిత్రంతో వేసిన సర్వజనాభ్యుదయ పోరాట సమితి కరపత్రంలో తామే ఈ హత్యలు చేశామని బహిరంగంగా ప్రకటించుకున్నారు. వారికి దళితులను, స్త్రీలను అవమాన పరచిన వారిని శిక్షించే హక్కుందనే ఫాసిస్టు అహంకారాన్ని చాటుకున్నారు. రాజ్యాంగ నియమ నిబంధనల కంటే మత ధర్మాలు, పురాణాలు, ధర్మం శక్తివంతమైనవని, వాటి ప్రకారమే ధర్మాన్ని కాపాడేందుకు తమకు శిక్షించేహక్కుందని కుల దురహంకారులు వ్రాసుకున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దళితులకు హెచ్చరికగా బంద్‌ నిర్వహించారు. ఊరేగింపులు జరిపారు. గుంటూరు జిల్లాలో దళితులకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్గించిన ఎ.సి.కాలేజిపై, హాస్టలుపై దాడులు చేసి భీభత్సాన్ని సృష్టించారు. ఈ ప్రభుత్వం దళితులకు అనేక రాయితీలు, సౌకర్యాలు కలిస్తే వాళ్ళు అభాద్యులై, లంపెన్స్‌గా మారి, ఆడపిల్లలను వేధిస్తున్నారని అగ్రవర్ణ మహిళలపై ఆత్యాచారాలు చేస్తున్నారని, త్రాగుబోతులై, జులాయిలై సమాజానికి బండరాళ్ళుగా మరారని అగ్రవర్ణ భూస్వాములు తమ కరపత్రాల ద్వారా పత్రికా ఇంటర్వ్యూల ద్వారా విష ప్రచారానికి పూనుకున్నారు. దళితుల ఆగడాలు, వేధింపులు తట్టుకోలేక అగ్రకులాల వారు అంతటి పరిస్థితికి సిద్దపడినారనే భావానికి బలం కల్గించేలా “నాణేనికి మరోవైపు అంటూ పత్రికలు ప్రచారం చేస్తున్నవి.

సినిమాహాలు సంఘటన, ఆడపిల్లల వేధింపులే దళితులపై తాము దాడి చేయడానికి కారణం అని అగ్రవర్థాలు భావిస్తే అదే న్యాయమైన చర్య అనుకుంటే, ఈ దేశంలో లక్షలాది గ్రామాల్లో దోపిడీ పీడినా పద ఘట్టనల్లో నల్లిపోతున్న దళిత, పీడిత ప్రజలు కూడా ఆ హెచ్చరిక చేయగలరు. అప్పుడు అత్యధిక మెజార్టీ అ(గ్రకుల భూస్వాములకు, వారికి వత్తాసు పల్కిన వారికి బతికే హక్కుండదని మరచిపోతున్నారు.

మహిళలపై అత్యాచారాలు ఎవరు చేసినా ఖండించాల్సిదే. కాని మహిళలపై మైనర్‌ బాలికలపై అత్యాచారాలు, మత్తుమందులు, రౌడి చర్యలు, త్రాగుడు, జూదం, పెత్తందారి స్వభావం, రాగింగ్‌ -అన్నీ పాలకవర్గాల సంస్కృతికి చెందినవే కాదా! ఆడపిల్లలపై అత్యాచారాలు, మహిళలను అగౌరవపరచే చర్యలు ఈ దేశంలో అనాదిగా జరుగుతున్నవే. ఈ చర్యల్ని ఎవరూ సమర్ధించుకున్నా ఎందుకు జర్గుతున్నవనేది విశ్లేషించుకోవాల్సిందే. వర్ణ, పురుషాధిపత్య సమాజంలో స్తీ భోగవస్తువుగా, వంటయింటి కుందేలుగా, పతివ్రతగా, శృంగార దేవతగా, స్వాతంత్ర్యం అర్హత లేని దానిగా, పిల్లలుకనే యంత్రంగా, భర్త అదుపాజ్ఞలలో వుండేదిగా అనాదిగా చూడబడుతోంది. ఇది పీడిత ప్రజలైన గిరిజనులు, దళితుల సంస్కృతికాదు. వర్గ పురుషాధిక్య సమాజంలో పాలక వర్గాల సంస్కృతే అందరి సంస్కృతిగా బలవంతంగా ప్రజలపై రుద్దబడుతుంది. ప్రతి మతమూ స్త్రీని ఒకే పద్దతిలో అణచివేతకు గురిచేసింది. సంపన్న భూస్వామిక వర్గాల మిగులు అనుత్పాక రంగాల్లో పెట్టుబడె బూతు సినిమాలు, అశ్లీల పత్రికలు, క్లబ్బులు, బార్‌లు లాభార్జనా కేంద్రాలైన క్రమంలో, పతన సంస్కృతిని పద్దతి ప్రకారం పాలకులు ప్రజలపై రుద్ది వారి సంస్కృతిక చైతన్యాన్ని మొద్దుపరుస్తున్నారు. సినిమా, సారా, బూతు సాహిత్య వ్యాపారాల ద్వారా కోట్లు గడించి రాజకీయాధికారాన్ని కూడా శాసిస్తున్న అగ్రకుల భూస్వాములే సమాజంలోపతన సంస్కృతిని, కిరాయి గూండాలను, మాఫియా గ్యాంగులను, హంతక ముఠాలను సృష్టించి తమతమ ఆస్తులను, అధికారాలను, నిలబెట్టుకుంటున్నారు. ఎవరూ చెప్పకుండానే సాధారణ ప్రజలకు కూడా తెల్సిపోతున్న బహిరంగ సత్యాలివి. దళితులే ఆడపిల్లలపై ఆగడాలు చేస్తున్నారనే సర్వజనాభ్యుదయ పోరాట సమితి, చలకుర్తిలో ముత్తవ్వను వివస్త్ర చేసి నగ్నంగా ఊరేగించిన రెడ్డి భూస్వాములను పల్లెత్తు మాట కూడా అనకపోవడానికి బహుశా కులాభిమానం, అడ్దొచ్చిందేమో! మన అభివృద్ధి పథకాలకే లంపెన్‌ స్వభావం వుంది. మన అస్వతంత్రమైన పెట్టుబడి, అర్థ భూస్వామిక వ్యవస్థ ప్రజాస్వామ్యీకరణకు వ్యతిరేకమైనవి సామ్రాజ్యవాద భూస్వామిక సంస్కృతి దేశవ్యాప్తమై, అన్ని కులాల, వర్గాల వారి జీవితపు అన్ని అంశాల్లోకి చొచ్చుకపోయి, పరాయీకరణకు గురిచేస్తుంది. తమవి కాని సంస్కృతి, విలువలు తమవి అనుకునేల భ్రమపెట్టి, సమాజపు మౌలిక విషయాలను ప్రశ్నించకుండా ప్రజారాసులను తప్పుదారి పట్టించేందుకు కారణమౌతున్నవి.

రామజన్మ భూమి ఉద్యమం, రిజర్వేషన్‌ వ్యతిరేక ఆందోళనలు భారతీయ సంక్షోభానికి ప్రతీకలు, ఆ సంక్షోభం నుండి బయట పడేందుకు ‘పై మత, కుల అహంకార ఉద్యమాల ద్వారా దేశ వ్యాప్తంగా హైందవ మతధర్మ భావజాలం వ్యాప్తిలోకి తేబడింది. ఆభావజాలం ఒక సామాజిక శక్తిగా వెలుగులోకి రావడం లోనే, తద్వారా పాలకవర్గాలకు అది ప్రయోజనమైందని మనం భావించాలి. పై ఉద్యమాల వలన చెలరేగిన హైందవ అగ్రవర్ణ అదిక్యతా భావజాలం నేపధ్యంలోనే అగ్రవర్ణ భూస్వాములు “తామే రాజ్యం, చట్టంగా” సంఘటిత వడుతున్నారు. భూమి కోసం, భుక్తికోసం, జరిగే పోరాటాలకు వ్యతిరేకంగా భూమి సేనలు నిర్మించి, దళితులపై పీడిత ప్రజలపై క్రూరమైన దాడులకు పూనుకుంటున్నారు. బీవార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలోని అగ్ర వర్ణ భూస్వాముల, పాలక పార్టీల రాజకీయ సంస్కృతి ఆంధ్రకు దిగుమతి చేయబడుతోంది.

దళితులు చేస్తున్న కుల నిర్మూలనా పోరాటాలను, పీడిత ప్రజల వర్గ పోరాటాలను తప్పుదారి పట్టించేందుకు ఆంధ్రదేశాన్ని కులాల కురుక్షేతంగా మార్చేందుకు ఆ(గ్రవర్ణ భూస్వాములు పథకం ప్రకారం పనిచేస్తున్నారు. “సర్వ జనాభ్యుదయ  ‘సేవా సమితి పేరిట అగ్రకులాలలోని పేద విద్యార్థులకు మెడికల్‌, ఇంజనీరింగ్‌, కోచింగ్‌ రెసిడెన్నియన్‌ కాలేజీల స్థాపన ప్రారంభించారు. పట్టణాలలో ఉన్నతోద్యోగాలలో వున్న అగ్రవర్ణ మేధావుల సానుభూతిని పొందేందుకు అగ్రకులాలలోని పేద, మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు చేయవల్సిన కృషినంతా చేస్తున్నారు. “సర్వజన  అని బిరుదును తగిలించుకున్నప్పటికీ అగ్రకులాల ఐక్యతా వేదికనే అది.

ఈరోజు దళితుల ఉద్యమం కుల వ్యవస్థ కొనసాగింపుకోసం కాదు. కులం వల్ల పీడనకు, దోపిడికి బలైన వారెవ్వరూ కుల వ్యవస్థను కాంక్షించరు. కులం వల్ల సంపదలు, సామాజిక స్థాయిని, రాజ్యాధికారాన్ని పొందగల్లినవారే, కుల వ్యవస్థ కొనసాగాలని కోరుకుంటారు. వారి సంపదలు, భోగభాగ్యాలు, రాజ్యాధికారాలు, సామాజిక బెనత్యం, కుల, వర్గ సమాజం ద్వారానే కొనసాగగలవు. పాలక వర్గాలు గిరిజనులకు, దళితులకు చేపడుతున్న సౌకర్యాలు, రాయితీలు వారిపై ప్రేమతో, లేక కుల, వర్గ రహిత సమాజం కోసం కాదు. ఆత్యధిక ప్రజారాసులైన వారి ఓట్ల బ్యాంకు ద్వారానే తమ రాజ్యాధికారం నిలుపుకోవడం కోసం. అయితే అభివృద్ధి వెలుగు నీడలు సృష్టించిన వైరుధ్యాల మూలంగా, వ్యవసాయ కూలీలు, గిరిజనులు, దళితులు, మహిళలు, విద్యార్థులు, చిన్న సన్నకారు రైతాంగం, కార్మికులు ప్రభుత్వ ప్రయివేటు రంగంలో మధ్యతరగతి తమ తమ జీవితాలను చుట్టిపడేసిన ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు ఉద్యమాలు చేపడుతున్నారు. ఈరోజున దేశవ్యాప్తంగా పెరిగిపోయిన ఆర్థిక‌ సామాజిక సంక్షోభం, సామాజిక సంక్షోభం నుండి బయటపడేందుకు పాలకులు కుల, మత భావ జాలంపై ఆధారపడితే పీడిత తాడిత ప్రజలు ఐక్యతా పోరాటం సూత్రంగా సమస్యల పరిష్కారానికి సంసిద్దులౌతున్నారు.

కులం ఆనాడైనా, ఏనాడైనా ఒక భావజాలం మాత్రమేకాదు. ఉత్పత్తి సంబంధాల భౌతిక వాస్తవం, అర్ధవలస్క ఆర్ధ భూస్వామిక నిరంకుశ పెట్టుబడిదారీ సమాజాల్లో కులానికి వర్గానికి గల విడదీయరాని సంబంధాన్ని అర్ధం చేసుకోవాలి. సాంఘిక వివక్షతకు వ్యతిరేకంగా దళితులు చేసే పోరాటం కుల నిర్మూలనా లక్ష్యం గలది. ఆగ్రకులాలకు చెందిన భూస్వామిక వర్దాలే గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాధికారాన్ని కల్గి ఉండి, కుల, వర్గ దోపిడి పీడనలను అమలు జరుపుతున్నారు. కులపీడనకు, భూమి సమస్యకు సంబంధం వుంది. దేశవ్యాపితంగా దళితులపై సాగుతున్న దాడుల్లో భూమి పోరాట సమస్య ప్రధానమైంది. అయితే సమాజంలో ప్రత్యేకంగా తమ సమస్యల్ని ఏ సెక్షన్‌ ప్రజలు పూర్తిగా పరిష్క‌రించుకోలేరు. దోపిడీ, పీడనలు ప్రధాన సూత్రంగా గల కుల, వర్గ సమాజం అంతిమంగా కూల్చి వేయబడి. ఆకలి, శోకం లేని నూతన ప్రజాస్వామిక సమాజాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం గిరిజనులు, దళితులు, మహిళలు, రైతు కూలీలు, విద్యార్థి యువజనులు, సకల పీడిత వర్గాలు కలిసి కట్టుగా, నూతన ప్రజాస్వామిక విప్లవ చైతన్యంతో పోరాడాలి. మరో ప్రపంచాన్ని నిర్మించుకోవాలి.

దోపిడీ సమాజంతో ముడిపడియున్న దోపిడీ సాంస్కృతిక విలువలు, ఆచరణ దోపిడీ సమాజం రద్దు చేయబడినపుడే అంతిమంగా నాశనమౌతాయి. పీడితులు తమను తాము విముక్తి చేసుకునే మార్గంలో సమస్త పీడితులకు వారి వారి సకల సంకెళ్ళ నుండి విముక్తి కల్గిస్తారు. తరతరాలుగా కుల, వర్గ పీడనకు గురై పోరాటం చేస్తున్న చుండూరు దళిత ప్రజా ఉద్యమానికి పూర్తి సంఘీభావం ప్రకటించి భుజం-గళం కలిపి పోరాడవలసిందిగా ప్రజాస్వామిక వాదులకు, రచయితలకు, కళాకారులకు, మేధావులకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం. అగ్రకులాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలు పాలకులు సృష్టించే మాయలకు, భమలకు లోనుగాకుండా వాస్తవాలను ఆలోచించాల్సిందిగా, ప్రజాస్వామిక దృక్పథంతో ప్రజా ఉద్యమాలకు మద్దతు నివ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

 ” చుండూరు హత్యాకాండ, పోలీసు కాల్పులకు బాధ్యులైన భూస్వామ్య

అగ్రవర్ణ దురహంకారులను, పోలీసు అధికారులను శిక్షించాలి.

దళిత ప్రజానీకంపై భూస్వామ్య, ఆగ్రవర్ణ దురహంకారుల దాడులను అరికట్టాలి.

చుండూరు భాదితులకు పునరావాసం కల్పించాలి.

ప్రభుత్వ బంజరు, దేవాలయం సీలింగు, తదితర భూములను దళితులకు, యితర భూమిలేని పేదలకు పంచాలి.

 ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ దమన కాండ నశించాలి !

సామ్రాజ్యవాద, భూస్వామ్య సంస్కృతి నశించాలి !

నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి !


మా నవతా పతాక మన సి.రామ్మోహన్‌ 9 75 2/7

Leave a Reply