ఏవో ఏవేవో
మరుపురాని
గురుతులతో
కరచాలనం చేసే
సనివేశాలు
సందేశాలు,
పూర్తిగా
ఆయుధంతో
సాయుధమైన
ఓ స్వాప్నికుడి
ఓ ప్రేమికుడి
ఆలోచనతో
ఆశయంతో
రక్తం చిందించే
ఆ పాదాల నడకలు
ఈ దేశానికి
దేహాన్ని అర్పించే
ఆజాదిని అందించే
సాహసాలు
అహా
మీరు ఏంతటి ప్రేమికులు
అచంగా మా భగత్ లా
మీరు ఎంతటి సాహసీయులు

Related Articles
నా తల తీస్తానంటావు
మూతికి గుడ్డ నడుముకు తాటాకు కట్టుకుని అరిపాదాలతో నీ వీధిలో నడిపించిన సనాతన ధర్మం వద్దంటే నా తల తీస్తానంటావు మా ఆడవారినే జోగినిగా మార్చి నీ కోరికలు తీర్చుకునే ధర్మం మాకు వద్దంటే
ఆకుపచ్చని అమ్మ
ఓ గొంతు మూగబోతే ఆ గజ్జె నీది కానేకాదు ఓ స్వరంలో అలలు ఎగిసిపడటం ఆగిపోతే కొన్ని అలల్లో కొన్ని కాంతులు మాయమవుతే ఆ సముద్రం నీది కానేకాదు కటకటాల వెనుక కాంతిరెక్కవు నువ్వు
వలస కావిడి
నెత్తిన నీళ్ళకుండ భుజాన సూర్యుడు ఆకలిముల్లు గోడలపై ఎగాదిగా ఎగబాకిన పాదాలు లాగేసిన కంచంలో ఆరబోసే తెల్లారికై చుక్కల పరదాతో రాత్రంతా కొట్లాడిన పాదాలు ఇంటి కుదుర్లు జల్లిస్తూ కార్పొరేట్ కాలేజీ వంటపోయ్యిలో కట్టెలవుతున్నాయి