ఏభై ఏళ్ళ మీ ఉద్యమ ప్రయాణానికి
సెలవంటూ నిష్ర్కమించారా
మీ చేతులలో పెరిగిన
ఎన్నెన్ని పోరాట రూపాలు
మొక్కవోని మీ
గుండె నిబ్బరం చివరి శ్వాస
వరకూ రాస్తూనే వుందన్న
వార్త మీ ఆచరణకు గీటురాయి
వసంత గీతం
ఆలపిస్తూ సాగిన
మీ నడక యీ అసహన
అపసవ్య వేళలో
ఆగిపోయి మమ్మల్ని
ఒంటరి చేసారు కదా
సారూ ఈ ఏరువాక
పున్నమి రోజు మరల
మీరు సేద్యం చేయ
ఈ నాగేటి చాళ్ళలో
ఉదయిస్తారు కదూ!!
లే లేచి రా సారూ
మీ ఆకు పచ్చని ఎర్ర చుక్క టోపీ
ధరించి ఏకే అందుకుని
ధూలా ఆడుదురు
(కామ్రేడ్ సుదర్శన్ సారుకు వినమ్ర జోహార్లతో)