జులై 2 చెరబండరాజు అమరత్వం రోజు విరసం ఆవిర్భావసభ  సంఘపరివార్‌ వందేళ్ల ఫాసిజం పై సాంస్కృతిక ప్రతిఘటనా వ్యూహం ప్రకటించే ప్రతిజ్ఞ తీసుకోవడం చాల అర్థవంతంగా ఉంది. ఆయన విరసంలో తన కవిత్వం ద్వారా రచనల ద్వారా ‘ఏ కులమబ్బీ మాది ఏ మతమబ్బీ’ , ‘జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త’ వంటి పాటలు, కవితల ద్వారా బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలంతో తలపడినాడు. జీవితాచరణలో ప్రతిఘటించాడు.

ఎమర్జెన్సీ కాలంలో ఆయన చెంచల్‌గూడ జైల్లో ఉన్నపుడు విరసం, మరికొందరు విప్లవ పార్టీల,  ప్రజాసంఘాల కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి డిటెన్యూలు అందరినీ ఒకే ఆవరణలో ఉంచారు. అట్లా దేశభక్తులను, దేశద్రోహులతో కలిపి ఉంచడాన్ని టైగర్‌ నరేంద్రగా హైదరాబాదు పాతనగరంలో సంఘపరివార్‌ పిలుచుకునే డిటెన్యూ జైళ్ల డిజిపి పర్యవేక్షణకు వచ్చినపుడు ప్రశ్నించాడు కూడ. కాని ఇర్వురినీ కలిపి ఉంచే ప్రత్యేక పరిస్థితుల్లో  బొజ్జా తారకం (విరసం), బంగారు లక్ష్మణ్‌ (బిజెపి)ల నాయకత్వంలో సహజీవనం చేయక  తప్పలేదు.

అజ్ఞాత నామం వెంకటరామయ్య పేరుతో అనారోగ్యంగా ఉన్న విప్లవపార్టీ నాయకుడు తరిమెల నాగిరెడ్డి ఉస్మానియా ఆసుపత్రిలో చేరి 28 జులై 1976న మరణించాడు. విరసం శిబిరం ఆయన సంస్మరణసభ జరుపుకున్నది. ఈ ఆవరణలోనే మొదట అనంతపురం జిల్లాలో, ఆ తర్వాత రాష్ట్రస్థాయి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా పనిచేసిన దేశముఖ్‌ అనే వయసుమళ్లిన వ్యక్తి ఉండేవాడు. ఆయన ఆగస్టు 15కు ముందు ఒక ప్రతిపాదన చేసాడు. నేను అనంతపురంలో పనిచేసిన రోజుల్లో నాకు నాగిరెడ్డి గారితో పరిచయమేర్పడిరది, నాకాయన పట్ల చాల గౌరవం ఉంది, ఆగస్టు 15న మేం ఆరవిందఘోష్‌ శతజయంతి కూడ తలపెట్టాం, దానితోపాటే అందరం కలిసి నాగిరెడ్డిగారి సంస్మరణ జరుపుకోవడానికి మాకు అభ్యంతరం లేకపోగా మా అభ్యర్ధన కూడ అన్నాడు. విడివిడిగా, కలిసి ఇరువైపుల బాధ్యులు చర్చించుకున్నాక అంగీకారం జరిగి ఆగస్టు 15న సభ జరిగింది. సభ ముగిసేముందు చెరబండరాజు ‘వందేమాతరమ్‌’ కవిత చదివాడు. ఇంక తారకం గారు, బంగారు లక్ష్మణ్‌ మాట్లాడి సభ ముగించాలి ` చెరబండరాజు మూత్రశాలకు వెళ్లాడు. కాసేపటికి నరేంద్ర కూడ అందుకే వెళ్లాడనుకున్నాం. చెరబండరాజు ‘అమ్మా’ అనే అరుపుతో అందరూ ఆందోళనగా బయటికి వెళ్లారు. ఆవరణమధ్యలో బ్యాడ్మింటన్‌ నెట్‌ కట్టడానికి పాతిన ఒక వెదురుబొంగు తీసుకొని నరేంద్ర తిరిగివస్తున్న చెర నెత్తిపై  కొట్టినట్టున్నాడు, ఆ కర్ర ఆయన పక్కన పడి ఉంది. చెరబండరాజు పడబోయి అరచి లేచి వస్తున్నాడు. అప్పటికి రెండుశిబిరాలు ఎవరిస్థానంలోకి వారు వెళ్లిపోయారు. విరసం శిబిరం ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నది. అప్పటికి ఆ శిబిరంలో 11 మందే ఉన్నారు. విరసంకు చెందిన కెవిఆర్‌, తారకం, రామిరెడ్డి, వివి, చెర మిగతావాళ్లు విప్లవపార్టీల వాళ్లు, ఎపిసిఎల్‌సి పత్తిపాటి వెంకటేశ్వర్లు. ఆవరణ ఒకటే. కిచెన్‌ ఒకటే. కాని మెస్‌లు వేరువేరు. మూకుడువంటి వంటపాత్రలు ఒకరు  వాడుకున్నాక మరొకరు వాడుకోవాలి. సాయంత్రం నాలుగుగంటల సమయంలో అందరూ బ్యాడ్మింటన్‌  ఆడుతున్నారు. తారకం గారు మంచి బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కూడ. గుర్రం విజయకుమార్‌ కిచెన్‌ నుంచి మూకుడు తీసుకొచ్చి తన కాలుకింద వేసుకొని ద్వారం దగ్గర చెట్టుకింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ విరసం శిబిరం సభ్యులంతా నిలబడ్డారు. ఆజానుబాహుడైన నరేంద్ర మూకుడు కావాలని వచ్చాడు. తీసుకో అన్నాడు విజయకుమార్‌. ఆయన తీసుకోవడానికి వంగాడు ` విజయకుమార్‌తో ప్రారంభించి చుట్టూ చేరినవారు తలా ఒక దెబ్బ వేస్తున్నారు. సైరన్‌ మోగింది. బిలబిల జైలు పోలీసులు, బయటి క్యాంపు పోలీసులు వచ్చారు. వాయువేగంతో విరసం శిబిరంలో అందర్నీ చుట్టూ పోలీసు ఎస్కార్ట్‌తో గేటుకు మరోవైపు  ఉండే మసీదుబ్లాకుకు మార్చేసారు.

ఆ విప్లవ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జార్జిరెడ్డి అనుచరుడుగా విరసం జ్ఞానేశ్వర్‌ కీర్తి ‘కొరడా కొన నుండి పిడి దాకా ఎగబాకి’ విద్యారంగంలో విషవృక్ష శాఖలు వేస్తున్న కొండయ్య అనే విద్యావ్యాపారి చేతిలో సజీవదహనానికి గురయ్యాడు. ఇదంతా ఏడో దశాబ్దం కథ.

వర్తమానంలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, బాబ్రీమసీదు విధ్వంసం కొనసాగింపుగా జడలు విప్పిన హిందూ బ్రాహ్మణీయ శక్తులను అన్నిరంగాలలో ప్రతిఘటించిన విరసం కామ్రేడ్‌ జి.ఎన్‌.సాయిబాబా. ఆయన విరసంకే పరిమితం కాకుండా ప్రజాప్రతిఘటనకు సంబంధించిన అన్నిరంగాలలో, ఢల్లీి యునివర్సిటీతో సహా దళిత, ఆదివాసీ, మైనారిటీ సామాజికవర్గాల కోసం దేశవ్యాప్తమైన పోరాటానికి నాయకత్వం వహించాడు. కేంద్ర హోంమంత్రులు చిదంబరం మొదలు వెంకయ్యనాయుడు దాకా, చివరకు సుప్రీంకోర్టు దాకా ఆయనను సంఫ్‌ుపరివార్‌ శత్రుశిబిరానికి మెదడు అని అక్షరాలా ప్రకటించారు. తీర్పులు చెప్పారు. ఆయనను, ఆయన సహచరులు అయిదుగురిని అరెస్ట్‌చేసిన దగ్గర్నించి ఇప్పటిదాకా ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్రస్థానం నాగపూర్‌ నుంచి ఎన్నికై అపుడు ముఖ్యమంత్రిగా, ఇపుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్‌ పీష్వాల వారసుడు. ఫడ్నవీస్‌కు ఓటు పీష్వా పాలనకు ఓటు అని నాగపూర్‌లో బిజెపి పోస్టర్లు కూడ వేసింది. 1982 నుంచి 2014 దాకా గడ్చిరోలిలో మావోయిస్టు పార్టీ చర్యలకన్నిటికీ సాయిబాబాను బాధ్యుణ్ని చేసి ఫడ్నవీస్‌ ఇచ్చిన ప్రకటనలు, చేసిన ప్రసంగాలు తెలుగుపాఠకులకు చేరకపోవచ్చు గానీ కేంద్రంలో హోంమంత్రిగా వెంకయ్యనాయుడు ఆంధ్రజ్యోతిలో సమాజంలో మేధావులపాత్ర గురించి రాస్తూ ప్రత్యేకించి జి.ఎన్‌.సాయిబాబా పేరుతీసుకొని రాసిన ఎడిట్‌పేజీ రచన కొందరికైనా గుర్తుండే ఉంటుంది. కబీర్‌ ప్రేమసందేశాన్ని పంచుతూ ఆయన రాసిన కవిత్వం, బయట ఉండగా చేసిన రచనలు, కృషి గురించి వివరించడానికి ఇపుడు వ్యవధి లేదుగానీ ఆయన 14 నెలల తర్వాత విడుదలయి 2016లో ఢల్లీి యునివర్సిటీ కింద పనిచేసే తన కాలెజిలో ఉద్యోగంలో చేరడానికి వెళ్లినపుడు ఎబివిపి నాయకత్వంలో సంఘపరివార్‌ గుంపు వచ్చి ఆయనను కాలెజిలో చేర్చుకోవద్దని, ఉద్యోగం నుంచి తీసివేయాలని యాజమాన్యంపై వత్తిడి తెచ్చారు. ఢల్లీిపీఠం కనుసన్నలలోనే ఇపుడిరక హైకోర్టు విచారణ దృష్ట్యా అండర్‌ ట్రయల్‌ గానే పరిగణించవలసిన ఆయనను ఉద్యోగంనుంచి తొలగించారు. ముల్కరాజ్‌ ఆనంద్‌ అన్‌టచబుల్‌ మొదలు కళ్యాణరావు అంటరానివసంతం వరకు ఆరునవలలు తీసుకొని ఆయన వలసవాదం ఇంగ్లిషు ప్రభావాల నుంచి బయటపడిన ఒకేఒక్క నవల ‘అంటరానివసంతం’ అని సిద్ధాంతగ్రంథం రాసాడు. అది ఇంకా వెలుగుచూడాల్సే ఉన్నది ` ఈ దేశంలో ముస్లింలకు పోరాడే ప్రజాస్వామిక  స్పేస్‌ (అవకాశాలు) రోజురోజుకూ మూసుకుపోతున్నాయి అని ఆవేదన చెందేవాడు. అందుకే ఆయన జైల్లో సంఫ్‌ుపరివార్‌ విద్వేష సంస్కృతికి ఎదురుగా కబీర్‌ ప్రేమతత్వాన్ని తన జీవనసందేశంగా ఎంచుకున్నాడు. ఆయనతోపాటు యావజ్జీవశిక్ష పడిన వారిలో సీనియర్‌ జర్నలిస్టు, రాజకీయ ఖైదీల విడుదలకోసం నిరంతరం పోరాడి 2012 ఆర్‌డిఎఫ్‌ సభల్లో  ‘గ్రేట్‌  డెల్యూజ్‌’ కి తానుచేసిన హిందీ అనువాద పుస్తకాన్ని విడుదల చేసిన ప్రశాంత్‌రాహీ సీనియర్‌ సిటిజెన్‌. తీవ్ర అనారోగ్యంతో అమరావతి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. జెఎన్‌యుకు చెందిన సాంస్కృతిక కార్యకర్త, అంగవైకల్యంతో బాధపడుతున్న హేమ్‌మిశ్రా తెలుగు సమాజానికి చిరపరిచితుడు. ఆజాద్‌, హేమచంద్రపాండే ఎన్‌కౌంటర్‌ సందర్భంగా తరచు తెలుగునేల మీదకు వచ్చి సాంస్కృతిక ప్రదర్శనలిచ్చినవాడు. మిగతా ముగ్గురు ఆదివాసుల్లో పదిసంవత్సరాలు శిక్షపడిన విజయ్‌ టిర్కి బెయిలుపై విడుదల అయ్యాడు. యావజ్జీవశిక్ష పడిన వారిలో పాండునరాటే ముప్పై ఏళ్ల యువకుడుగా మలేరియా సోకి జైల్లో ఏడాదిక్రితం మరణించాడు. స్పష్టంగా అతడిది కస్టోడియల్‌ హత్య. మహేశ్‌ టిర్కి యావజ్జీవశిక్ష పడి ఇపుడు హైకోర్టు విచారణ మిగతావారితోపాటు ఎదుర్కుంటున్నాడు. ఈ ఆరుగురు సహచరుల కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, గడ్చిరోలి కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఒక గోల్‌ నుంచి మరొక గోల్‌కు తన్నే బంతి లాగ న్యాయవ్యవస్థ అతి దారుణమైన వికృతక్రీడ ఆడుతున్నది. ఇపుడు సుప్రీంకోర్టు ఆదేశాలపై  న్యూబొంబాయి హైకోర్టు జులై 17 నుంచి కొత్తగా ఏర్పాటుచేసిన డివిజన్‌బెంచి విచారణ చేపట్టనున్నది. సాయిబాబా , అతని సహచరుల అరెస్టుకాలం నుంచి అన్ని ప్రజాస్వామ్యశక్తులను కలిపి పోరాడుతున్న విరసం ఈ ఆవిర్భావసభలోనే జులై 17 దాకా ఈ ఆరుగురి విడుదల పోరాటాన్ని చేపట్టడం ` ఆర్‌ఎస్‌ఎస్‌ వందేళ్ల ఫాసిజం ప్రతిఘటనాపోరాటంలో అనివార్య భాగమవుతుందని నేను భావిస్తున్నాను. సాయిబాబా డిఫెన్స్‌కమిటీకి అండగా తన సభ్యుడైన సాయిబాబా కోసం విరసం ఈ కర్తవ్యాన్ని నిర్వహిస్తుందని ఆశిస్తున్నాను.

ఇంక భీమాకోరేగాం 200 సంవత్సరాల సందర్భంగా పూనాలో జరిగిన ఎల్గార్‌పరిషత్‌ ఎజెండానే ‘నయీ పీష్వాయీ నహీ చలేగా’. ఆ సందర్భంగా వధూభద్రక్‌లో దళితుని సమాధిని కూలగొట్టిన సంఫ్‌ుపరివార్‌ ఎజెండానే బ్రాహ్మణీయ ఫాసిజంను ప్రతిఘటిస్తున్న అన్నిశక్తులను అర్బన్‌ మావోయిస్టుల పేరుతో కుట్రపూరితంగా నిశ్శబ్దం చేయడం. ఎల్గార్‌పరిషత్‌లో ‘నయీ పీష్వాయీ నహీ చలేగా’ అనే ప్రతిజ్ఞ పై ప్రసంగం చేసిన రిపబ్లిక్‌ పాంథర్స్‌ అధ్యక్షుడు సుధీర్‌ ధావ్లే దేశంలోనే ఫాసిస్టుశక్తులనెదుర్కొనే వారికి నాయకత్వం వహించే సుదీర్ఘపోరాట చరిత్ర గల సాంస్కృతిక సంఘ కార్యకర్త. మేధావి, కవి, రచయిత, నాయకుడు. ఆవాన్‌ నాట్యమంచ్‌ విలాస్‌గోఘ్రే ఉత్తేజంతో 1997 జనవరి 27న ఉర్దూ రచయిత, సినిమా దర్శకుడు సాగర్‌ సర్హదీ అధ్యక్షుడుగా, ముస్లిం, దళిత, సాంస్కృతిక సంస్థ ‘విద్రోహి’ని నెలకొల్పి, ‘విద్రోహి’ పత్రికను ఇప్పటికీ నిర్వహిస్తున్న సుధీర్‌ధావ్లే రాజద్రోహనేరం కింద 2014 వరకు మూడున్నరేళ్లు నాగపూర్‌ జైల్లో ఉండి నిర్దోషిగా విడుదలయ్యాడు.  ఇప్పుడు ఐదుసంవత్సరాలకు పైగా భీమాకోరేగాం ఎల్గార్‌ పరిషత్‌ కేసులో  రోనావిల్సన్‌, సురేంద్ర గాడ్లింగ్‌, షోమాసేన్‌, మహేశ్‌రావత్‌, వర్నన్‌ గొన్‌సాల్వెస్‌, అరుణ్‌ ఫెరైరా, హనీబాబు, కబీర్‌ కళామంచ్‌కు చెందిన ముగ్గురు యువసభ్యులతో పాటు తలోజా జైల్లో ఉన్నాడు.

1997 జనవరి 25న బొంబాయి ఘట్కోపర్‌ లోని అంబేద్కర్‌  విగ్రహానికి తారుపూసి చెప్పులదండ వేసిన సంఫ్‌ుపరివార్‌ దుశ్చర్యకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో రాష్ట్రమంతటా పెల్లుబికిన దళిత, ప్రజాస్వామ్య శక్తుల ప్రతిఘటనపై సిఆర్‌పిఎఫ్‌ ఘట్కోపర్‌లో కాల్పులు జరిపితే 11 మంది దళితులు అక్కడికక్కడ మరణించారు.  ఆ శవాలను ఆసుపత్రి శవాగారానికి తరలించిన నాడే దళితుడైన రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ ఢల్లీిలో ఏడుగుర్రాలరథం పై సైనిక వందనం స్వీకరించడానికి వచ్చాడు. (ఆయితే ఈ దేశానికి రాష్ట్రపతులైన వారిలో అపరాధభావమైనా  మిగిలిన మానవమాత్రుడాయన.  గుజరాత్‌ మారణకాండపై విచారమైనా వ్యక్తం చేసాడు) ఆ సందర్భంగా ఏర్పాటైన ‘విద్రోహి’ తర్వాతకాలంలో రిపబ్లిక్‌ ప్యాంథర్స్‌గా మారి ‘విద్రోహి’ పత్రిక మాత్రం నిర్వహిస్తున్నది.  జూన్‌ 5వ తేదీన 1426 రోజులు (ఐదుసంవత్సరాలు జైలులో పూర్తిచేసుకున్న సందర్భంగా సుధీర్‌ ధావ్లే రాసిన రెండుపాటలు సామాజిక మాధ్యమాల్లో చదివేవుంటారు.  సురేంద్ర గాడ్లింగ్‌ (ఈ సుప్రసిద్ధ న్యాయవాది కూడ నాగపూర్‌ దళితవాడ నుంచి ఆవాన్‌ నాట్యమంచ్‌ సాంస్కృతిక కార్యకర్తగా తన పోరాటం ప్రారంభించాడు) ఎనిమిదిరోజులు పెరోల్‌పై తల్లి వర్ధంతి ప్రథమసంవత్సర స్మరణకు వచ్చినపుడు తాను, కబీర్‌ కళామంచ్‌ వాళ్లు రాసిన పాటలు కోర్టుహాల్‌లో పాడి వినిపించినవి కూడ సామాజికమాధ్యమాల్లో  చూసే ఉంటారు.

ఇంక కబీర్‌ కళామంచ్‌ పూనేలో ఏర్పడిరదే గుజరాత్‌ మారణకాండను మహారాష్ట్ర మొదలు దేశమంతా ఖండిస్తూ, ప్రచారంచేస్తూ,  ప్రతిఘటనను నిర్మించడానికే. అంబేద్కర్‌ పూలే ఆశయాలను శాస్త్రీయ అవగాహనతో పాటలతో,  సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రదర్శిస్తూ వీళ్లు కూడ (ముఖ్యంగా ఇపుడు మూడేళ్లుగా జైల్లో ఉన్న రమేశ్‌, సాగర్‌, జ్యోతి జగతాప్‌ ) గతంలో కూడ మూడుసంవత్సరాలు జైల్లో ఉన్నారు. సుధీర్‌తోపాటు కబీర్‌ కళామంచ్‌ కూడ ఎల్గార్‌పరిషత్‌ నిర్వహించిన 265 సంస్థల్లో ముఖ్యపాత్ర నిర్వహించారు. అయితే భీమాకోరేగాం కేసు ఎన్ని అబద్దాల నిచ్చెనమెట్ల మీద నిర్మాణమైన బ్రాహ్మణీయ కుట్రనో బట్టబయలు చేసింది వీళ్ల అరెస్టు. 2014 జూన్‌6 నుంచి కబీర్‌ కళామంచ్‌కు చెందిన ఈ ముగ్గురు సాంస్కృతిక కార్యకర్తలను ముద్దాయిలుగానే చూపుతున్నారు.  వీళ్లు 2018 నుంచి, 2019 ఎన్నికల సందర్భంలోనూ పూనే, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలిస్తూ, ఈ కేసు ఎత్తివేయాలని డిమాండు చేస్తూ ప్రజల్లో బహిరంగంగానే తిరుగుతున్నారు. 2020 జనవరి ఆఖర్లో కేంద్ర ఎన్‌ఐఎ ఈ కేసు తీసుకున్నాక సెప్టెంబర్‌లో గానీ ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకోలేదు. అయితే అరెస్టు చూపడానికి కాదు, అప్రూవర్లుగా మారమని బలవంతం చేయడానికి, అప్పటికే జైల్లో ఉన్న సుధీర్‌, సురేంద్ర, షోమా, మహేశ్‌, ఆనంద్‌ తేల్‌తుంబ్డే వంటి మహారాష్ట్రకు చెందినవారికి వ్యతిరేకంగా వాజ్మూలం ఇవ్వమని బలవంతం చేసారు. ఒకరోజు గడిచిపోయేవరకు ఈ ఒత్తిడి, బెదరింపును అంతా తమ మొబైల్‌లో రికార్డు చేసిన ఈ కామ్రేడ్స్‌ బయటికి పంపిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఇంక పరువుపోయిన ఆగ్రహంతో వీళ్లను జైలుకు పంపక తప్పలేదు.

స్టాన్‌స్వామితో పాటు ఈ ముగ్గురికీ, మహేశ్‌ రావత్‌కు కూడ కరోనా సోకింది. కాని వీళ్లు యువకులు గనుక బతికి బట్టకట్టారు. రెండు ఎండాకాలాల్లో అన్ని అవసరాలకు ఇచ్చే ఒకటిన్నర బకెట్ల నీళ్లకు నిరసనగా నిరాహారదీక్ష మొదలు కోర్టు పోరాటాలు చాలా చేసారు. స్టాన్‌స్వామిపై, జైలు దుర్భర పరిస్థితులపై సంఫ్‌ుపరివార్‌ ఫాసిస్టు చర్యలపై ఎన్నో పాటలు రాసారు. ఇవ్వాళ సాంస్కృతికరంగంలో  ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్టు చర్యలకు ప్రతిఘటనలో  ముందుపీఠీన  ఉండవలసిన  సాంస్కృతిక కార్యకర్తలు మూడేళ్లుగా జైల్లో మగ్గుతున్నారు. అయితే చదువుతున్నారు, ఖైదీలకు చదువు చెప్తున్నారు. జైలునే ఒక శిబిరంగా చేసుకొని  పోరాడుతున్నారు. బయటి విశాల సమాజానికి ఎప్పటికన్నా ఇప్పుడే ఈ ఒక్కొక్కరి అవసరం ఉన్నది. సుధీర్‌ధావ్లే, కబీర్‌కళామంచ్‌ సభ్యుల విడుదల పోరాటం మిగిలిన అందరికన్నా విరసంపై ఉన్న ముఖ్య బాధ్యత.

రోనా విల్సన్‌ రాజకీయ ఖైదీల విడుదలకమీటీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కావడానికి చాల ముందుకాలం నుంచీ కూడ సైద్ధాంతికరంగంలో ఆయన పరిశోధనాకృషి అంతా బాహుళ్యసమాజం పరాయి (శ్‌ీష్ట్రవతీఱఅస్త్ర) చేసే విద్వేష సంస్కృతి గురించి. ఇందుకు ఆయన ఎంచుకున్న సామాజిక బృందాలు కశ్మీరీలు, ముస్లింలు, ఆదివాసులు, దళితులు, క్రైస్తవులు. అమరుడు ఎస్‌ఆర్‌ గిలానీ (రాజకీయ ఖైదీల విడుదలకమిటీ అధ్యక్షుడు)తో పాటు అఫ్జల్‌గురు విడుదల మొదలుకొని, ప్రత్యేకించి కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ముస్లింలు, ఆదివాసులపై వివక్ష, నిర్బంధం లకు వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్నాడు.

ఇప్పుడు ఈ కేసంతా ఆయనా, సురేంద్ర గాడ్లింగ్‌ల చుట్టే నిర్మాణం చేసిన కుట్ర చాలనట్టు ఇప్పుడు ఐఎపిఎల్‌ కార్యనిర్వాహక బాధ్యులుగా 2020లోనే మరణించిన  జస్టిస్‌ సురేశ్‌తో పాటు, సుధాభరద్వాజ్‌, సురేంద్ర, అరుణ్‌ ఫెరైరాలను కూడ ములుగు తాడ్వాయి కుట్రకేసులో పెట్టారు. సురేంద్రకు సూరజ్‌ఖండ్‌లో మైనింగ్‌ కంపెనీ టిప్పర్‌లు కాలబెట్టిన గడ్చిరోలి కేసులో కూడ ఇప్పటికీ బెయిల్‌ రాలేదు.

ఇప్పుడు జైల్లో ఉన్నవారిలో (హౌజ్‌ అరెస్టులో ఉన్న గౌతమ్‌ నవలాఖా 70 ఏళ్ల  వృద్ధుడైతే) ప్రొఫెసర్‌ షోమాసేన్‌, వర్నన్‌ గొన్‌సాల్వెస్‌లు 65 ఏళ్లు పైబడినవారు. షోమాసేన్‌ ఆర్థరైటిస్‌, గ్లుకోమా లతో బాధపడుతున్నది. ఆమె నాగపూర్‌ యునివర్సిటీలో ప్రొఫెసర్‌గా జెండర్‌ అధ్యయన కేంద్రాన్ని నిర్వహిస్తున్నదని అందరికీ తెలుసుకావచ్చు. కాగా బొంబాయిలో ఉన్నతవిద్య పొందిన ఆమె నాగపూర్‌లో దళితవాడలో పనిచేయడానికే, వాళ్లకు చదువు ` చైతన్యం కలిగించడానికే నాగపూర్‌కు వెళ్లింది. ఆమె అరెస్టుకు ముందు ఎనిమిదేళ్లు చెర్లపెల్లిలో బందీగా ఉన్న తుషార్‌కాంత్‌ భట్టాచార్య సహచరి ఆమె.

ఇపుడు సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచ్‌ మార్చ్‌లో విన్న వర్నన్‌, అరుణ్‌ ల విచారణ పూర్తయి గత నాలుగు నెలలుగా తీర్పుకోసం నిరీక్షణ.

ఈలోగా ఇదే డివిజన్‌బెంచి షోమాసేన్‌, జ్యోతి జగతాప్‌ల బెయిలు పిటిషన్‌లు వినాల్సి ఉన్నది. జులైలో సుప్రీంకోర్టు తిరిగి ప్రారంభమయ్యాక ఈ నలుగురి స్వేచ్ఛÛ సాధ్యమవుతుందా సందేహమే.

గౌతమ్‌ నవలాఖా హౌజ్‌ అరెస్టు ఏడోనెలలో ప్రవేశించింది. మోడీ అమెరికా సందర్శన సందర్భంలో ఇండియాలో కశ్మీర్‌ మొదలు రaార్ఖండ్‌ (రూపకుమార్‌) ఇతర రాష్ట్రాలలో జర్నలిస్టుల భావస్వేచ్ఛపై ఆంక్షలు, నిషేధాలు, నిర్బంధాలకు వ్యతిరేకంగా ప్రపంచస్థాయి ప్రదర్శనల్లో చూపిన ప్రముఖ జర్నలిస్టుల ఫోటోల్లో గౌతమ్‌ ఫోటో కూడ ఎలక్ట్రానిక్‌ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో మీరు చూసే ఉంటారు.

ప్రొఫెసర్‌ హనీబాబు కేరళకు చెందిన ముస్లిం. ఢల్లీి యునివర్సిటీలో సాయిబాబాతో పాటు ఇంగ్లిషు డిపార్టుమెంట్‌లో దళిత, ఆదివాసీ, మైనారిటీ విద్యార్థుల, అధ్యాపకుల రిజర్వేషన్ల కోసం, హక్కుల కోసం పోరాడుతున్నాడని, సాయిబాబా అరెస్టు తర్వాత ఆయన డిఫెన్స్‌కమిటీకి సహకరించాడనే కక్షతో ఆయన పై సాయిబాబా తర్వాత ఢల్లీి కేంద్రంగా మావోయిస్టు కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నాడనే ఆరోపణ. గౌతమ్‌ నవలాఖా అనారోగ్యం, వర్నన్‌ డెంగ్యూలతో పాటు హనీబాబు దృష్టి లోపమయ్యేంత కరోనా వల్ల కళ్లు దెబ్బతిని తన ఖర్చులపై ఖైదీగానే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆపరేషన్‌ జరిగి ఒక కన్ను దృష్టి లోపించి 50 ల ప్రాయంలోనే ఎంత అనారోగ్యానికి గురయ్యారో తెలిసే ఉంటుంది. ప్రపంచంలో ఎన్నదగిన లింగ్విస్టుగా ఆయన చామ్‌స్కీ దృష్టిని కూడ ఆకర్షించి ఇటీవలనే ఒక విదేశీ యునివర్సిటీ హానరరీ డాక్టరేట్‌ పొందాడు. ఇపుడు జైల్లో ఆయన మలయాళీ ప్రజలకు  సులభశైలిలో ఉపా వంటి అప్రజాస్వామిక చట్టాలను  వివరించే రచనలు చేస్తున్నాడు.

మహేశ్‌ రావత్‌ మొదటి ఐదుగురిలోనే కాదు కబీర్‌ కళామంచ్‌ మినహా అందరికన్న యువకుడు. జైల్లో ఖైదీల తలలో నాలుక. ఆదివాసీ క్షేత్రం నుంచి, అధ్యయన అధ్యాపక క్షేత్రంగా జైలును మార్చుకొని క్లాసులు చెప్తూ లైబ్రరీ నిర్వహిస్తున్నాడు.

దండకారణ్యంపై ఆకాశయుద్ధం చేస్తున్న బ్రాహ్మణీయ ఫాసిజాన్ని ప్రతిఘటించే ఆదివాసులకు, ప్రజాస్వామ్య శక్తులకు, విరసం కు ఈ కామ్రేడ్స్‌ విడుదల ఎంతో బలం.

26.06.2023

Leave a Reply