ఈ తరం నవతరం
మా తరమే యువతరం
అర్ధరాత్రి స్వాతంత్ర్యం
చీకటి కోణమే
ఏ వెలుగు జాడ లేని
నిశి రాత్రి నీడలే
అమృతం ఏడ తేను
ఉత్సవం ఎలా జరపను
వందేమాతరం అంటూ
ఎలా పాడను..!?

బక్క చిక్కిన బతుకులు
మెతుకుల కోసం ఆరాటం
అకృత్యాల అర్ధనాదాలు
అన్నార్ధుల జాడలు
లేని రోజు కోసం
స్వేచ్ఛకై తపిస్తున్న చోట
అమృతం ఏడ తెను
ఉత్సవం ఎలా జరపను
వందేమాతరం అంటూ
ఎలా పాడను…!?

ఇప్పుడు దేశ భక్తి
పాదరసంలా పారుతున్నది
పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మర్చి
అణచివేత చుట్టివేతలతో
కుట్రలకు దారి తీస్తుంది
డెబ్భై ఏళ్ళ స్వాతంత్ర్యంలో
దేశమే జైలయి తలపిస్తున్న వేల
అమృతం ఏడ తేను
ఉత్సవం ఎలా జరపను
వందేమాతరం అంటూ
ఎలా పాడను…!?

ఈ మట్టి మాది
ఈ దేశం మాది
హద్దులు లేని ప్రపంచం మాది
సకల శ్రామిక జనం మా నేస్తం
లక్ష్మణ రేఖ గీసి హద్దులు వేస్తే
ఇంక్విలాబ్ జిందాబాద్ యే
మా నినాదమయి దిక్కులు పిక్కటిల్లును
అదే కదా
నిజమైన దేశ భక్తి.
ఈ దేశ ప్రజల భుక్తి
జన విముక్తి..

One thought on “వందే అని ఎలా పాడను..!?

Leave a Reply