మిత్రోం
తేలుతున్న శవాలతో
నదులు పునీతం
శవాల మతం మాత్రం తెలీదు
అచ్చాదన లేని మునకలతో
పావనమైన నదులు
ఈ మునకల మతం తెల్సు భాయియోం
నూలుపోగు లేకుండా
హరహర అంటుంటే
బజార్లు సిగ్గుతో తల దించుకున్నాయ్
బహనోం ముఖం తిప్పుకున్నారు
అజ్ఞానులు వూరేగుతుంటే
రక్షక భటుల కాపలా
సరిహద్దులో సైనికుడు విస్తు పోయాడు
సస్తున్న మనుషుల లెక్కలు తేలవని
మోగించిన గంటలు గరిటలు పళ్ళాలు
గూళ్ళల్లోంచి కిందకు దిగట్లే
ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసినందుకు
గాలిలో పెట్టిన కొవ్వొత్తులు
స్మరణ జులుస్ తీస్తున్నాయ్
నిరక్షర కుక్షులు
గద్దె పై కూకుంటే
జరిగే తంతు కళ్ళ ముందు కదలాడుతుంది
ఇంకా యజ్ఞ యాగాదులు
వైరస్ సంహారి అంటూ భ్రమలు
కల్పిస్తున్న నపుంసక రాజ్యం
రాజ్యానికి శస్త్ర చికిత్స అత్యవసరం
అవసరమైన ఆయుధాల ఎంపిక దేశవాసులదే
సస్తున్న మనుషుల లెక్కలు తేలవని
మోగించిన గంటలు గరిటలు పళ్ళాలు
గూళ్ళల్లోంచి కిందకు దిగట్లే…
చాలా బాగుంది సర్ మీ కవిత