చిన్నబోయినా కనుల
కన్నీటిని తుడిసిన వేళ
నిండు పున్నమి నదిపై
పరుసుకున్న వేళ
ఎర్రని మేఘంపై
ఎగిరే పక్షిని నేనై
రాగం పాడే వేళ
రంగస్థలములో నేను
ప్రేమ రంగులద్దిన వేళ
రానే వచ్చింది వసంతం
ప్రేమను పేర్చింది వసంతం
రానే వచ్చింది వసంతం
స్వేచ్ఛను తెచ్చింది వసంతం

Related Articles
కొన్ని ప్రశ్నలు
ఇనుపగోళాల్లోకి ఇముడుతున్న మానవ సమూహాలు. నీళ్ల పొదుగుల్లో దాహం తీరక ఉక్కిరిబిక్కిరవుతున్న దిక్కులేని కాలం. నిరంతరంగా సాగుతున్న పరిణామంలోకి ఇముడుతున్న దృశ్యాలు. విరిగిపోతున్న అనుభవాల సమూహం. ఇక్కడ మనిషిని తూర్పారబడుతున్నదెవరు? ఈ మనిషి సారంలోంచి
గెంటి వేయబడ్డ వారి కోసం పాట!
నిజం వాళ్ళు అబద్ధం చెప్పారు..ఈ వీధులేమీ బంగారంతో చేయబడలేదని అరిచి అరిచీ నా గొంతు బొంగురుపోయింది.. చివరకు నాకు కఠోరమైన జీవితమే దక్కింది. వాళ్లన్నట్లు ఈ వీధులు బంగారంతో చేయబడ్డాయా ..లేదు పచ్చిఅబద్ధం ఇది
వలస కావిడి
నెత్తిన నీళ్ళకుండ భుజాన సూర్యుడు ఆకలిముల్లు గోడలపై ఎగాదిగా ఎగబాకిన పాదాలు లాగేసిన కంచంలో ఆరబోసే తెల్లారికై చుక్కల పరదాతో రాత్రంతా కొట్లాడిన పాదాలు ఇంటి కుదుర్లు జల్లిస్తూ కార్పొరేట్ కాలేజీ వంటపోయ్యిలో కట్టెలవుతున్నాయి