దిగులు పడకు నేస్తం
వర్గ పోరాటాల చరిత్ర మనది.
రేపటి సూర్యోదయం కోసం త్యాగం అనివార్యమైనది.
తూర్పు పవనానాలు
వికసిస్తున్నాయి.
అక్రమ చట్టాలతో
మతాల మరణహోమం జరుగుతున్నది.
బూటకపు ప్రజాస్వామ్య వ్యవస్థల
కుళ్లును కడుగుదం.
రండి నేస్తం…
త్యాగం బాటలో చిందిన రక్తంను విత్తనాలుగా చల్లుదాం.
నేల రాలిన చోట
పువ్వులు వికసిస్తున్నయ్.
కష్టాలు కన్నీళ్లు లేని
సమాజం కోసం కవాత్ చేద్దం..
రేపటి వసంతం కోసం
కదలి రండి .
మరో వసంత మేఘమై కురస్తాం…..

Leave a Reply