నెత్తు రోడ్డుతున్న నేలపై

విత్తనం పుట్టక మానదు.

పదునెక్కిన నేలపైన

వసంతమై చిగురిస్తుంది 

ఒకట రెండ ఎన్నో

నింగి నేల నిండ నిండు త్యాగం.

పుట్టుక కోసం

పురటి నొప్పుల దారి

పురుడు పోసుకుంటున్నది

కాలం కౌగిలిలో

గింజకుంటున్న హృదయాలు

చరిత్ర దారిలో చెదరి పోవు

ఆకాశం హద్దు లేకుండ

తూర్పు కిరణాలు   ప్రసరిస్తయ్

ఎర్రపూలవనంలో

పిడికిళ్ళు బిగుసుకుంటయ్

త్యాగాల దారిలో…

3 thoughts on “విత్తనం పుట్టక మానదు

 1. మా సత్యం
  బాలసాని రాజయ్య గారు శ్రామిక వర్గ చైతన్యాన్ని పెంపొందించుకుంటూ , తను నమ్మిన విప్లవ ఆచరణతో పాలక వర్గానికి వ్యతిరేకంగా
  రాసిన కవిత.
  ” విత్తనం పుట్టక మానదు”. శీర్షికలో లోతైన తాత్విక అర్థం ఇమిడి ఉంది.
  అందమైన భావ చిత్రణతో ప్రకృతి వర్ణనలతో ప్రతీకాత్మకంగా జరుగుతున్న రాజ్యహింసను
  ప్రతీక ద్వారా సూచిస్తుంది.
  ” ఎర్ర పూల వనంలో
  పిడికిళ్లు బిగుసుకుంటాయి”
  కవి అంటే దోపిడీపై పోరాటం సాగించేవాడు అన్న అర్థాన్ని తెలియజేస్తూ, విప్లవ చైతన్యాన్ని పోరాటాన్ని అంతర్లీనంగా తెలియజేస్తుంది.
  మీ నుంచి ఇంకా పాటలు, కవితలు రావాలని కోరుచున్నాను.
  బాలసాని గారికి
  ఉద్యమాభి వందనాలు

 2. ✊✊
  Maa Satyam
  వసంత మేఘం నిర్వాహకులు ఎంతో నిబద్ధతతో వాళ్లకున్న సమయానికి అతీతంగా వాళ్లు తమ కుటుంబానికి కొంత సమయాన్ని ఇస్తూ అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా, అంతర్జాతీయ విప్లవోద్యమలను పాఠకులకు తెలియజేస్తూ,నిరంతరం శ్రమిస్తూ తమదైన శైలిలో పనిని పూర్తి చేస్తూ సకాలంలో అందిస్తున్న నిర్వాహకులకు ఉద్యమాభి వందనాలు.

 3. @విత్తనం ఒక నిశ్శబ్దం@

  విత్తనం పుట్టుకతో మౌన ఋషి
  మట్టిలో ఊపిరి పోసుకుంటూ నెలల పురిటి నొప్పులతో ఒంటరిగా చిగురుస్తుంది
  యుద్ధాలు జరిగిన
  రక్తాన్ని పీల్చుకున్న
  మౌనంగానే చిగురుస్తుంది…
  ఒకచోట సువాసన పువ్వుల్ని
  మరొకచోట నీడనిచ్చే చెట్టు
  మరొకచోట పచ్చని
  ఆకులతో అందాన్నిస్తుంది

  ఎలగొండ రవి
  రాజన్న సిరిసిల్ల జిల్లా

Leave a Reply