ఫాసిస్టు కత్తిపై
నా భావాలను, కలాన్ని నీ ఫాసిస్టు కత్తితో నరికినంత మాత్రాన నేను అంతమై పోను అంతకన్నా అదృశ్యమై పోను దోపిడీ వ్యవస్థలో బుసలు కొడుతున్న నీ ఫాసిస్టు భావజాలాన్ని కూకటి వేళ్ళతో సహా అడ్రస్ లేకుండా పెకిలించడానికి నా సైన్యం కలంధారీ, ఆయుధధారీ పదునెక్కుతోంది చిందిస్తున్న నా నెత్తురుతో తడిసిన నెల పొరల్లోంచి పోరు విత్తనాలు మొలకెత్తి నలుమూలల విస్తరించి నీ అంతాన్ని చూస్తాయి.
బిగించిన పిదికిలి మా ఆయుధం
శతృవు తూటాలకు దడిస్తే ఒక్క తూటా శబ్దమే నిన్ను అవహించి నీ ప్రాణాన్ని వెంటాడుతుంది కామ్రేడ్ నీ లక్ష్యసిద్ధికై పిడికిళ్ళు బిగించి యుద్ధానికి సిద్ధమైతే వేల తూటాలనైనా జడిపించే నీ లక్ష్యం నిను నడిపిస్తుంది.