ఒకేసీటులో
పక్కపక్కనే కూర్చుంటాం
వందలకొద్ది మైళ్ళు
కలిసే ప్రయాణిస్తాం
హలొఅంటే హలొ
మీరెక్కడిదాకా
పలాన వూరు
అంతే
మాట్లాడటం ముగుస్తుంది
నాచేతిలో సెల్ ఫోన్
పక్కనవ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్
ఇద్దరితలలు ఓరిగిపోతాయి ఇక్కడ
దూరంలో ఉన్న వ్యక్తితో సంభాషణ
అక్కడ
ఎక్కడోవున్న వ్యక్తితో సంభాషణ
ఇక్కడ
వీడియోగేమ్స్
అక్కడ
ఫేస్ బుక్
ఇక్కడ
ట్విట్టర్
అక్కడ
వాట్సప్ యూట్యూబ్ గూగుల్ సెర్చింగ్ లు
నచ్చిన వాటిని వెదుక్కుని
వాటిల్లో లీనమవుతాం
గ్రామాలను దాటుతాం
పట్టణాలను దాటుటాం
తలపక్కకుతిప్పి
కిటికిలోనుండి బయటకు చూసినప్పుడు
అనేక దృశ్యాలు
తెరలు తెరలుగా ఎదురవుతాయి
వర్తమానంలోకి వచ్చి
ఎవరిని చూసినా
రంగులు పూసుకున్న మొఖాలే
చిరునవ్వుకి
చిరునామలేని ప్రతిభింభాలు
కాలానికి కళ్లెం లేదు
భద్రతకు భరోసాలేదు
అంతా
పల్లెరుకాయల పరాకు
దుఃఖాలు ఎదురుపడతాయి
సోకాలు ఎదురుపడతాయి
అన్నింటిని
చూస్తూనే దాటిపోతుంటాం
స్ఫురణలోకి వచ్చినప్పుడు
ఎదురుపడిన దృశ్యాలు
నిమిషమో
అరనిమిషమో
బాధను కలిగిస్తాయి
గమ్యం చేరువయ్యింది
ఎవరిదిశగావారు వెళ్లిపోతున్నదారిలో
నీడలు కనుమరుగయ్యాయి
అంతా గాఢాంధకారం
నిశరాత్రిలో
నిశ్శబ్దమేతప్పా
తీతువుపిట్ట అరుపులులేవు
అందరు
అందరిలోవున్నా
ప్రతిఒక్కరిని
ఒంటరితనం వెంటాడుతున్న క్షణాన
వెన్నెలపంటకోసం నేను