యాభై సంవత్సరాల నుండి విరసం వైభవంగా వెలుగుతోంది. ఐతే ఆ ప్రయాణం సాఫీగా లేదు.చాల కష్టాలొచ్చాయి.నిర్బంధాలు పెరిగాయి. కాని విరసం స్థిరంగా నిలిచింది. ఈ నిషేధం మొదటిదీ చివరిదీ కాదు.
అసలు సృజనాత్మకతని ఎవరైనా నిషేధించగలరా? అసలు నిషేధించాల్సిన అవసరం ఉందా..?
చరిత్రలోకి పొతే సాహిత్యం మీద నిషేధం రకరకాల రూపాల్లో అమలుపరిచారు. సెక్స్ గురించి, రాజ్యం గురించి వ్యతిరేకంగా గొంతు విప్పితే నిర్బంధం అమలు చేసారు. చార్వాక సాహిత్యాన్ని నాశనం చేసారు. దీనిలో బ్రాహ్మణిజం ముఖ్య పాత్ర వహించింది.
దేశంలో ఫాసిజం ప్రజల గొంతుల మీద ఉక్కుపాదం మోపుతున్నది. అన్ని ప్రజాస్వామిక సంస్థలని నాశనం చేస్తున్నది. ఇది తప్పుడు ఆలోచన.
సృజనాత్మకత అంటే సమాజాన్ని ముందుకు తీసుకుపోయే ఒక కొత్త ఆలోచన.
రష్యా లో అల్ట్రా లెఫ్ట్ కల్చర్ వొచ్చింది. దాన్ని బూర్జువా వ్యవస్థ తెచ్చింది. ఇది కమ్యూనిస్టు విధానానికి వ్యతిరేకం. ఐనా వాళ్ళకి అనుమతినిచ్చారు. అంటే అసమ్మతికి కూడా చోటు కలిపించారు.
చైనా లో మొత్తం పాత విధానాలని తీసేయాల్సి వచ్చినప్పడు, దాని కంటే ప్రజల్లో కమ్యూనిజం పట్ల అవగాహన పెంచడం చాలా ముఖ్యమని సూచించారు. ఆ విధంగా క్రమంగా ప్రజలు పాత విధానాలని వ్యతిరేకించడం మొదలు పెట్టారు.
ఎప్పుడూ ప్రజా సంక్షేమాన్ని నాశనం చేసే సిద్ధాంతాలని వ్యతిరేకించాలి.
ప్రస్తుతం సృజనాత్మకతను నిషేధించడం రాజ్యానికి తప్పనిసరి అయింది. అణచివేత కోసం సాహిత్యకారుల సృజనాత్మకతను నిషేధించారు. వాక్ స్వాతంత్య్రాన్ని నిషేధించారు. హక్కులని నిషేధిచారు.పాఠ్యాoశాలని నిషేధించారు.
బాధనీ, దుఃఖాన్నీ తుపాకితో నిషేధించడం ఒక విషాదం.
అరుణ్ కక్కర్ అనే రచయిత్రి,”శవ గంగ ప్రవాహం” అనే కవిత రాసినందుకు ఆమె మీద చాల విమర్శలే ఒచ్చాయి. రాజ్య నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ కవిత్వం రాసినందుకు వివి జైలు పాలు అయ్యాడు.
విరసాన్ని నిషేధిస్తే అది అనేక రూపాల్లో అనేక భాషల్లో ముందుకు ఒస్తుంది.
“చీకటి రోజులలో గానాలు ఉండవా…ఉంటాయి.
చీకటి గురించి గానాలు ఉంటాయి.”
సృజనాత్మకను కాపాడుకోవాలి
(జూలై 4, 2021న విరసం నిర్వహించిన ఆన్‌లైన్ సభలో ప్రసంగానికి తెలుగు అనువాదం ఉదయమిత్ర)