న్యూహ్‌లో 2023 జులై 3, సోమవారం నాడు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన బ్రుజ్ మండల్ జలాభిషేక యాత్ర సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలు, ఆ తరువాత హర్యానా, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో, జన్ హస్తాక్షేప్ ఆరుగురు సభ్యుల నిజ నిర్థారణ బృందాన్ని పంపించి పరిస్థితిని అధ్యయనం చేయాలని నిర్ణయించింది.

జన్ హస్తాక్షేప్ బృందంలో సీనియర్ జర్నలిస్ట్ సయీద్ నక్వి, జెఎన్‌యు ప్రొఫెసర్, జన్ హస్తాక్షేప్ సమన్వయకర్త డాక్టర్ వికాస్ వాజ్‌పెయి, జర్నలిస్ట్, జన్ హస్తాక్షేప్ సమన్వయకర్త అనిల్ దుబే, జర్నలిస్ట్ ఆస్థా, సతీష్, ప్రదీప్‌లు ఉన్నారు. దర్యాప్తు బృందం జూలై 3 గురువారంనాడు హింసాత్మక ప్రాంతాలైన పల్వాల్, సోహ్నాతో సహా మరికొన్ని ప్రాంతాలకు వెళ్లింది. కర్ఫ్యూ కారణంగా దర్యాప్తు బృందం న్యూహ్‌కు వెళ్ళలేకపోయింది.

దర్యాప్తు పల్వల్ లో గ్రామ ప్రధాని తారాచంద్, సంయుక్త్ కిసాన్ మోర్చా కార్యకర్త మాస్టర్ మహేంద్ర సింగ్ చౌహాన్, అఖిల భారత కిసాన్ మహాసభ పల్వల్ అధ్యక్షుడు, గ్రామ ప్రధాని చౌదరి ధర్మచంద్, న్యాయవాది షేర్ మొహమ్మద్, సంయుక్త్ కిసాన్ మోర్చా కమిటీ సభ్యుడు జఫర్ యదువంశిలను బృందం కలిసింది. 3! జూలై తరువాత జరుగుతున్న దాడులు, దహనాలు జరిగిన మసీదులు, మురికివాడలు, దుకాణాలు వున్న ప్రదేశాలను పరిశీలించింది.

వివిధ పక్షాలతో చర్చలు జరిపిన తరువాత, గత కొన్ని సంవత్సరాలుగా బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ తదితర తీవ్రవాద సంస్థలతో కలిసి, సంఘ్ – బిజెపి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం, ముస్లిం మైనారిటీ ప్రాంతమైన మేవాత్‌లో ముస్లిం వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించడంలో నిమగ్నమై ఉందనే నిర్ధారణకు జన్ హస్తాక్షేప్ బృందం వచ్చింది. న్యూహ్‌, సోహ్నాలలో జూలై 3నాడు  బృజ్ మండల్ జలాభిషేక యాత్ర సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు, హింస జరగవచ్చనే పూర్తి సమాచారం రాష్ట్ర బిజెపి ప్రభుత్వానికి ఉంది. తాజా పరిణామాలను అర్థం చేసుకోవడానికి, గత నాలుగు, ఐదు నెలల పరిణామాలను తెలుసుకోవడం చాలా అవసరం.

2023 ఫిబ్రవరి 6 న రాజస్థాన్‌లోని భివానీ జిల్లాలోని లోహారు గ్రామంలో నివసిస్తున్న నాసిర్ (25 సం.), జునైద్ ( 35 సం.) లను గోవుల అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణమీద అపహరించి, హత్య చేసి, వారి మృతదేహాలను బొలెరో వాహనంలో తగులబెట్టారు. ఈ కేసులో మోను మనేసర్ సహా ఐదుగురిని రాజస్థాన్ పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. మోనును అరెస్టు చేసేందుకు రాజస్థాన్ పోలీసులు మోను గ్రామానికి వచ్చిప్పుడు, హర్యానా పోలీసులు వారిని అడ్డుకోవడమే కాకుండా ఆ రాష్ట్ర పోలీసులపై కేసు పెట్టారు. హిందూత్వ సంస్థలు కూడా మోను మానేసర్‌కు మద్దతుగా పంచాయితీ చేసి, అతన్ని పట్టుకోవడానికి పోలీసులు వెళితే కనక తిరిగి వెళ్లలేరని తీర్మానం చేశాయి. మోను అసలు పేరు మోహిత్, మనేసర్ నివాసి. గత రెండు సంవత్సరాలుగా అతను బజరంగ్ దళ్ కార్యకర్త. కౌ టాస్క్ ప్రొటెక్షన్ ఫోర్స్ (గో రక్షణా బలగం)సభ్యుడు కూడా.

ఇదే కాకుండా, గత నెల, సిరోహి గ్రామంలో హిందుత్వ సంస్థల ముఠా పాల వ్యాపారం చేసుకునే ఒక ముస్లిం కుటుంబానికున్న 80-90 ఆవులను మొత్తంగా  స్వాధీనం చేసుకుంది. దీని వల్ల కూడా ముస్లింలు తీవ్ర ఆగ్రహావేశాలతో వున్నారు.  ఒక సాధారణ కేసులో అరెస్టు చేసిన ఒక  ముస్లిం వ్యక్తిని గత వారం పోలీసు స్టేషన్‌లోనే చంపేసారు. ఈ ఉద్రిక్త వాతావరణంలో మేవాత్‌లో జలాభిషేక యాత్ర ఏర్పాటు చేసారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, బజరంగ్ దళ్‌తో అనుబంధం ఉన్న మోను మనేసర్, ఫింటూ బజరంగీలు స్వయంగా యాత్రలో పాల్గొంటారని, జులై 28-29 తేదీలలో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ వీడియో వైరల్‌గా (తీవ్ర ప్రచారం) మారింది. అంతే కాకుండా, మోను, అతని మద్దతుదారులు సోషల్ మీడియాలో “మేం యాత్రలో పాల్గొంటాం. మాకు అల్లుడిలాగా పూలతో స్వాగతం పలకాలి” అని ప్రకటనలు చేస్తూంటే, మరోవైపు, ముస్లింల వైపు నుండి కూడా కొంతమంది ‘చూద్దాం మీరెలా వస్తారో’ అంటూ ప్రతిస్పందించారు….. ఇలా ఇరు వర్గాలకు చెందిన అవాంఛనీయ అంశాలు సోషల్ మీడియాలో విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా తెలుసు.

ఒక సముదాయాన్ని నిరంతరం రెచ్చగొట్టే ప్రయత్నాల మధ్య, బిజెపి జిల్లా అధ్యక్షుడు గార్గి కక్కర్ నేతృత్వంలోని బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర సోమవారం జరిగింది అని స్థానిక నివాసితులు, ప్రత్యక్ష సాక్షులు బృందానికి చెప్పారు. నల్హడ్ శివ మందిరంలో దాదాపు 1500 మంది ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ పర్యటనకు ముందు, విశ్వ హిందూ పరిషత్  జాతీయ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ద్వేషపూరిత ఉపన్యాసాలిచ్చారు.

యాత్ర నల్హార్ శివాలయం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగార్ గ్రామానికి బయలుదేరాల్సి ఉంది.  “బ్రిజ్ మండల్ జల అభిషేక యాత్రకు పాత చరిత్ర లేదు. ఇది గత 3 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 84 కోషి వంతెన యాత్ర సాంప్రదాయం ఉంది. ఈ యాత్రలో జాట్, మేవ్ సముదాయాలు పెద్ద ఎత్తున ఆహారం, పానీయాల లంగరును ఏర్పాటు చేస్తారు” అని రైతు నాయకుడు, గ్రామ ప్రధాని తారాచంద్ చెప్పారు.

సంఘ్, బిజెపి, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, స్థానిక శివసేన సభ్యులు జల అభిషేక యాత్రను ప్రారంభించారు. గత రెండేళ్లుగా ఈ యాత్రకు ఎటువంటి అడ్డంకులు రాలేదు. కానీ ఈసారి హిందుత్వవాద సంస్థలు వాతావరణాన్ని కలుషితం చేయడం ప్రారంభించాయి.

హిందీ మాట్లాడే ప్రాంతాల్లో 23 యాత్రలు నిర్వహించాలని సంఘ్ పరివార్ ప్రకటించినట్లు గ్రామ ప్రధాన్, రైతు నేత చౌదరి ధర్మచంద్ర తెలిపారు. అందులో న్యూహ్‌ మొదటి యాత్ర. ఒక ప్రశ్నకు సమాధానంగా, రెండు పక్షాలు సన్నాహాలు చేస్తున్నాయని ఆయన చెప్పారు. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్‌లు లాఠీలు, ఇతర ఆయుధాలను ప్రజలకు పంపిణీ చేశాయి. మరోవైపు, ఆవుల అక్రమ రవాణా ఆరోపణలపై హత్యకు గురైన నాసిర్, జునైద్‌ల గ్రామమైన లోహారు నుంచి కూడా 400-500 మంది వచ్చారు.

ఆలయం నుంచి కొద్ది దూరం వెళ్లిన తరువాత రెండు వైపులా అరావళి కొండలు వుంటాయి.  మోను, పింటూ బజరంగీల కోసం పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులు వూరేగింపు ముందుభాగానికి వచ్చి, వాహనాల్లోని వ్యక్తులను వెతకడం ప్రారంభించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో రాళ్లదాడి మొదలైంది. ఈ ఊరేగింపు వెనుక కూడా ముస్లింల గుంపు పెద్ద సంఖ్యలో చేరింది. మెవాత్‌లోని ఈ ప్రాంతంలో  మియో ముస్లింలు అధిక సంఖ్యలో వున్నారు.

ఊరేగింపులో పాల్గొన్న అరాచక వ్యక్తులు  వాహనాలను కాల్చడం ప్రారంభించారు. రెండు వైపుల నుండి కాల్పులు జరిగాయి, ఇందులో ఇద్దరు హోమ్‌గార్డులు, మరో ఇద్దరు మరణించారు. ఊరేగింపుతో పాటు పరిమిత సంఖ్యలో ఉన్న పోలీసులు కూడా పరుగులు తీయడంతో దాదాపు 4 గంటలపాటు గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఈ ఘటన తర్వాత 25 నుంచి 50 మంది విహెచ్‌పి, బజరంగ్ దళ్ వ్యక్తులు ముస్లింల దుకాణాలు, మసీదులపై దాడులు చేయడం ప్రారంభించారు. మసీదు వెలుపల ఉన్న కార్లను కాల్చారు. పీర్ వాలీ మసీదుపై దాడి జరిగింది. నంబర్ లేని 40-50 మోటార్ సైకిళ్లపై 100 మందికి పైగా అబ్బాయిలు రాత్రి పూట దాడి చేశారని న్యాయవాది షేర్ మొహమ్మద్ చెప్పారు. వారు పోలీసులతో ఘర్షణకు దిగారు. 5 – 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే సుమారు 200 మంది వున్న గుంపు పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టి, రాజకీయ ఒత్తిడితో అరెస్టు చేసిన వారిని విడిపించారు. కొద్ది సేపటికే నాజ్ సినిమా ముందు ఉన్న అరేహరియా మసీదును కాల్చివేశారు. సోమవారం జరిగిన ఘటన తర్వాత మంగళవారం, బుధవారం బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్‌లకు చెందిన సుమారు 25 నుంచి 50 మంది దాకా వున్న గుంపు మురికివాడలు, పాత సామాన్ల దుకాణాలు, మసీదులపై దాడులు చేసి నిప్పంటించారు.

ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడానికి ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు హర్యానాలో నిరంతరం గ్రామసభలు నిర్వహిస్తున్నాయని, అయితే ఒకటిన్నర సంవత్సరాల పాటు కొనసాగిన రైతాంగ ఉద్యమం మొత్తం ప్రాంతంలో, ముఖ్యంగా హర్యానాలో హిందూ-ముస్లిం ఐక్యత మూలాలను గ్రామీణ ప్రాంతాల్లో బలపరచిందని యదువంశీ అన్నారు.

ఈ ప్రాంతంలో జాట్‌లు, ముస్లింలు, ప్రధానంగా మేవ్ ముస్లింలు వున్నారు. వారి మధ్య ఎలాంటి అపోహలు లేవు. చాలా కాలంగా కలిసి మెలిసి జీవిస్తున్నవారి  బంధాన్ని రైతాంగ ఉద్యమం మరింతగా బలపరిచింది.

హర్యానాలో కొన్ని విషయాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని నిజ నిర్ధారణ బృందం తన ఒకరోజు పర్యటనలో గమనించింది.

సామాన్య ప్రజానీకంలో పరస్పర సౌభ్రాతృత్వం, ప్రేమాభిమానాలు బలపడుతున్నాయని, 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ, అంతకు ముందు అనేక రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ హిందూ ధృవీకరణ కోసం సంఘ్ పరివార్ అనేక రకాలుగా కుట్రలు పన్నుతున్నట్లు ప్రజలకు అర్థమవుతోందని బృందం గమనించింది.

శతాబ్దాల తరబడి సహజీవనం చేస్తున్న హిందూ ముస్లింల మధ్య పరస్పర సౌభ్రాతృత్వం కోసం ప్రయత్నాలు కూడా ముమ్మరం కావడం సానుకూలాంశం. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌పై జాట్‌లకు చాలా ఆగ్రహం ఉంది. రిజర్వేషన్ ఉద్యమంలో జాట్ యువకుల మరణం, రైతాంగ ఉద్యమం, బిజెపి పార్లమెంటు సభ్యుడు మహిళా రెజ్లర్ క్రీడాకారులతో అనుచితంగా ప్రవర్తించడం వంటి సంఘటనలు వారిని బిజెపి, సంఘ్ పరివార్‌లకు దూరం చేశాయి.

దర్యాప్తు బృందం కనుగొన్న అంశాలు –

* ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దశాబ్దం పాటు ప్రజల ప్రాథమిక అవసరాలు, ఆకాంక్షలను నెరవేర్చలేకపోయాయి. విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి కారణంగా సమాజంలోని అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ-ఆర్ఎస్ఎస్ మ‌ధ్య మతపరమైన విభజన ద్వారా ఓట్లు దండుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి.

* హిందీ మాట్లాడే ప్రాంతాల్లో ముఖ్యంగా హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో మత, కుల విద్వేషాలు ప్రచారంలో ఉన్నాయి. <నోహ్ ఘటన వెనుక చాలా ప్రమాదకరమైన ప్రణాళికలున్నాయని దర్యాప్తు బృందం భావిస్తోంది. యాత్రలో పాల్గొన్న ప్రజలను సరైన భద్రత లేకుండా ముస్లిం ప్రాబల్య ప్రాంతాలకు తీసుకెళ్లడం సంఘ్-బీజేపీ ఖట్టర్ ప్రభుత్వం చేసిన కుట్ర.

 * కుట్ర విఫలమై ఉండవచ్చు కానీ ఇప్పటికీ హిందూ మత సంస్థ నాయకులు గ్రామ గ్రామాన వెళ్లి ముస్లింలకు వ్యతిరేకంగా జాట్‌లు, ఇతర కులాలవారు ఏకమయ్యేలా రెచ్చగొడుతున్నారు.

2013 లో మురాదాబాద్ లో జాట్ ముస్లింల అల్లర్లకు సంబంధించి ఇరు పక్షాల మధ్య ఎలాంటి సంకేతాలు లేవని దర్యాప్తు బృందం సానుకూలంగా గుర్తించింది. రైతు ఉద్యమం వారికి పరస్పర అవసరాలు, సహజీవనం అనే అంశాన్ని నేర్పింది.

* 2073లో మొరాదాబాద్‌లో జరిగిన జాట్-ముస్లిం అల్లర్లకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు ఇరుపక్షాలలో లేవనే సానుకూల కోణాన్ని దర్యాప్తు బృందం గమనించింది. పరస్పర అవసరాలు, సహజీవనం అనే సమాహారంలో వారిని రైతు ఉద్యమం చేర్చింది.

* హర్యానాలోని మియో ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు, జాట్‌ల ఆధిపత్య ప్రాంతాల మధ్య నిరంతరం పంచాయితీలు జరుగుతున్నాయి. గురువారం కోట్ గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన 500 మంది పాల్గొన్నారు.ఇందులో రావత్, జాట్, మేవ్ సముదాయాలకు చెందిన వారు ఉన్నారు. ఈ పంచాయతీలో హాజీ సాహెబ్, జిల్లా పరిషత్ మాజీ చీఫ్, బిలాల్ అహ్మద్ కోట్ సర్పంచ్ తదితరులు హాజరై, తమ మఃయన సహోదరభావం ఎట్టి పరిస్థితుల్లోనూ చెడిపోకూడదని నిర్ణయించారు.

* సంయుక్త్ కిసాన్ మోర్చా సద్భావనా యాత్రను వీలైనంత త్వరగా చేపట్టాలని నిర్ణయించారు.

తెలుగు – పద్మ కొండిపర్తి

Leave a Reply