*తమ నేరాలను తప్పించుకోవడం, అస్పష్టత, విక్షేపం, పక్కదారి పట్టించడం(Deflection), తిరస్కరణ లాంటి  వివిధ వ్యూహాలను దత్తత తీసుకోవడాన్ని ఈ రోజు మనం చూస్తున్నాం*

మనుషులకు   హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంవల్ల  యితరులతో  విభిన్నంగా వుంటారు. అయితే, మానవులంతా  హేతుబద్ధoగా వుండటం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కానీ, మానవులందరూ ప్రయోజనకరమైన పరిణామాలతో తర్కిస్తారని  అనడం అతిశయోక్తి . హేతువుకు  అనేక విధులు ఉంటాయి. (Reasons have many functions.)  ఒక సాధారణ అవగాహనకు రావడానికి,   ఏకాభిప్రాయ నిర్ణయానికి చేరుకోడానికి  హేతువు సహాయపడుతుంది.  ఈ క్రమానికి  ఏది  సంబంధించిందో , ఏది కానిదో గుర్తించడంలో   హేతువు సహాయపడుతుంది.  మన లోతైన ఆలోచనలను వ్యక్తపరచడoలో, వాటికి పొందికను అందించడoలో,  తప్పు నుండి ఒప్పును, మంచి నుండి చెడును, ముఖ్యమైన దాన్నించి,    అత్యవసరమైన దాని నుండి అల్పమైన వాటిని వేరు చేయడoలో హేతువు సహాయపడుతుంది. మనం ఎల్లప్పుడూ హేతుబద్ధంగా ఉందాం.  నిజానికి ఎప్పటికీ మనం అలా ఉండకూడదు. కానీ హేతువు అత్యవసరమయినప్పుడు దానిని : ఉపయోగించ పోవడం  మూర్ఖత్వం లేదా పూర్తిగా వంచన అవుతుంది.

అత్యంత హీనమైన రూపంలో హేతువు – దానికి కారణం:

|మన సమాజంలో  విస్తృతంగా చూస్తున్నదీ,  ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కువుగా కనిపిస్తున్నది హేతువు పతనం కావడం. అంతేకాదు,  ప్రతి  కారణం-హేతువు ఉద్దేశపూర్వకంగా, దుర్మార్గంగా లొంగిపోవడం.  దానికి బదులుగా, ఎగవేత, అస్పష్టత, విక్షేపం , తిరస్కరణ యొక్క వివిధ వ్యూహాలను స్వీకరించడం జరుగుతూ వుంది.అంతేకాదు, పరస్పర సంభాషణలు ఆగిపోయాయి.  చర్చలకు అంతరాయం ఏర్పడింది. వాస్తవాలు తారుమారు చేయబడ్డాయి.  వక్రీకరించబడ్డాయి. మునుపెన్నడూ లేని విధంగా,  లేనంతగా హేతువు కేవలం స్వప్రయోజనపరులకు,  అధికారానికి మాత్రమే ఉపయోగపడుతున్నది. అందువల్ల , హేతుబద్ద ఆలోచనలు  పూర్తిగా కనుమరుగయ్యాయని చెప్పలేం. కానీ, హేతువు, ఖచ్చితంగా దాని అత్యంత హీనమైన రూపానికి దిగజార్చబడింది.

హేతువు అంతగా కళoకమయినపుడు  పదాలు శూన్యమవుతాయి – అర్థం లేని శబ్దాలుగా మిగులుతాయి.. మేధోపరమైన విభేదాలు కోడిపందాల స్థాయికి దిగాజారుతాయి.   నీడతో యుద్ధంగా రూపొందుతాయి.  తీవ్రవాద UKIP నాయకుడు నిగెల్ ఫరేజ్ ను బ్రిటీష్ జర్నలిస్టుల బృందం అతను అబద్ధాలకోరు అని చూపించడానికి అతనివాదనలో రంధ్రాలు తీయడం, స్పష్టమైన అసమానతలను బహిర్గతం చేయడం,  విస్తృతంగా తెలిసిన వాస్తవాలతో అతన్ని దూషించడాన్ని, టర్కిష్ రచయిత  కుమారి ఏసే తెమేల్కురాన్ (Ece Temelkuran) పావురంతో చదరంగం ఆడటం లాంటిదన్నారు. ఆ పావురం చదరంగం బోర్డ్‌పై ముక్కలను చెల్లాచెదురుజేస్తుంది.   దానిపై మలవిసర్జన జేస్తుంది . అప్పుడు, “పావురం విజయ గర్వంతో ఎగిరిపోతుంది. దాన్ని  శుభ్రం చేయడo మనకు వదిలివేస్తుంది”. విఘాతం,  అజ్ఞానo ప్రాథమిక విలువలుగా వున్న వారితో మనం ఎలా కలిసి ఎలా కలిసి ఉండగలం?  టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మద్దతుదారులతో సరైన రాజకీయ చర్చను నిర్వహించడం అసంభవమని టెమెల్కురాన్ వివరించారు. వారితో మాట్లాడటం “మూత లేకుండా మిల్క్ షేక్ తయారు చేయడం లాంటిది” అని ఆమె చెప్పింది. ప్రజలు దానిని ఎదుర్కొనాలను కున్నప్పుడు హేతువు  బొత్తిగా సహాయంచేయలేదు.

అప్పటి సంగతేమిటి? వాటిమాటేమిటి? అనే ప్రశ్నల పరంపర:

 ఒక ముఖ్యమైన ప్రతి ప్రజా సమస్యకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన చర్చను అదేదో బిజెపి లేక కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య తిట్లపురాణoగా మార్చబడడం నేడు టెలివిజన్‌లో ప్రస్తుతం జరుగుతున్న చర్చల అత్యంత సమస్యాత్మకమైన అంశం.  మరీ ముఖ్యంగా, ప్రతి చర్చ  కాంగ్రెస్ గతంలో చేసిన నిజమైన లేదా ఊహాజనిత తప్పులపై దృష్టి మళ్లిoచడానికి  దారితీస్తున్నది, ఇది ప్రస్తుతం చేసిన తప్పులకు బాధ్యత, జవాబుదారీతనం నుండి తప్పించుకొనడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, ఢిల్లీలో ఇటీవల జరిగిన భయంకరమైన హత్యల గురించి చర్చించలేము. ఎందుకంటే “1984 సిక్కులపై జరిగిన

హింసాకాండకు బాధ్యులయినవారు  ఢిల్లీ 2020 అల్లర్లను  చర్చకు తేవడానికి ఎంత ధైర్యం”? అనే వాదన ముందుకు వస్తుంది. అదేవిధంగా, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తీవ్రంగా ఖండించడం ద్వారానే  నేటి  పత్రికా స్వేచ్చపై దాడులను  లేదా ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా మాట్లాడాలని ఒక నిబంధన  పెడుతారు. ఆ విధంగా  సాధారణ పౌరుల బావప్రకటనా స్వేచ్చపై ఉన్న నిర్భంధాన్ని తేలిక  చేయడం  జరిగుతున్నది. అయితే ఒక పార్టీ మనకు కొంత స్వేచ్ఛ ఇవ్వడంలో గల  వైఫల్యాన్ని, మరో పార్టీ అమలుజేసే నిర్భంధo ఎలా, ఎందుకు మాఫీజేస్తుంది? ఇద్దరిపై ప్రజలు ఎందుకు ఫిర్యాదు చేయలేరు?

ఉదాహరణకు, నలభై సంవత్సరాల క్రితం, ఒక వ్యక్తి దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి  శిక్షించబడ్డాడు. ఈ రోజు అతనే దోచుకోబడి ఫిర్యాదు చేయడానికి పోలీసుల దగ్గరకు వెళ్తాడు. కానీ పోలీసులు, “1980లో దొంగతనం చేసిన వ్యక్తి నువ్వే కదా? ఫిర్యాదు చేసే హక్కు నీకు లేదు”.అని చెపితే  అది అసంబద్ధమైనది(absurd). ఒక వ్యక్తి తప్పు చేశాడనే కారణంతో అతనికి ఫిర్యాదు చేసే లేదా నిరసన తెలిపే హక్కుఉండదా?  ఇది ఎలాంటి వాదన? నేరం జరిగిన వెంటనే అయితే  కొన్ని వాదనలకు  ఔచిత్యం, చెల్లుబాటు ఉంటాయి. కానీ కాలక్రమేణా, పరిస్థితులు మారుతున్న కొద్దీ అవి బలాన్ని కోల్పోతాయి. 1940లలో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించడం వల్ల ఏర్పడిన అల్లకల్లోలానికి నాజీ జర్మనీ  బాధ్యత గురించి మాట్లాడటం చెల్లుబాటు అవుతుంది కానీ 21వ శతాబ్దంలో దాని గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ నేరం చాలా కాలంగా అంగీకరించబడింది, శిక్ష విధించబడింది. చాలా ముందుగానే దాని నుండి నైతికంగా  సంబంధం  తెoచుకున్న  వారు కూడా మాటలతో, చర్యలతో క్షమాపణలు చెప్పారు. వారు, స్మారక చిహ్నాలలో తమ నేరాల  జ్ఞాపకాలను కూడా సంస్థాగతీకరించారు. ఇక  జర్మన్‌లను మరింత మందలించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి ఈనాడు స్వేచ్ఛను ధ్వంసం చేస్తున్న వారు ఆ సంఘటనలను చర్చకు తేవడంవల్ల ఇప్పుడు ఉపయోగం ఏమిటి?

ఎమర్జెన్సీ ఒక భయంకరమైన సంఘటన, భారత ప్రజాస్వామ్యానికి శాశ్వత మచ్చ, అది పునరావృతం కాకుండా ఉండేలా మనం నిరంతరం గుర్తుంచుకోవాలి. అయితే ఎమర్జెన్సీ లాంటి చర్యలను విధించడాన్ని నిరసిస్తూ, 1970లలో మొదటిసారిగా కష్టాలు అనుభవించిన పౌరులు , మరల అలాంటి కష్టాలకే గురయ్యే . దుస్థితిని ప్రశ్నిస్తే వారిని 1970 ల మాటేమిటని ఎదురుదాడి జేయడం,నేడు కాంగ్రెస్ కు పార్టీ నిర్భంధం గురించి అడిగే నైతిక హక్కు లేదనడం  హాస్యాస్పదంగా ఉంది. వాక్ స్వాతంత్య్రంపై దాడి, హెబియస్  కార్పస్  (నిర్భంధించిణ వ్యక్తిని 24 గం.లోగా కోర్టు ముందుంచాలనే నిబంధన ) తాత్కాలిక నిలుపుదల(సస్పెన్షన్) లేదా స్వతంత్ర న్యాయవ్యవస్థపై దాడికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు  ప్రస్తుత ఉల్లంఘనల మాదిరిగానే గతంలో జరిగిన  హక్కుల ఉల్లంఘన గురించి  అదే మూసలో(inthe same breath)  మాట్లాడమని ఎవరినైనా బలవంతం చేస్తూ అందరి నోళ్ళు మూసే ప్రయత్నoఒక దుర్మార్గమైన చర్య.

 వర్తమానానికి తిరిగి వద్దాం. కొంతమంది బిజెపి నాయకులు లేవనెత్తుతున్న నినాదాలు  హింసకు స్పష్టమైన ప్రేరేపణ అని మనకు తెలుసు. వారు వీడియోలో పట్టుబడ్డారు. ఎన్నికల కమిషన్‌కు దృష్టికి వెళ్ళడంతో వారిని  ప్రచారం నుండి సస్పెండ్ చేశారు. ఇది తిరుగులేని వాస్తవం., మొదట నినాదం లేవనెత్తిన కొద్దిసేపటికే దేశ రాజధానిలో భయంకరమైన హింస చెలరేగింది. దోషులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం కోర్టుకు వచ్చినప్పుడు, అటువంటి ద్వేషపూరిత ప్రసంగాలన్నింటినీ పరిశీలించాలని లేకపోతే, ప్రస్తుత ఫిర్యాడునూ విచారించాగూడదని  వారి డిఫెన్స్ లాయర్  అభ్యర్థించారు. ఇది తగినంతగా కలవరపెట్టనట్లుగా, మరొక హాస్యాస్పదమైన అంశం చర్చకు వచ్చింది. గతంలో  అభ్యంతకరంగా  కనిపించని కాంగ్రెస్ నాయకుడి ప్రసంగాన్ని మీడియా ముందుకు నెట్టి, అది  చట్టపరoగా ప్రాముఖ్యత  లేదని తెలిసీ వారు దాన్ని  యుద్ధనినాదంగా వాడారు. చట్టపరంగా అది కోర్టులలో నిలబడదని తెలిసీ వారు ఎందుకు చేశారు? ప్రజలను గందరగోళపరచడం మరియు తప్పుదారి పట్టించడం మరియు చర్చను భ్రష్టుపట్టించడమే వారి ఎత్తుగడ  . అప్పటి సంఘటనలమాటేమేమిటి? అనే  ఇది ఒక బలమైన ఆయుధం కాదా?

రాజకీయ చర్యల మూల్యాంకనం:

ఇటీవల నేను ఒక టాక్సీ డ్రైవర్‌తో  అస్సాంలోని పౌరుల జాతీయ రిజిస్టేషన్ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) గురించి మాట్లాడాను. ఆసర్వేకు బాధ్యత వహించే అధికారి యొక్క భవిష్యత్తు  గురించి  నేను ఆందోళన చెందుతున్నానని చెప్పాను.  ఆ అధికారి  వృత్తిపరమైన చిత్తశుద్ధి గతంలో సందేహాస్పదమైనదే.  కానీ ఇప్పుడు అతనిపై ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. అతను  పౌరసత్వాన్ని నిరూపించె పత్రాలు లేని హిందువులను పెద్ద సంఖ్యలో కనుగొన్నాడు, ఇప్పుడు వారిని అక్రమ వలసదారులుగా ప్రకటించారు. నేడు అదే అతని నేరo  ఈ విషయంపై  డ్రైవర్‌, ఎలాంటి తొట్రుపాటు లేకుండా   ఇలా అన్నాడు: “అయితే సార్, అలాంటి వ్యక్తిని పాకిస్తాన్‌లో కాల్చి చంపి ఉండేవాడు”, అంటే,పాకిస్తాన్‌తో పోలిస్తే భారతదేశం సహనంతో ఉందని అతని బావన. అన్నింటికంటే, భారతదేశం తప్పుడు కేసులతో ప్రజలను కేవలం  నిస్సహాయులను  మాత్రమే జేస్తుంది, కానీ, పాకిస్తాన్‌లో, అదే ప్రవర్తనకు మరణశిక్ష విధించబడుతుంది! ఇదీ వాటి(అక్కడి)మాటేమిటి అనే వాదం వున్మాదస్తాయికి చేరడం.! నేడు భారతదేశంలో రాజకీయ చర్యలు రెండు ప్రమాణాల ద్వారా అంచనా వేయబడతాయి. మొదటిది కాంగ్రెస్ నీచమైన పద్ధతులు. రెండవది సరిహద్దురాష్ట్ర  నిజమైన లేక ఊహాత్మక అణచివేత చర్యలు. రాజకీయ వర్గం, దానితో మంత్రముగ్ధులయిన వారందరూ కేవలం రాజ్యాంగ సూత్రాలను, రాజకీయ నైతికతను పక్కదారి పట్టించారు.

ది హిందూమార్చి 04, 2020 1

రాజీవ్ భార్గవ ప్రొఫెసర్, CSDS, ఢిల్లీ

Leave a Reply