రాజ్యాంగాన్ని విమర్శనాత్మకంగా చూడాలి
(భారత రాజ్యాంగానికి ఈ వ్యవస్థను యథాతధంగా పట్టి ఉంచే స్వభావం ఉందని ఎన్ వేణుగోపాల్ అంటున్నారు. రాజ్యాంగంలోని ఉన్న ప్రజానుకూల ఆదర్శాలు అమలు కాగలిగే స్థితిలో మన రాజకీయార్థిక, సాంఘిక వ్యవస్థ లేదని అంటున్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని మొత్తంగా నెత్తికెత్తుకోవడమో, తిరస్కరించడమోగాక విమర్శనాత్మకంగా ఉండాలని ఈ ఇంటర్వ్యూలో అంటున్నారు..వసంత మేఘం టీం) 1. రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అనగానే ఇంత ప్రతిస్పందన ఎందుకు వస్తోంది? రాజ్యాంగాన్ని మార్చాలని కె సి ఆర్ స్పష్టంగానే అన్నప్పటికీ అన్న సందర్భం మాత్రం కేంద్ర రాష్ట్ర సంబంధాలలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న పెత్తందారీ వైఖరిని ఖండించే సందర్భం. రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య