వ్యాసాలు

మ‌న‌  కాలపు మావోయిస్టు జీవన సందేశం

ప‌ద్మ‌కుమారి (అమ‌రుల బంధు మిత్రుల సంఘం త‌ర‌పున అచ్చ వేయ‌ద‌ల్చుకున్న సాయుధ‌ శాంతి స్వ‌ప్నం పుస్త‌కానికి ప్రచురణకర్తగా రాసిన ముందుమాట‌) కా. మున్నా అమరుడయ్యాక   ఆర్‌కే నాకు పదే పదే గుర్తుకొచ్చాడు.  శిరీష దు:ఖాన్ని దగ్గరిగా చూశాను కాబట్టి.. ఇప్పుడు ఆర్‌కే మనసు ఎలా ఉంటుంది? అనే ఆలోచన కలిగింది.  ఉద్యమంలో   పని చేసిన రోజుల్లో ఆయన నాకు తెలుసు. ఇప్పుడు    ఈ విషాదంలో ఎలా ఉండి ఉంటాడో అనుకున్నాను. రాంగుడా ఎన్‌కౌంటర్‌లో మున్నాతోపాటు మరో ముప్పై ఒక్క మంది అమరులయ్యారు. ఇంత మంది దుఃఖాన్ని ఆయన మోయాల్సి వచ్చింది కదా అనిపించింది.                 కుటుంబ వ్యవస్థలో నాది
సంపాదకీయం

ఆర్కె  స్మృతి నేరం కాదు

పాణి కామ్రేడ్‌ ఆర్కె మరణించి కూడా మనకు  ఒక  భరోసాను ఇచ్చాడు. ఈ చీకటి రోజుల్లోనూ ధైర్యాన్ని అందించాడు. తన విస్తారమైన ప్రజా జీవితంలో వలె మరణానంతరం కూడా  మనలో ఆశను రగిల్చాడు.    ఆర్కె జ్ఞాపకాల, రచనల సంపుటి ‘సాయుధ శాంతి స్వప్నం’ను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకోవడం చట్ట వ్యతిరేకమని హైకోర్టు ఈ నెల 11న తీర్పు ఇచ్చింది. పుస్తకాలను ప్రచురణకర్తకు ఇచ్చేయాలని, ప్రింటర్‌ మీద పెట్టిన కేసు చెల్లదని ప్రకటించింది. న్యాయ పీఠాలు అన్యాయ స్థావరాలుగా మారిపోయిన వేళ ఇలాంటి తీర్పు వెలుబడిరది. తెలంగాణ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద  పోలీసులు ఈ కేసును నమోదు
కవిత్వం

కవితా పరాగం

1.  వొక నగ్నదేశభక్తి    చంపింది రైలేనా? రూపాయి రుచి ఎరుగని    చెమట చుక్కల్ని    ఆకలి నుండి ఆకలికి   అనంత యాత్త్రైన ఆకలి చేతుల్ని    ఆర్థికమొసళ్ళ నోటికందించింది     సుభాషితాల సింహాసనం! దేశం గిడ్డంగి    పేరుకుపోయిన ఆకలి నిల్వ!   గుర్తుపట్టని నట గుడ్డి    ఆహారభద్రత నిల్వ !!   దేశాన్ని పోతపోసే          చెమట చేతులు   ఆకలినదై     ముంచుతున్నప్పుడే     68,607కోట్ల నగ్న దేశభక్తి పొర్లి పొంగింది   సోకెవడిదో?   సొమ్మెవడిదో?     చెమట చుక్కలారా!    ఇంత నోరుంది     ఇన్ని అక్షరాలున్నై కాని    మీ
వ్యాసాలు

నా అనుభ‌వాలు

ఒక గ్రామంలో  –పిల్లల దగ్గర నుండి..  మంచికంటి             ఊహ తెలిసినప్పటి నుండి సంఘర్షణ...   బతకడంలో సంఘర్షణ... చుట్టూ ఉన్న మనుషుల మధ్య సంఘర్షణ... అర్థం కాని ఎన్నో రకాల జీవితాలు...  ఉపాధ్యాయ వృత్తి లోకి ప్రవేశించిన తరువాత అక్కడ కూడా  సంఘర్షణ. ఉండాల్సినవి ఉండాల్సినట్టు కాకుండా... చేయాల్సిన వాళ్లు చేయాల్సిన పనులు చేయకుండా ఉండడం ఎంతో బాధ... ఎంతో అసహనం....            మనం ఏమీ చేయలేమా! చెయ్యాలి.... ఏదో చేయాలి.. బాల్యం నుండి  ఉన్న ఆలోచన అదే. గ్రామంలోనూ బడిలోనే  కాదు.. జీవితంలో కూడా ఏదో చెయ్యాలి... ఏదో సాధించాలి.. ఇలా  ఎన్నో అర్థం కాని
వ్యాసాలు

నిరంతర చలనశీలి, 

పాలమూర్‌ అపురూప హృదయం రామ్మోహన్‌సార్‌ విద్య నారాయణస్వామి           1985   జనవరి 12 రాత్రి పది దాటింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌ లో  ఉన్నం మేము నలుగురం. చాలా చలిగా ఉండినదా రాత్రి. పొగమంచు కురుస్తున్నది. ఊపిరి తీసి వదిలితే పొగ వస్తున్నది సిగరెట్‌ తాగినట్టు. మాకది గమ్మత్తుగ ఉండెడిది. ఇగ సిగరెట్‌ యెందుకు ఇట్లే పొగ మబ్బులు చేస్తె చాలు అనుకునెటోల్లము. ఆ సాయంత్రం చాలా సేపు శివారెడ్డి సార్‌ దగ్గర ద్వారకా లో గడిపిన. ‘రాత్రికి  గద్వాల పోతున్నం సార్‌’ అన్న.           ‘విరసం సాహిత్య పాఠశాల జరుగుతున్నదక్కడ మేమంత కలిసి పోతున్నం’ అన్న  ‘తప్పకుండ
వ్యాసాలు

నిండైన ఆలోచనాపరుడు రామ్మోహన్‌సార్‌

పాణి           రామ్మోహన్‌ సార్‌కు ఆరోగ్యం బాగోలేదని, ఆయన కోసం పుస్తకం తీసుకరావాలనుకొని రాఘవాచారిగారు వ్యాసం రాయమన్నారు.  తనతో కలిసి జీవిస్తున్న వారు తన గురించి ఏమనుకుంటున్నదీ, ఈ   ప్రపంచ కల్లోలాలపై  వేర్వేరు సందర్భాల్లో ఆయన చేసిన విశ్లేషణల్లో ఏమున్నదీ ఒక చోటికి చేర్చి రామ్మోహన్‌సారుకు అందించాలని పాలమూరు అధ్యయన వేదిక అనుకున్నది.             మామూలుగా అయితే ఇలాంటి పుస్తకం చదివాక రామ్మోహన్‌సారు తప్పన  ఏదో ఒక సునిశిత వ్యాఖ్య చేసేవారే. కానీ ఇంకా పుస్తకం పని పూర్తి కాక ముందే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దాంతో అప్పటికి సేకరించిన వ్యాసాలను ఒక పుస్తకంగా కూర్చి ఆయన చేతిలో
కాలమ్స్ లోచూపు

కవిత్వమే సూక్ష్మదర్శిని, దూరదర్శిని

-మెట్టు రవీందర్ మనుషులు విడిపోవడం కంటే మించిన విషాదం లేదు మనుషులు కలవడం కంటే మించిన ఆనందమూ లేదు      అరసవిల్లి కృష్ణ రాసిన ‘ఈ వేళప్పుడు’ కవిత్వం కవి రాసినప్పటి క్షణానికి మాత్రమే సంబంధించినదేనా?  కానేకాదు. అలా ఏ కవిత్వమైనా అది రాయబడిన క్షణానికే   సంబంధించినదయితే, అది పుస్తక పుటల మధ్యనే  నలిగిపోయి    నశిస్తుంది. కానీ ‘ఈ వేళప్పుడు’ కవిత్వం ఒక సజీవమైన కవిత్వం. అది జీవజలం వలె పుస్తక పుటల్ని దాటి పాఠకుల హృదయాల్లోకి  అలవోకగా ప్రవహిస్తుంది. అలా ప్రవహించే కవిత్వమే జీవిస్తుంది, జీవింపజేస్తుంది.      ఇందులో కవి చూసిన చూపులో  చాలా విశిష్టత ఉంది.
ఇంటర్వ్యూ

వ్య‌క్తి స్వేచ్ఛలేని చోట లిబ‌ర‌ల్ డెమోక్ర‌సీకి అవ‌కాశ‌మే లేదు

ప్రొ. ప‌ద్మ‌జా షా (ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు రాబోయే రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను తీవ్రంగానే ప్ర‌భావితం చేస్తాయ‌ని ప్రొ. ప‌ద్మ‌జాషా(జ‌ర్న‌లిజం విభాగం, ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం) అంటున్నారు. ఇండియాలో లిబ‌రల్ డెమోక్ర‌సీ పాదుకొన‌డానికి అవ‌కాశం లేని సామాజిక ఆర్థిక ప‌రిస్థితులు ఉన్నాయ‌ని విశ్లేషిస్తున్నారు.  వ్య‌క్తి స్వేచ్ఛ లేని చోట లిబ‌ర‌ల్ డెమోక్ర‌సీ ఎక్క‌డ ఉంటుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఆమె ఇంట‌ర్వ్యూ పాఠ‌కుల కోసం..వ‌సంత‌మేఘం టీం) 1. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఫాసిస్టు తీవ్రతను ఎట్లా అంచనా వేయవచ్చు? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని బట్టి పరిణామాలు ఉంటాయి. మళ్ళీ ఫాసిస్ట్ శక్తులు పెద్ద ఎత్తున గెలిచి వస్తే దేశంలో చాలా
సాహిత్యం

మూసీ నది మాట్లాడితే ….    నా అనుభవాలు 

కవిని ఆలూరి .  నేను గత 22 సంవత్సరాలు గా  లెక్చరర్ గా పనిచేస్తున్నాను . పది సంవత్సరాల క్రితం మా కుటుంబం హైదరాబాద్ లోని శివం రోడ్ లో ఉన్న బాగ్ అంబర్ పేట్ లో ఉండేది . కాలేజీకి వెళ్ళటానికి  బతకమ్మ కుంట దగ్గర ఉన్న బస్ స్టాప్ లో బస్ ఎక్కేదాన్ని . బాగ్ అంబర్ పేట్ నుంచి బతుకమ్మ కుంట మీదుగా నడుచుకుంటూ బస్టాప్ కు వెళ్ళే దాన్ని . కాలేజీ కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బతుకమ్మ కుంట గుడిసెవాసులను చూస్తుండేదాన్ని . ఆడవాళ్ళు ఎక్కువ శాతం చిత్తుకాగితాలు ఏరేవాళ్ళు  ,మొగవాళ్ళు చెత్త బండీని నడపటం లాంటివి చేస్తుండే వాళ్ళు . ఒక గుడిసె ముందు అయిదు