సమీక్షలు

భీమా నది ఘోష 

నేను భీమా నదిని మాట్లాడుతున్నాను! అంటూ 1818 నుండి మొదలైన ప్రస్థానం ఇది. ‘‘చరిత్ర కన్నులోంచి దుఃఖపు చెమ్మనై చిప్పిల్లుతున్నాను మూగబోయిన అలల తీగలపై పురిటి బిడ్డల తొలి ఏడుపునై పెల్లుబుకుతున్నాను..’’ అనే దగ్గరి నుంచి ‘‘అంటరాని కళేబరాన్నై పైకి లేచే దాకా’’, ‘‘రష్యా సేనల పైకి ఉక్రెయిన్లో’’ అంటూ వర్తమానం దాకా! సాగుతుంది.             ‘‘అగాధాల్లో పూడిపోయిన రాచరికాన్ని మళ్ళీ వూరేగిస్తున్న రాచ వీధుల్లోంచి నడచి వస్తున్నా!’’ అని మొదలై ఆనాటి నుంచి ఈనేటి ఏలికల గుట్టు  బయట పెట్టారు. ‘‘పేగు తెంపిన మంత్ర సాని చనుబాలు తాగనివ్వని పసి బాలుడి నోట్లోంచి బొటన వేలినై బయటికి