మానవాకాశంలో వానవిల్లులా సప్త వైవిధ్యాలు
మనం మనుషులతో సహా దేన్నైనా మామూలుగా దంద్వాలలో విలువ కట్టడం చేస్తూ ఉంటాం. మంచి, చెడు, తప్పు, ఒప్పు లాంటి తీర్పులు చెబుతూ ఉంటాం. అలాగే లింగపరంగా మనుషులను ఆడ, మగ అనే ద్వంద్వంలో వర్గీకరించడం కూడా పరిపాటిగా వస్తోంది. కానీ మొదట ఒకే ముద్దగా ఉన్న చిన్న మానవ సమూహం సుదీర్ఘకాల చరిత్ర గతిలో ఎంతెంత విస్తరించి, ఎన్నెన్ని శకలాలుగా విభజితమైపోయిందో ఇదివరకెప్పుడో మనకు తెలిసి వచ్చింది. ఇటీవల కాలంలోనైతే అది మరింత వైవిధ్యపూరితంగానూ, వైరుధ్య పూరితంగానూ మన అనుభవంలోకి వస్తోంది.మరి ఈనాటి సామాజిక సందర్భంలో మనుషులను సామాజికంగా గాని, లింగపరంగా గాని కేవలం ద్వంద్వాలలో విలువ