కొలువుల సంక్షోభం
అమెరికాలో గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఏర్పడిరది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసతం అక్కడికి వెళ్లిన వారిలో వేల మంది మాస్టర్ డిగ్రీని చేతపట్టుకొని రోడ్ల వెంట తిరగాల్సి వస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి ‘కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్( సిబిఐ) జనవరిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం నడుస్తున్న సంవత్సరం (2024) అమెరికా ఆర్థిక రంగంలో ప్రతికూల ఫలితాలను చవి చూస్తుందని వెల్లడిరచింది. ఫలితంగా 2024లో లక్షలాది ఉద్యోగాలకు కోత పడుతుందని తెలిపింది. అమెరికాలో నిరుద్యోగిత రేటు 2023లో 3.9 శాతం ఉండగా 2024లో 4.4 శాతానికి పెరుగుతుందని సిబిఐ వెల్లడిరచింది.