” హత్యకు గురైంది ఎవరు? పిచ్చివాడు అయింది ఎవరు? నిజాలు తెలిసేది ఎప్పటికీ? “
కథలను చివరి వరకూ బ్రతికించేది..జీవద్భాషే అనిపిస్తుంది ఈ కథలను చదివినప్పుడు.అవును!కథా లక్షణాల బరువులను సూత్రీకరణలను, నియమాలను, వస్తువు ,శైలి, శిల్పంఇలాంటివి కాసేపు పక్కన పెడితేనికార్సయిన జీవద్భాష లో మనుషులు సహజంగా మలినం లేకుండా మాట్లాడుకుంటే, రచయిత ప్రమేయమే లేదనేంత సహజత్వం ఉంటేఅవి "మునికాంతనపల్లి" కథలు అవుతాయి.ఇవి కథలు కావు కతలు. ఊహించి రాసినవి కావు, కల్పనలు అసలే కావు. కొంచెం అలా నెల్లూరు జిల్లా దాకా వెళ్లి వస్తే, అక్కడ మనం వినాల్సిన గుండెలు గొంతులు,మనసులు చాలా ఉన్నాయని, మనం తప్పకుండా వినాల్సిన సత్యాలు చాలా కాలం చాలా మరుగునే ఉండిపోయాయని, ఇన్నేళ్లకు ఆ గొంతుల్ని ఆ గుండెల్ని