ఆర్ధికం కాలమ్స్

ఆధిపత్య లక్ష్యంతో బైడెన్‌ విదేశాంగ విధానం

అమెరికా అధ్యక్ష పీఠంపై  ఎవరున్నా దాని సామ్రాజ్యవాద విధానాల్లో మార్పు ఉండదన్న విషయాన్ని డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ తన భౌగోళిక రాజకీయ విధానాల ద్వారా రుజువు చేస్తున్నారు. ట్రంప్‌ విధానాల వల్ల దూరం జరిగిన మిత్రులను ఒకటి చేసే పనిలో బైడెన్‌ నిమగ్నమై ఉన్నారు. కొంత కాలంగా జి-20 దేశాల ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా అమెరికా నాయకత్వంలోని పాత సామ్రాజ్యవాద కూటమి అయిన జి-7 దేశాల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. బైడెన్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాక తిరిగి అమెరికా ప్రపంచ ఆధిపత్యం కోసం పాత మిత్రులందరిని సమన్వయం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు..
ఆర్ధికం

మాంద్యంలోకి ప్రపంచ దేశాలు

ఆర్థిక మందగమన మేఘాలు ప్రపంచాన్ని కమ్మేస్తున్నాయి. ఆ దేశం ఈ దేశం అని లేదు... అగ్రరాజ్యం, చిన్న రాజ్యం అని లేదు. అన్నింటినీ కబళించి వేయడానికి మాంద్యం దూసుకోస్తోంది. ఒకవైపు యుద్ధాలు, యుద్దాలతో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ విబేధాలు మరోవైపు పర్యావరణ మార్పులు, కారణాలేమైతేనేం... ప్రపంచాన్ని క్రమంగా మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. జపాన్‌ ఇటీవలే ఆర్థిక మాంద్యపు ఛాయల్లోకి జారుకుంది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడు నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. బ్రిటన్‌ కూడా సాంకేతికంగా మాంద్యంలోకి జారుకుంది. అయితే ఇది ట్రైలర్‌ మాత్రమేనని ఆర్థికవేత్తలంటున్నారు. పదుల సంఖ్యలో దేశాలు ఆర్థిక ఒడిదొడుకులతో విపరీతంగా
అలనాటి రచన కాలమ్స్

ఒక బానిస ఆత్మకథ

ఇంగ్లీష్ : ఫ్రెడరిక్ డగ్లస్ తెలుగు అనువాదం: ముక్త వరపు పార్థ‌సార‌ధి  మానవ జాతి చరిత్రలో బానిస వ్యవస్థ అనేది ఒక దశ. అలాంటి దశ ఒకటి గత కాలంలో జరిగిందనీ, బానిసలు యెంత నికృష్ట, దయనీయమైన జీవితాల్ని అనుభవించారో కొంచెంగానైనా గ్రంధస్తం కాకపొతే, వాళ్ళ కన్నీళ్లు ఆనాటి శిథిలాల  కిందే ఇంకిపోయి ఉండేవి. “యెంత ప్రతిభా వంతులైన రచయితలైనా అసలు వాస్తవాలను అణుమాత్రంగా చెప్పలేకపోయారు”  అనేవాడట బానిస యోధుడు స్పార్టకస్. అంటే, వాస్తవ పరిస్థితులు ఎంత భయంకరమైనవో మనం ఊహించుకోవచ్చు. తెలుగులో ‘స్పార్టకస్, ఏడుతరాలూ, అంకుల్ టామ్స్ కేబిన్’ లాంటి పుస్తకాలు వున్నాయి. కానీ, ఒక బానిస
ఆర్ధికం కాలమ్స్

వ్యక్తిగత గోప్యతకు చెల్లు చీటీ – నూతన టెలికామ్‌ బిల్లు – 2022

మోడీ పాలనలో పౌరుల వ్యక్తిగత గోప్యత మన దేశంలో ఎండమావిగా మారింది. పెగాసస్‌ వంటి స్పైవేర్‌ను రచయితలపై, ప్రతిపక్షాలపై, సామాజిక మేధావులపై, జర్నలిస్టులపై, న్యాయమూర్తులపై ఉపయోగించింది. ఇప్పటిదాకా రహాస్యంగా సాగిస్తున్న నిఘాకు, డేటా చౌర్యానికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్‌ వ్యూహాలు పన్నుతున్నది. అందులో భాగంగానే కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌  ఇప్పుడున్న ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ 1985, ఇండియన్‌ వైర్‌లెస్‌ టెలిగ్రఫీ యాక్ట్‌ 1933, టెలిగ్రాఫ్‌ వైర్స్‌ (చట్ట విరుద్ధ స్వాధీనం) యాక్ట్‌ 1950 స్థానంలో నూతన టెలికాం ముసాయిదా బిల్లు- 2022ను కేంద్రం సెప్టెంబర్‌లో విడుదల చేసింది. భారత వినియోగదారులు, నియంత్రణ
ఆర్ధికం

అసమానతలు చంపేస్తున్నాయి… ఆక్స్ ఫామ్

 ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్‌ తాజా నివేదిక ‘ఇన్‌ ఇక్వాలిటి కిల్స్‌’ను ఏప్రిల్‌ 17న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం రోజుకు వేలమంది మరణాలకు కారణమైన హింసాత్మక ఆర్థిక విధాన ఫలితంగా అసమానతలు తీవ్రమయ్యాయి. అత్యంత సంపన్నులు-పేదల మధ్య అంతరం బాగా పెరిగింది. పెరుగుతున్న అసమానత వల్ల మహిళలు, మైనారిటీలు, బడుగు, బలహీన వర్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, కొవిడ్‌ విపత్తుకు ప్రతిస్పందనగా అసమానతలు పెరగడానికి దారితీసిందని నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంక్‌, సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ అంచనాలపై, పరిశోధనలపై ఆధారపడి ఆక్స్‌ఫామ్‌ తన నివేదికను రూపొందించింది.  నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు దేశాన్ని
కథావరణం కాలమ్స్

*అభివృద్ధి*ని ప్రశ్నిస్తున్న క‌థ

సీనియర్ కథా రచయిత్రి ముదిగంటి సుజాతా రెడ్డి 2018 లో ప్రచురించిన "నిత్యకల్లోలం" కథాసంపుటి లోని , ఈ కథను చదివితే నిజానికి అభివృద్ధి అంటే ఏమిటి ? అది ఎవరి కోసం? అభివృద్ధి ఫలితాలు ఏమిటి? అవి ఎవరి కోసం ?నిత్యం సమాజంలో జరుగుతున్న సంఘటనలు వార్తా కథనాలై, ప్రత్యక్ష ప్రసారాలై, మనసులో ఎలాంటి ఆలోచనలు కలిగిస్తున్నాయి ? మనిషి వాటికి ఎలా స్పందిస్తున్నాడు  అనే ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి.నిద్రపుచ్చటం కన్నా ప్రశ్నించటం మంచిది అనుకుంటే, ప్రశ్నించే గుణం ,తత్వం ఈ రచయిత్రి కి ఈ రచయిత్రి సృష్టించిన అనేక పాత్రలకు పుష్కలంగా ఉన్నాయి.*అన్నీ మరిచిపోయి మనిషి
కథ..కథయ్యిందా!

రాబందు – గాలివాన

ఇది, 'ఒక పక్షి కత'. దీన్ని పి.వరలక్ష్మి రాసింది.అరుణతారలో సెప్టెంబర్ 2009లో అచ్చయ్యింది. ఈకలు లేని తెల్లని బట్టతల.బలమైన బూడిదరంగు రెక్కలు , కుడిచివర నుండి ఎడమచివర దాకా ఏడడుగుల విశాలమైనవి.పొడువాటి మొనదేలిన , గుహద్వారంలా తెరుచుకొనే ముక్కు.'ఔచ్..'మని అరచిందంటే దడుసుకొని ఆమడదూరం ఎగిరపోయే బక్కప్రాణులు. ఇదీ యీ కథలోని రాబందు బీభత్స గంభీర సోందర్యం.ఎప్పటికైనా తన గుంపు  నాయకుడిగా యెదగాలనుకుంది.ఎదిగింది. అది తన వొంపుదిరిగిన బలమైన ముక్కుతో , చచ్చినప్రాణుల కఠినమైన శరీరభాగాలను చీల్చేది.దాన్ని చూసి సాటి పక్షులు నోరెళ్ళబెట్టేవి. కాలక్రమంలో చచ్చినవాటినీ, బలహీనమైన వాటినీ వేటాడితే యేం గొప్పా? అనుకొని మన రాబందు, లేల్లనీ, గొర్లనీ
కథనం

“రహ”

మణిపూర్, పర్వతాలు వున్న నదుల ఒడిలో మనోహరమైన రాష్ట్రం. భిన్న జాతులు, సంస్కృతుల సమ్మేళనం. కానీ అక్కడి ఆహ్లాదకరమైన ప్రకృతి వైభవం కన్నీటి ప్రవాహానికి దారి తీసింది. వివిధ తెగల మధ్య అవగాహన లోపం, రాజకీయ లబ్ధి కోసం ఆడే ఆటలు, సామాజిక అంతరాలు సమాజాన్ని చీల్చాయి. సూర్యుడు ఉదయించే ముందు గ్రామాల్లో మంటలు చెలరేగాయి. ఆ మరుసటి రోజు మహిళలు, పిల్లలు అరిచిన స్వరం గాలి ద్వారా అడవుల్ని దాటింది. నది తీరాన ఉన్న చిన్న గ్రామంలో సుందరి అనే యువతి తన ఇద్దరు చిన్న పిల్లలతో నిద్రపోతోంది. ఆమెకు తెలియదు, రాత్రి వాళ్ల గ్రామాన్ని ఆగంతుకులు
లోచూపు కాలమ్స్

వర్ణం నుండి కులం దాకా ఒక సృజనాత్మక మార్క్సిస్టు విశ్లేషణ

భారత సమాజాన్ని విదేశీ ఆలోచనాపరులే కాకుండా ఎంతోమంది స్వదేశీ ఆలోచనాపరులు కూడా ఒక చలనరహిత సమాజంగా నేటికీ చూస్తూనే ఉన్నారు. గత కాలం నుండి ఈనాటి వరకు భారత సమాజంలో వర్ణం, కులం ఎటువంటి మార్పు లేకుండా అస్తిత్వంలో ఉన్నాయని వారంటారు. కాని భారత సమాజపు అసలు వాస్తవికత సంక్లిష్టమైనదని, అది కులవ్యవస్థ రూపంలో వ్యక్తమవుతుందని గుర్తిస్తారు. ఆ సంక్లిష్ట వాస్తవికతను 'చాతుర్వర్ణ' నమూనా వివరించజా లదని తెలిసినప్పటికీ, సైద్ధాంతికంగా దానిని ఎంత మాత్రమూ తిరస్కరించరు.                                  మరి కొంతమంది ఆలోచనాపరులు ఆసియాతరహా ఉత్పత్తి విధానం ఆధారంగా భారతీయ సమాజపు చలనరాహిత్యాన్ని గురించి తమ వాదనలు చేస్తారు. అయితే వర్ణం,
సమకాలీనం

మావోయిస్టులపై యుద్ధం నేపథ్యంలో చంద్రార్కర్ హత్య

2025 మొదటి వారంలో బస్తర్‌లో 16 మంది మరణించారు. వారిలో ఒకరు యువకుడు, ధైర్యవంతుడైన జర్నలిస్టు, ముఖేష్ చంద్రార్కర్. బీజాపుర్ జిల్లాలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలకు సంబంధించి ఆయన  బయటకు తీసిన వార్తలు  ప్రభుత్వ దర్యాప్తుకు దారితీసిన ఐదు నెలల తర్వాత, ఆయన మృతదేహం రోడ్డు కాంట్రాక్టర్ కు చెందిన స్థలంలోని  సెప్టిక్ ట్యాంక్‌లో  దొరికింది. అవినీతిని బహిర్గతం చేసినందుకు జరిగిన చంద్రార్కర్ హత్య, సహజంగానే దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. అయితే ఈ ప్రాంతం మావోయిస్టుల  పోరాటంతో ఎంత సన్నిహితంగా ముడిపడి ఉందో కొద్ది మందికే తెలుసు. చంద్రాకర్ మరణించిన కొన్ని రోజుల తర్వాత, 120