ఉపాధి డమాల్
కరోనా సెకెండ్ వేవ్ సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రతి మనిషి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న దయనీయ స్థితి. ఒకవైపు జనాలు పిట్టల్లా రాలుతుండడంతో చావు భయం వణికిస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియని భయానక వాతావరణంలో భారతీయ సమాజ జీవనం సాగిస్తోంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్లా భయాందోళన రాజ్యమేలుతోంది. కరోనాను ఎదుర్కోవడంలో విఫల ప్రభుత్వంగా ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కార్‌కు కూడా ఇప్పుడు ఊపిరాడడం లేదు. అన్ని వైపుల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలతో మోడీ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ స్థితిలో అంతర్జాతీయ పత్రికలు మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని