ఉద్యమగీతం
రజ్మియా అంటే ఉద్యమగీతం. తెలంగాణ ముస్లింకవులు తెలుగులో,ఉర్దులో రాసిన కవితల సంకలనం ఈ పుస్తకం. దీనికి సంపాదకుడు స్కైబాబ(ఎస్.కె.యూసుఫ్ బాబ). ’నసల్’కితాబ్ ఘర్,తెలంగాణ ముస్లిం రచయితల వేదికలు ఈ పుస్తకాన్ని ప్రచురించాయి. అక్బర్,ఫవాద్ తంకానత్ లు తెలుగు,ఉర్దులలో ముఖచిత్రాలు గీశారు. తెలుగులో 36 మంది(75 పేజీలు), ఉర్దులో 31మంది(68పేజీలు) కవుల కవితలతో కూడిన పుస్తకామిడి.డిసెంబర్ 2012 లో పుస్తక ప్రచురణ జరిగింది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆ నేపథ్యంలో రాసినవే ఇందులోని కవితలన్నీ. ఈ పుస్తకంలోని కవితలలో విభిన్న ఇతివృత్తాలను కవులు ఎంపిక చేసుకున్నారు. ప్రాథమికంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చుట్టూ తిరిగినా,కవితల్లో