సాహిత్య విమర్శకు కొత్త పునాదులు
విరసం మిత్రుడు పాణి తో చేపట్టిన సంభాషణను 'కొలిమి' "ఫాసిజం-విప్లవోద్యమం- సాహిత్య విమర్శ" అనే పుస్తకంగా జనవరి 2024 లో ప్రచురించింది. పుస్తకం శీర్షికలో సాహిత్య విమర్శ అనే పేరుంది గానీ ఇందులో ఎటువంటి సాహిత్య వాచక ప్రస్తావనలు లేవు. దేని గురించి అయినా రొటీన్ గా ఆలోచించే సంప్రదాయ సాహిత్యకారులు, సాహిత్య విమర్శకులు ఎవరైనా దీనిని చదివితే చాలా నిరాశ పడిపోతారు. ఇది సాహిత్య విమర్శ కానే కాదని, ఫక్తు 'రాజకీయ విమర్శ' అని పెదవి విరవొచ్చు. ఇంకా కొందరైతే 'మావోయిస్టు విప్లవ విమర్శ' అని కూడా కొట్టి పారేయవచ్చు. కానీ నిరంతరం మారుతున్న సమాజాన్ని అర్థం