కాలమ్స్ లోచూపు

త‌త్వ‌శాస్త్ర ప్ర‌థ‌మ వాచ‌కం

తత్వశాస్త్రం అంటే సామాన్యులకు అర్థంకాని  నిగూఢమైన విషయమని చాలామంది అనుకుంటారు. అందుకు భావవాద తత్వవేత్తలు, ఆధ్యాత్మికవాదులు వాస్తవికతను మరుగుపరిచి , తత్వశాస్త్రం పట్ల మార్మికతతో వ్యవహరించడమే ప్రధాన కారణం. ఇహలోకంలోని  సామాజిక జీవితంతో సంబంధం లేని, మానవ అనుభవంలోకి రాని 'పరలోకపు' విషయాలతో గందరగోళపరచడం వల్ల సామాన్యజనం తత్వశాస్త్రాన్ని నిగూఢమనుకునేలా చేశారు. పైగా ఈ ప్రకృతిని, ప్రపంచాన్ని దైవ సృష్టి అనడంతో ప్రజల్ని నిమిత్తమాత్రుల్ని చేశారు. అందుకే విప్లవ రచయిత చెంచయ్య గారు ప్రకృతిని, ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు అనే ప్రశ్నే సరైంది కాదని ఈ పుస్తకంలో అంటారు. ఎందుకంటే- ఎవరు సృష్టించారన్న ప్రశ్నలోనే అది 'సృష్టించబడిందన్నది వాస్తవం'
కాలమ్స్ లోచూపు

తెహ్జీబ్ జిందాబాద్ !

అసమ సమాజంలో జీవితం బరువు మోసే వాళ్ళే దేన్నైనా అర్థం చేసుకోగలరు. కొన్ని కొన్ని సార్లు అపార్ధం చేసుకోనూవచ్చు. అలా అపార్థం చేసుకోవడం కూడా ఒక రకంగా అర్థం చేసుకునే క్రమమే.కనుక అపార్థం చేసుకున్నవాళ్ళకే ఎప్పటికైనా సరిగ్గా  అర్థం చేసుకోగలిగే అవకాశాన్ని (చారిత్రిక)జీవితానుభవాలే అందిస్తాయి. అలా సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళే నిర్భయంగా ప్రశ్నిస్తారు. బలంగా ప్రతిఘటిస్తారు. రాజీ లేకుండా పోరాడుతారు. వాళ్లే ప్రజలు. అలాంటి ప్రజల్లో సహజంగానే సహజీవన సంస్కృతి(తెహ్ జీబ్) ఉంటుంది. స్పష్టాస్పష్టంగానే కావొచ్చు ఎన్నో ప్రజాస్వామిక విలువలు ఉంటాయి. వారికి విభిన్న మతాల పట్ల తమవైన లౌకిక వైఖరులు ఉంటాయి. తమవైన ప్రత్యేక భక్తి
కాలమ్స్ లోచూపు

అస్తిత్వాలు, ఆధునికత, ప్రగతిశీల సామాజిక పరివర్తన

అస్తిత్వాలు,అస్తిత్వవాదాలు ఒకటి కాదు. కాబట్టి అస్తిత్వాల చర్చ అస్తిత్వవాద చర్చ మాత్రమే కానవసరం లేదు. ఇలా అంటున్నామంటే,అస్తిత్వ వాదాలను  పట్టించుకోనవసరం లేదని కాదు.అస్తిత్వాల విముక్తి కోసం అస్తిత్వవాదాలను సీరియస్ గా పట్టించుకొని విమర్శనాత్మకంగా పరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తించడమని అర్థం.     చరిత్రలో ప్రాచీనకాలం నుండే మానవ అస్తిత్వాలు ఉనికిలో ఉంటూ వస్తున్నాయి.ఆ అస్తిత్వాలన్నీ మారకుండా  ఒకే విధంగా లేవు. వేర్వేరు స్థల కాలాలలోని  ఉత్పత్తి సంబంధాలతో వాటికున్న సంబంధాల పరస్పర ప్రభావాలను బట్టి అవి మారుతూ  ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఒకే కాలంనాటి నిర్దిష్ట అస్తిత్వాలను పరిశీలించినా, అవి వేర్వేరు దేశాలలో విభిన్నంగా ఉండి వేర్వేరు చలన క్రమాలను కలిగి ఉంటాయి.కనుక
కాలమ్స్ లోచూపు

గుండెల్నిమండించే మంటో కథలు

మన దేశంలో ఒక జీవన విధానంగా చెప్పబడుతున్న హిందూమతం నిజానికి చరిత్రలో ఒక జన జీవనహనన విధానంగానే అమలవుతూ వస్తున్నది. మిగతా మతాల కంటే దుర్మార్గంగా ఇది అసమానతలను దైవ సృష్టిగా వ్యాఖ్యానించి, వాటిని ప్రజలు ప్రశ్నించడానికి వీలు లేకుండా చేసింది. ఫలితంగానే బ్రాహ్మణీయ వర్ణ వ్యవస్థ, కులాంతరాల కట్టడుల వ్యవస్థ ఉనికిలోకి వచ్చి పాలకుల చేతుల్లో అవి విభజన అస్త్రాలుగా నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చరిత్రలో ప్రజల్ని విభజించి పాలించడం కొత్తేమీ కాదు గాని, వలసవాద పాలనాంతంలో 1947 లో జరిగిన దేశవిభజన విలయం మాత్రం అతిపెద్ద చారిత్రక విషాదం. ఎందుకంటే, గురజాడ అన్నట్టుగా మతాలు మాసి
కాలమ్స్ లోచూపు

అంటరానితనం గాయాలకు అక్షరభాష్యం ‘అకడమిక్ అన్ టచ్ బులిటీ’

ఏ కాలం నాటి సామాజిక చలనాలైనా ఆ కాలపు సమాజంలోని వర్గ పోరాటాల మీదే ఆధారపడి ఉంటాయి.ఆయా పోరాటాల ఉధృతిని బట్టే ఆ సామాజిక చలనాలు వేగవంతం అవుతాయి. పోరాట శక్తులు ఎంతగా విద్యావంతమై సైద్దాంతీకరణ చెందితే అంతగా అవి చారిత్రిక ఫలాలను అందిస్తాయి. ఉదాహరణకు, నక్సల్బరీ విస్ఫోటనం తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో విద్యార్థి చలనాలు చాలా వేగవంతమయ్యాయి. ఈనాటి అకడెమిక్ విద్యా రంగంతో పోలిస్తే ఆనాటి ప్రభుత్వరంగ విద్యలో అంతరాల వ్యవస్థ లేదు. ప్రైవేట్ పెట్టుబడి ఇంకా చొరబడలేదు. సాపేక్షికంగానైనా ఉమ్మడి పాఠశాల విధానం అమలులో ఉండేది. దాని వల్ల విద్యార్థుల్లో సామాజిక వాస్తవికత పట్ల సరైన
కాలమ్స్ లోచూపు

మానవత్వం పరిమళించాలంటే పోరాటం అనివార్యం

ఇతరేతర జీవుల వలె కాకుండా, మనిషి ఒక విలక్షణ జీవి. పరిస్థితులకు లోబడి ఉండకుండా పోరాడే నైజం వల్లనే ఆ విలక్షణత మనిషికి అబ్బింది. కనుకనే ప్రకృతిలో భాగమైన మనిషి ఆ ప్రకృతితో పోరాడుతూనే ప్రకృతిపై ఆధిపత్యం సాధించాడు. ఇలా ప్రకృతిపై ఆధిపత్యం సాధించుకుంటున్న క్రమంలోనే మనుషులు తమలో తాము అనేక విభజనలకు గురయ్యారు. మనదేశంలో తొలుత ఆ విభజన ఆర్థికేతరమైన వర్ణవ్యవస్థ రూపంలో. ఆ తర్వాత ఆర్థిక కోణంలోని వర్గ వ్యవస్థ రూపంలోనూ రూపొంది, కులం, మతం, జెండర్ వంటి బహుళ ఆధిపత్య వ్యవస్ధల రూపాల్లోనూ ఆ విభజనలు  కొనసాగుతూ వస్తున్నాయి. మునుపటి కంటే భిన్నంగా నేటి
కాలమ్స్ లోచూపు

ఆజాదీ కీ ఆవాజ్

యూరప్ లో 14వ శతాబ్దము నుండి రెండు,మూడు శతాబ్దాల పాటు రాచరిక భూస్వామ్యం పై తీవ్రంగా ఘర్షణ పడి, దాన్ని ఓడించి గెలిచిన పెట్టుబడిదారీ వ్యవస్థ(తన స్వప్రయోజనం కోసమే అయినా) ‘మనుషులందరూ సమానమే’, ‘ఏ మనిషికైనా ఒకటే విలువ’ లాంటి కొన్ని ఆధునిక విలువలను ముందుకు తెచ్చింది. పెట్టుబడి తన విస్తరణ కోసం ప్రపంచవ్యాప్తంగా వలసలు ఏర్పరచుకునే క్రమంలో భారతదేశం కూడా ఒక బ్రిటిష్ వలసగా మారింది. ఆ తర్వాత వలసవాద వ్యతిరేక స్వాతంత్ర్య ఉద్యమం ఫలితంగా అధికార మార్పిడి జరిగి,బూర్జువా ప్రజాస్వామ్యం ఇక్కడి భూస్వామ్యంతో తీవ్ర ఘర్షణేమీ లేకుండానే మనదేశానికి దిగుమతి కావడం వల్ల ప్రగతిశీల ఆధునిక
కాలమ్స్ లోచూపు

భూమి,సంస్కృతి,నాగరికత

నేటి అర్ధ వలస,అర్థ భూస్వామ్య సామాజిక వ్యవస్థలో ఈ దేశం పట్ల పాలకవర్గాల దృష్టికోణం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజానుకూలంగా ఉండదు. ఒకప్పుడు గురజాడ ‘’దేశమంటే మట్టి కాదోయ్/ దేశమంటే మనుషులోయ్’’ అనంటే, నేటి పాలకులు దేశమంటే మట్టి మీద బతికే మనుషులు కాదు, ఆ మట్టి చుట్టూ పాతిన సరిహద్దులు, ఆ మట్టి కింద ఉన్న ఖనిజ వనరులేనని భావిస్తున్నారు. వాటిని తెగనమ్మి, పెట్టుబడిదారీ అభివృద్ధివైపే పాలకులు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ అభివృద్ధిలో ప్రజల నిజమైన అస్తిత్వ అభివృద్ధికి, జ్ఞానచైతన్యాల అభివృద్ధికి ఏ మాత్రం చోటు లేదు.ఉన్నదల్లా పెట్టుబడి వృద్ధియే. మనదేశంలో రైళ్ల విస్తరణ వల్ల సాపేక్షికంగా