లోచూపు

ఫాసిస్టు క్రమాల పరిశీలన

పెట్టుబడి తోపాటు  ఆవిర్భవించిన ఆధునిక యుగంలోని రాజకీయాలకు రెండు తీవ్ర అంచులు ఉంటాయి. ఒకటి బూర్జువా ప్రజా స్వామ్యం, రెండు అత్యంత  ప్రగతి నిరోధక ఫాసిజం. పెట్టుబడిదారీ రాజకీయాలు ఈ రెండు అంచుల ద్వంద్వం మధ్యనే లోలకంలా కొనసాగుతాయి. పెట్టుబడి కి ఉన్న   స్వభావం వల్ల నే వలస రూపంలో   ప్రపంచమంతటా  విస్తరించింది.   ఈ  క్రమంలోనే దేశ దేశాలలో ప్రజలు  సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా  స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడారు. ప్రత్యక్ష వలస పెట్టుబడిదారీ విధానం అంతమై పరోక్ష వలస పెట్టుబడిదారీ విధానం మొదలైంది.   పెట్టుబడి ద్రవ్య పెట్టుబడి గా బలపడినాక దాని పని విధానం మారించి. దాని 
లోచూపు కాలమ్స్

ప్రగతిశీల శ‌క్తుల ముందుకు చ‌ర్చా  ప‌త్రం

          “సంస్కృతి-మార్క్సిస్టు సాంస్కృతిక సిద్ధాంతం” అనే విర‌సం 28వ మ‌హా స‌భ‌ల సంద‌ర్భంగా పాణి రాసిన  కీనోట్ పేపర్  ఒక అవ‌స‌ర‌మైన  చ‌ర్చ‌లోకి  ప్ర‌గ‌తిశీల శ‌క్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ది.  ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతీ నిర్మాణం గురించి ఆలోచించేవాళ్లంద‌రూ దీన్ని చ‌ద‌వాలి.  ఇందులోని విష‌యాల‌ను  ప‌ట్టించుకోవాలి. ఇందులో ప్ర‌తిపాదిస్తున్న‌విష‌యాల మంచి చెడ్డ‌ల‌ను ప‌రిశీలించ‌డానికి, వాటి శాస్త్రీయ‌త‌ను అంచ‌నా వేయ‌డానికి, వాటిని ముందుకు తీసికెళ్ల‌డానికి త‌ప్ప‌క  చ‌ద‌వాల్సిన పేప‌ర్ ఇది. సకల ప్రగతిశీల పోరాటాల సమన్వయానికి సాంస్కృతిక కోణం అవ‌స‌రం. దానికి సంబంధించిన అనేక  స‌ర‌ళ‌మైన ప్ర‌తిపాద‌న‌లు ఈ ప‌త్రంలో  ఉన్నాయి. కొన్ని ప్ర‌తిపాద‌ల‌న‌కు వివ‌ర‌ణ‌లు కూడా ఉన్నాయి.  సామాజిక ఉత్పత్తి
లోచూపు కాలమ్స్

బజరా ‘మనువాచకం-స‌మ‌కాలీన అనుభ‌వ‌సారం

నేటి ఆధునిక యుగంలోనూ భారత సామాజిక జీవనం ఇంకా అనాధునికంగానే ఎందుకు ఉన్నది? ప్రగతి సూచికలో మన దేశం ఏ స్థానంలో ఉన్నది? ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడైనా మనకు ఎదురవుతాయి. నిజానికి ప్రగతి సూచికను బట్టి చూస్తే, మన సమాజం ఇంకా కింది స్థాయిలోనే ఉన్నది. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం, ప్రశ్నించే హేతుబుద్ధి మన సమాజానికింకా అపరిచితాలుగానే ఉన్నాయి. మరి మన దేశంలో జరిగిన జాతీయోద్యమం, సంస్కరణోద్యమం, భక్తి ఉద్యమాలన్నీ సామాజిక మార్పుకు దోహదపడినవైనప్పటికీ, అవన్నీ మౌలిక సామాజిక మార్పును ఆశించి సాగినవి కావు. అలాగే ఏ కమ్యూనిస్టు ఉద్యమాలకైనా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అయినప్పటికీ,