ఆదివాసీ బిడ్డల నెత్తురు తాగి త్రేన్చిన మన రిపబ్లిక్!
ఛత్తీస్‌గఢ్, ఒడిషా సరిహద్దులలో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లా కలాఘర్ టైగర్ రిజర్వ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ ఉభయ రాష్టాల భద్రత దళాల సంయుక్త గాలింపు చర్యల్లో భాగంగా జరిగింది. జనవరి 20 తేది ఉదయం ప్రారంభమై 23 వరకు కొనసాగుతూనే ఉన్నది. ఇందులో గరియాబంద్ జిల్లా పోలీస్, సిఆర్‌పిఎఫ్, కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్) అనే ఛత్తీస్‌గఢ్ లోని భద్రతా బలగాలతో పాటు ఒడిషా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఎస్.ఒ.జి. పాల్గొన్నాయి. ఎస్.ఒ.జి. ఒడిషా లో ప్రత్యేకంగా నక్సల్స్ ఆపరేషన్స్‌లో శిక్షణ పొందిన గ్రూప్. ఈసారి ఒడిషాలో మొదటిసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడి అక్కడ