అబూజ్‌మాడ్ ‘ఆరతి’
అక్టోబర్ 4,2024. రాత్రి పడుకోబోయే ముందు వాట్సాప్ ఓపెన్ చేస్తే ఓ జర్నలిస్టు మిత్రుడి నుండి మెసెజ్ దర్శనమిచ్చింది “అబుజ్‌మాడ్ ఎన్‌కౌంటర్ గురించి ఏమైనా వివరాలున్నాయా..?” అంటూ. అతనో మీడియా సంస్థలో పనిచేస్తున్నా విషయం కన్ఫర్మ్ కోసం అప్పుడప్పుడు అడుగుతూ వుంటాడు. విప్లవ రాజకీయాల పట్ల సానుభూతిగా ఉంటూ, ఆ రాజకీయాలను దగ్గరి నుండి గమనిస్తుంటాను అనే కారణంతో కొంత మంది జర్నలిస్టు మిత్రులు ఏదైనా సమాచారం కోసం అప్పుడప్పుడు అడుగుతూ వుంటారు. అతని మెసెజ్ చూసే వరకూ అబూజ్‌మాడ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది అనే విషయమే తెలియపోవడంతో వాట్సాప్ గ్రూపుల్లో ఏదైనా సమాచారం దొరుకుతుందేమో అని ఒక్కొక్కటిగా వెతుకుతూపోయాను.