మమతా ఫాసిజం మాటేమిటో!
“ఎంత మాట! ఇట్లనవచ్చా? సందర్భశుద్ధి లేకుండా?” అనే వాళ్లుంటారని నాకు తెలుసు. సరిగ్గా అనవలసిన సందర్భం ఇదే. పైగా నిన్న మొన్న కూడా ఈ మాట అన్నవాళ్లకు ఇప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు. పశ్చిమ బెంగాల్ విషయంలో సోషల్ ఫాసిజమనీ, మమతా ఫాసిజమనే మాటలు ఎప్పుడో ముందుకు వచ్చాయి. ఫాసిజాన్ని ఇన్ని రకాలుగా, ఇన్ని విశేషణాలతో చెబితే అసలు ఫాసిజం మీద విమర్శ పలుచన అవుతుందనే వాళ్లూ ఉండొచ్చు. మన దేశంలో ఫాసిజం కూడా బహురూపి. సూక్ష్మరూపి, సర్వవ్యాపి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, పాలకవర్గ రాజకీయార్థికానికి అది అత్యంత సన్నిహితమైనది. కేవలం బ్రాహ్మణీయ హిందుత్వ వల్లనే మన దేశంలోని ఫాసిజం