వ్యాసాలు

ఆ త‌ల్లుల త్యాగాలు గుర్తున్నాయా?

చరిత్రహీనుల జీవితాలకు రంగులద్ధి , మేలిముసుగులేసి , అందమైన అలంకరణాలు చేస్తున్న పాల‌న ఇది. దేశ‌ద్రోహుల‌, లొంగుబాటుదారుల  వికృత ,  ప్రజావ్యతిరేక  జీవితాలను గొప్ప చేసి వాళ్లు మహ‌నీయులని, త్యాగమూర్తులని, ఆద‌ర్శనీయులని    బహుళ ప్రచారం చేస్తున్న రోజులివి.  “జననీజన్మభూమి ” అంటూ నాటకీయ విన్యాసాలతో, తమ అంగ ,అర్థ బలాలతో,   ప్రభుత్వ విధేయతలే “దేశభక్తి”గా ప్రజలను ఒప్పిస్తున్నపాలన ఇది. ప్ర‌భుభ‌క్తిని మించిన దేశ‌భ‌క్తి లేని కాలం ఇది.  ఈ వాతావరణంలో, ప్రజల కోసం, దేశ విముక్తి కోసం సర్వస్వం త్యాగం జేసిన మేధావులను, విప్లవకారులను, వారిని క‌న్న త‌ల్లుల‌ను, వారికుటుంబాలను ప‌దే ప‌దే గుర్తు చేయాల్సిన అవ‌స‌రం
వ్యాసాలు

మన కళలు సాహిత్యం కలలకు దూరం కాకూడదు

(విజయవాడలో జరిగిన విరసం 29 వ మహా సభలకు పంపిన సందేశం) మిత్రులారా, కామ్రేడ్స్‌! మొత్తం దేశమంతా ఇప్పుడొక క్లిష్ట పరిస్థితిలో ఉంది. వాళ్ళు ‘మన’ అనేదాన్ని తుడిచేసి తమ పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. నియంతలు మన-జల్‌ జంగల్‌-జమీన్‌ మొత్తం తమదేనని భావిస్తున్నారు. మనల్ని అనామకుల్ని చేసి అమానుషంగా నిర్బంధించి మన గొంతుల్ని నొక్కేస్తున్నారు. పాలకులకు కావలసినంత బలముంది, మీడియా సపోర్ట్‌ ఉంది. వాళ్ళు ఏ పని చేయకుండా కేవలం ప్రచారం ద్వారా విజయం సాధిస్తున్నారు. మనం వీళ్ళను ఎదుర్కోవాలంటే అన్ని రంగాల్లోనూ కృషిచేయవలసి ఉన్నది. రాయాలి, వివరించాలి. మన గురించి, మన భూముల గురించి, మన అడుగుల గురించి
సాహిత్యం వ్యాసాలు

వర్గకసిని సిరా చేసుకున్న కో.ప్ర

విప్లవోద్యమ ప్రభావంతో 1980, 90లలో కవిత్వం రాసిన అప్పటి యువకవుల్లో కో.ప్ర. తనదైన ప్రత్యేక ముద్రతోవిలక్షణంగా కనిపించాడు. వచన కవితనూ, పాటనూ - రెండిటినీ అవలీలగా నడిపించగల నైపుణ్యం అతనిది. కవిగాఅతని మాటకు శక్తి వుంది. అతని భావంలో ఆర్తి ఉంది. అతని ఆవేదనలో చిత్తశుద్ధి వుంది. అంతకంటే ముఖ్యంగా అతనిఅవగాహనలో వర్గకసి వుంది. వీటన్నిటితో బాటు అతని కవిత్వంలో సూటిదనం, పోటుదనం వున్నాయి.కవిగా కో.ప్ర గా సాహిత్యలోకానికి పరిచయమైన అతని పూర్తిపేరు కోలపూడి ప్రసాద్. అతని వూరు నెల్లూరు జిల్లావెంకటగిరి సమీపంలోని డక్కిలి గ్రామం. 1966 జూన్ 2వ తేదీన పుట్టాడు. 1994 అక్టోబర్ 23న శ్రీకాకుళం
వ్యాసాలు

ఫాసిస్టు సందర్భంలో రచన – ఆచరణ

Something is profoundly wrong with the way we live today...our problem is not what to do; it is how to talk about - Tony Judt Social reconstruction begins with a doubt raised among citizens. - Ivan ఇల్లిచ్ ముందుగా విరసం మహా సభలకు విచ్చేసిన అందరకీ అభినందనలు. సాహిత్యంలోని వర్తమాన ధోరణుల గురించిన దార్శనిక సంవాదాన్ని పరిపుష్టం చేయాల్సిన సందర్భంలో ‘‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగ వాదం’’ అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సభల పట్ల నాకు వ్యక్తిగతంగా భిన్నాభిప్రాయం ఉన్నది. ఐనప్పటికీ, ఈ చర్చలు
వ్యాసాలు

డ్యామ్ ఒద్దంటున్న అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు

సియాంగ్ నదిపై కట్ట తలపెట్టిన విద్యుత్ ప్రాజెక్టు ఆదివాసీల భూములను ముంపుకు గురిచేసే ప్రమాదం ఉంది. జూలై 8న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పర్యటనకు ముందు డ్యామ్ నిర్మాణ వ్యతిరేక కార్యకర్తలు యిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జూన్ 22న, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లా యంత్రాంగం 12 గ్రామాల పంచాయతీ సభ్యులు, పెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సియాంగ్ నదిపై ప్రతిపాదిత జలవిద్యుత్ ప్రాజెక్ట్ వల్ల గ్రామాలన్నీ ప్రభావితమవుతాయి, ఈ ప్రాంత నివాసితులు సంవత్సరాలుగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. టిబెట్ నుండి అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర ప్రధాన ఉపనది సియాంగ్. ఈ సమావేశం 10,000 మెగావాట్ల
వ్యాసాలు

వర్తమాన సామాజిక సందర్భంలో మన రచన, ఆచరణ

సాహిత్యరంగంలో విశాల వేదిక నిర్మాణం కావాలి. ఎందుకంటే భావజాలరంగాన్ని నియంత్రించడానికి రాజ్యం పూనుకుంటున్నది. రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కులూ, పోరాటాల ద్వారా యిన్నాళ్లూ సాధించుకున్న పౌరహక్కులూ కాలరాయడానికి కంకణం కట్టుకున్నది. కేవలం యిపుడు కొందరు మేధావులూ, రచయితలూ, కళాకారులూ (రాజకీయ భావజాల కారణంగా మాత్రమే గాదు, రాజకీయపార్టీల కార్యాచరణలో భాగమైనందుకు) రాజ్యపు నిర్బంధానికి గురయినారే గానీ యిక ముందర కనీస ప్రజాస్వామిక హక్కు గురించి మాటాడే అందరూ గురయే ప్రమాదం వుంది, రాజకీయ కార్యాచరణ లేకపోయినా! దీన్ని నివారించాలంటే విశాల వేదికలు అవసరం. ఈ విశాల వేదికలు గూడా రాజకీయాలీనంగా వుండాలి. వేదిక పరంగా యే రాజకీయపార్టీకీ అనుసంధానం గాకూడదు.
వ్యాసాలు

మన రాజ్యాంగం – మనం

విరసం 29 వ మహా సభల ప్రారంభోపన్యాసం స్నేహితులారా! మనం ఇక్కడ రాజ్యాంగవాద సారాంశాన్ని గురించి మాట్లాడుకోవడానికి కలిశాం. ఈ రోజు మన జాతి చరిత్రలో ఒక ముఖ్యమైన సందర్భం. మన రాజ్యాంగం కేవలం ఒక న్యాయసంబంధమైన డాక్యుమెంట్‌ మాత్రమే కాదు. అది మన ప్రజాస్వామిక స్ఫూర్తికి ఆత్మ లాంటిది. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛల వైపుగా మనం చేసే ప్రయాణాన్ని సుగమం చేసే ఒక శక్తి. మనం ఒక నూతన యుగం ముంగిట్లో నిలబడి వున్నాం. ఈ సందర్భంగా, మన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలపట్ల మన నిబద్దతను మరోసారి ప్రకటిద్దాం. భారతదేశపు రాజ్యాంగ ప్రయాణం పరిణామక్రమంతో కూడుకున్నది. మనలాంటి
వ్యాసాలు

తన  పౌరుల పైన, రైతులపైన డ్రోన్‌ దాడి చేస్తున్న ప్రభుత్వం

మానవ రహిత వైమానిక వాహనాలను (యుఎవి) అంతర్జాతీయ స్థాయిలో యుద్ధాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. 2021లో, ఆ సమయంలో భారత ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే, "కంప్యూటర్ అల్గారిథమ్‌ల ఆధారంతో జరిగే డ్రోన్‌ల దూకుడు ఉపయోగం యుద్ధ సమయంలో ట్యాంకులు, ఫిరంగి, భూతల సేన వంటి సాంప్రదాయ సైనిక హార్డ్‌వేర్‌లను సవాలు చేసింది." అతను చెప్పినది పూర్తిగా సరైనది. డ్రోన్ దాడులు ప్రపంచ యుద్ధాల తీరుని మార్చాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి - వీటన్నింటిలో సైన్యం డ్రోన్ విమానాలను ఉపయోగిస్తోంది. మానవాళికి వ్యతిరేకంగా నేరస్తులుగా, ప్రజా ఉద్యమాలకు డ్రోన్‌లు సవాలుగా మారుతున్నాయి.
కారా స్మృతిలో సాహిత్యం వ్యాసాలు

తెలుగు కథకు కారా చేసిందేమిటి ?

తెలుగు సాహిత్యానికి కాళీపట్నం రామారావు గారి చేర్పు ఏమిటి? నిర్దిష్టంగా ఆయన తన కథల ద్వారా కొత్తగా చెప్పిందేమిటి? దీనికి జవాబు వెతికేముందు కారాని ప్రభావితం చేసిన స్థలకాలాలను కూడా చూడాలి.  స్వాతంత్రం వచ్చేసిందని , నెహ్రు సోషలిజం కూడా తెచ్ఛేస్తాడనే భ్రమలు తొలగి అంతటా ఒక అసమ్మతి రాజుకుంటున్న కాలం. గ్రామాలలో చెక్కుచెదరని భూస్వామ్యంపై జనం తిరగబడుతున్న కాలం. సర్దుబాటు కాదు మౌలిక మార్పు కావాలనే తండ్లాట మొదలైన కాలం. రాజకీయార్థిక తలంలో మొదలైన ఈ కదలికను గుర్తుపట్టడమే కారా గొప్పదనం. గ్రామం నుండి పట్టణానికి అనే రాజకీయ అవగాహనను, ఈ అవగాహన పర్యవసానంగా తనకు సమీపంలో
వ్యాసాలు

రాజ్యాంగ ఆరాధనలో స్పష్టంగా కనిపించని చిత్రం

ఏదైనా ఒక రచనను, లేదా సిద్ధాంత ప్రతిపాదనను అంచనా వేసే సమయంలో దాని చారిత్రక సందర్భాన్ని చూడాలి. ఆరాధనా భావంతో కాకుండా విమర్శనాత్మకంగా చూడాలి. ఆ వ్యాసానికున్న స్పిరిట్‌ అవగాహన చేసుకోవాలి. మొత్తానికి ఆ సిద్ధాంత ప్రతిపాదన  ప్రస్తుత సమాజంలోని వైరుధ్యాల్ని ఎట్లా చూస్తున్నది, అవి పరిష్కారం కావడానికి ఉన్న ఆటంకాలుగా వేటిని భావిస్తున్నది, వాటి మీద ఎటాంటి విమర్శనాత్మక వైఖరిని ప్రకటిస్తున్నది అని చూడాలి.  జనవరి 27, 28 తేదీల్లో విరసం సభలో పి.వరలక్ష్మి ఇచ్చిన కీ నోట్‌ ప్రసంగాన్ని పై నేపథ్యంలో అర్థం చేసుకోవడంలో చాలా మంది విఫలమయ్యారు. ఆ కీనోట్‌ మొత్తం ఫ్రేం వర్క్‌ను