తల్లి పేరుతో ఒక మొక్క ‘తండ్రి’ పేరుతో మొత్తం అడవి!
మోడీ ప్రభుత్వం ఒకవైపు 'జై శ్రీరాం' అంటూ చెవులు చిల్లులు పడే హోరుతో బిజెపి ప్రాయోజిత 'ఒక చెట్టు-తల్లి పేరుతో' ప్రచారాన్ని నిర్వహిస్తూనే మరోవైపు హస్దేవ్ అడవిని అదానీకి బదిలీ చేసేందుకు సిద్ధమవడం మన కాలపు వైచిత్రం. కేతే విస్తరణ పేరుతో మూడో బొగ్గు బ్లాకును అదానీకి అప్పగించేందుకు ఆగస్టు 2న అన్ని నియమ నిబంధనలను తుంగలో తుక్కి పర్యావరణ విచారణ జరుపుతున్నారు. ఈ గని కోసం 8 లక్షలకు పైగా చెట్లను నరికివేస్తారేమోనని అంచనా. రాష్ట్రం మొత్తంగావున్న బిజెపి కార్యకర్తలు కూడా ఇన్ని మొక్కలు నాటలేరు. ఏడు నెలల క్రితం ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది.