“గుండె చప్పుళ్ళు”
(ఇటీవల విడుదలయిన కథా సంపుటికి రచయిత రాసిన ముందుమాట ) తెలుగు సాహిత్యంలో ఈ "ఏకలవ్య కాలనీ" మొదటి ఎరుకల కథా సంపుటి. ఇవి మా జీవితాలు. ఇవి మా ఎరుకల కథలు. ఈ దేశపు మూలవాసీల్లో, ఆదివాసీల్లో ముఖ్యమైన ఎరుకల జీవనగాథలివి. ఈ కథల్లోని మా అవమానాలు, దుఃఖాలు, మా ఓటములు, గెలుపులు, మా కన్నీళ్ళు, నవ్వులు మిమ్మల్ని మా గురించి ఆలోచించమంటాయి. ఒక భరోసా కోసం ఒక ఆసరా కోసం ఒక నమ్మకం కోసం ఒక ధైర్యం కోసం ఎదురుచూస్తున్న ఎరుకల బ్రతుకుల్లో నిజమైన మార్పు కోసమే ఈ కథలు.. 1991లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో నా