కుల వివక్షను ఎత్తిపట్టిచూపిన ‘‘గోసంగి’’ కావ్యం
ఉత్పత్తి పై ఆధిపత్యం పాంపాదించుక్ను వర్గాలు సాహిత్య కళృారంగాలపై కూడా తమ పెత్తనాన్ని కొనసాగిస్తాయి.న మనిషి భాష నేర్చి నాటినుంచి కథ కవిత్వం వుంటున్నదన్నది సత్యం. ఉత్పత్తిపై ఆధిపత్యంకోల్పోయిన కారణంగా ఉత్పత్తిని చేసిన వర్గాలు సాహిత్య కళా రంగాలపై కూడా ఆధిపత్యంలేని వారయ్యారు. ఇది ఎలా జరిగిందన్న చర్చ ప్రస్తుతం కాదు. ఉత్పత్తి వర్గాల సాహిత్యం మౌఖికంగానే మిగిలిపోయింది. సంపదేకాదు అక్షరాన్ని కైవసం చేసుకున్న వర్గాల ఉత్పత్తి వర్గాన్ని విస్మరించాయి. ఒకవేళ ఉత్పత్తి వర్గాల ప్రసక్తి వచ్చినా వక్రీకరించో, తమ ప్రతి పాఠ్యాంశానికి కావలసిన విధంగానూ వాడుకున్నారు. ప్రబంధ యుగమంతా విశిష్టాద్వైత ప్రచార సాహిత్యమని త్రిపురనేని మధుసూదనరావు గారంటారు.










