వివాదాస్పద వ్యక్తిత్వం
ఎంవి రమణారెడ్డి వాక్యం సరళంగా ఉంటుంది. ఆయన ఏది రాసినా, మాట్లాడినా నేరుగా అర్థమైపోతారు. ఆయన వ్యక్తిత్వం దీనికి పూర్తి వ్యతిరేకం. అందులో అనేక ఎత్తుపల్లాలున్నాయి. ఆగాధాలు ఉన్నాయి. చిక్కుముళ్లు ఉన్నాయి. అలాంటి ఎంవిఆర్ గురించి సరళంగా ఏం చెప్పినా అది తప్పే అవుతుంది. ఆయన్ను పట్టిచ్చే ఒకే ఒక వాక్యం రాయడం ఎవ్వరికైనా కష్టమవుతుంది. ఒక ప్రశంసాత్మక వాక్యం రాస్తే దాని పక్కనే ప్రశ్నించే వాస్తవం వచ్చి నిలదీస్తుంది. ఆయన సామాజిక, రాజకీయ జీవితం గుంటూరు మెడికల్ కాలేజీ విద్యార్థి దశలోనే ఆరంభమైంది. నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల ప్రచార వేదికగా ప్రభంజనం పత్రిక ఆరంభించారు. విరసం








