వ్యాసాలు

మన రాజ్యాంగం – మనం

విరసం 29 వ మహా సభల ప్రారంభోపన్యాసం స్నేహితులారా! మనం ఇక్కడ రాజ్యాంగవాద సారాంశాన్ని గురించి మాట్లాడుకోవడానికి కలిశాం. ఈ రోజు మన జాతి చరిత్రలో ఒక ముఖ్యమైన సందర్భం. మన రాజ్యాంగం కేవలం ఒక న్యాయసంబంధమైన డాక్యుమెంట్‌ మాత్రమే కాదు. అది మన ప్రజాస్వామిక స్ఫూర్తికి ఆత్మ లాంటిది. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛల వైపుగా మనం చేసే ప్రయాణాన్ని సుగమం చేసే ఒక శక్తి. మనం ఒక నూతన యుగం ముంగిట్లో నిలబడి వున్నాం. ఈ సందర్భంగా, మన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలపట్ల మన నిబద్దతను మరోసారి ప్రకటిద్దాం. భారతదేశపు రాజ్యాంగ ప్రయాణం పరిణామక్రమంతో కూడుకున్నది. మనలాంటి
వ్యాసాలు

తన  పౌరుల పైన, రైతులపైన డ్రోన్‌ దాడి చేస్తున్న ప్రభుత్వం

మానవ రహిత వైమానిక వాహనాలను (యుఎవి) అంతర్జాతీయ స్థాయిలో యుద్ధాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. 2021లో, ఆ సమయంలో భారత ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే, "కంప్యూటర్ అల్గారిథమ్‌ల ఆధారంతో జరిగే డ్రోన్‌ల దూకుడు ఉపయోగం యుద్ధ సమయంలో ట్యాంకులు, ఫిరంగి, భూతల సేన వంటి సాంప్రదాయ సైనిక హార్డ్‌వేర్‌లను సవాలు చేసింది." అతను చెప్పినది పూర్తిగా సరైనది. డ్రోన్ దాడులు ప్రపంచ యుద్ధాల తీరుని మార్చాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి - వీటన్నింటిలో సైన్యం డ్రోన్ విమానాలను ఉపయోగిస్తోంది. మానవాళికి వ్యతిరేకంగా నేరస్తులుగా, ప్రజా ఉద్యమాలకు డ్రోన్‌లు సవాలుగా మారుతున్నాయి.
వ్యాసాలు

రాజ్యాంగ ఆరాధనలో స్పష్టంగా కనిపించని చిత్రం

ఏదైనా ఒక రచనను, లేదా సిద్ధాంత ప్రతిపాదనను అంచనా వేసే సమయంలో దాని చారిత్రక సందర్భాన్ని చూడాలి. ఆరాధనా భావంతో కాకుండా విమర్శనాత్మకంగా చూడాలి. ఆ వ్యాసానికున్న స్పిరిట్‌ అవగాహన చేసుకోవాలి. మొత్తానికి ఆ సిద్ధాంత ప్రతిపాదన  ప్రస్తుత సమాజంలోని వైరుధ్యాల్ని ఎట్లా చూస్తున్నది, అవి పరిష్కారం కావడానికి ఉన్న ఆటంకాలుగా వేటిని భావిస్తున్నది, వాటి మీద ఎటాంటి విమర్శనాత్మక వైఖరిని ప్రకటిస్తున్నది అని చూడాలి.  జనవరి 27, 28 తేదీల్లో విరసం సభలో పి.వరలక్ష్మి ఇచ్చిన కీ నోట్‌ ప్రసంగాన్ని పై నేపథ్యంలో అర్థం చేసుకోవడంలో చాలా మంది విఫలమయ్యారు. ఆ కీనోట్‌ మొత్తం ఫ్రేం వర్క్‌ను
వ్యాసాలు

భారత రాజ్యాంగం – వైరుధ్యాల పుట్ట

(ఈ వ్యాసాన్ని ప్రొ. శేషయ్యగారు 2004లో రాశారు. రాజ్యాంగవాదం మీద వస్తున్న అభ్యంతరాలును పరిశీలించడానికి ఈ వ్యాసం ఉపయోగపడుతుంది. పౌరహక్కుల ఉద్యమకారుడిగా, న్యాయశాస్త్ర ఆచార్యుడిగా ఆయన రాజ్యాంగాన్ని  చారిత్రకంగా, విమర్శనాత్మకంగా పరిశీలించారు. ఆయన మరణానంతరం పౌరహక్కుల సంఘం ప్రచురించిన ప్రొ. శేషయ్య రచనా సర్వస్వం`1లో ఈ వ్యాసం పునర్ముద్రణ అయింది` వసంతమేఘం టీం) ఫ్రెంచి రాజ్యాంగాన్ని పరిశీలించి అందులోని వైరుధ్యాల గురించి మార్చు వివరిస్తూ ‘ఫ్రెంచి రాజ్యాంగంలోని ప్రధాన వైరుధ్యం : ఒకవైపు కార్మికులకు, రైతులకు, పెటీ బూర్జువాల సామాజిక బానిసత్వాన్ని కొనసాగిస్తూనే, వారు రాజకీయ అధికారం పొందడానికి సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించడం, మరో వైపు
వ్యాసాలు

దండకారణ్యంలో మళ్లీ బాంబు మోతలు

విజయవాడ విరసం సభల్లో ఆట పాటలతో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని, పోరాడి గెలవగలమనే విశ్వాసాన్ని అందించిన మూలవాసీ సాంస్కృతిక్‌ కళా మంచ్‌ సభ్యులు తమ గూడేలకు చేరుకున్న కాసేపటికే డ్రోన్‌ దాడులు మొదలయ్యాయి. ఈరోజు(జనవరి 30) మధ్యాహ్నం 2 గంటల సమయంలో బీజాపూర్‌ జిల్లా ఒట్టిగూడ పక్కన పంట పొలాల్లో ఆకాశం నుంచి బాంబులు కురిశాయి. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఉధృతంగా డ్రోన్‌ హెలికాప్టర్‌ దాడులు జరిగాయి. ఇటీవల కొద్ది విరామం తర్వాత, ఎన్నికలు జరిగి బీజేపీ అఽధికారంలోకి వచ్చాక పైనిక చర్యలు తీవ్రమయ్యాయి. ఇవాళ జరిగిన దాడిని అందులో భాగంగానే చూడాలి. ఈ నెల 1వ తేదీ
వ్యాసాలు

తెలుగు ప్రజల రాజకీయ, సాంస్కృతిక వికాసంలో ‘నిషేధిత’సంఘాలు

‘ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం తేలిక. ప్రజాస్వామికీకరణ చాలా కష్టం’ అని ప్రొ. శేషయ్యగారు తరచూ అనేవారు. మనలాంటి సమాజాల్లో పౌరహక్కులు   ప్రజల అనుభవంలోకి రాగల రాజకీయ, సాంస్కృతిక వాతావరణం ఏర్పడ్డం ఎంత కష్టమో చెప్తూ ఈ మాట అనేవారు. భూస్వామ్యం సాంస్కృతికంగా కూడా బలంగా ఉన్న చోట ప్రజా స్వామికీకరణకు చాలా అడ్డంకులు ఉంటాయి. ఎవరో కొంతమంది ఉదాత్త ఆశయాలతో  ప్రజాస్వామ్యం కోసం పని చేసినంత మాత్రాన అది ఎన్నటికీ ఒక భౌతిక వాస్తవంగా మారదు. వాళ్ల కృషి దోహదకారి కావచ్చు. అంత వరకే. ఆధిపత్య సంబంధాల్లో అణగారిపోతున్న జనం మూకుమ్మడిగా లేచి పోరాటాల్లోకి వచ్చినప్పుడే   ప్రజాస్వామ్యానికి కుదురు
వ్యాసాలు

ఉమ్మడి వారసత్వ ప్రదేశాలు – మతపరమైన ఎజెండాలు

1992 డిసెంబరు 6న భారతదేశంలోని వారసత్వ ప్రదేశంలో అతిపెద్ద వ్యవస్థీకృత దాడి జరిగింది. ఈ దాడి రాజ్యమూ దాని బలగాల సమక్షంలో జరిగింది. రాముడి విగ్రహాలను బయటకు తీసి తాత్కాలిక ఆలయంలో ఉంచారు. ఇప్పుడు రామమందిరం ప్రారంభోత్సవం జరుగుతోంది. కానీ అందులో మరో రాముడి విగ్రహం ఉంటుంది. లౌకిక  దేశానికి చెందిన ప్రధాని ఆలయ ప్రారంభోత్సవం పేరుతో భారత్‌తో పాటు ప్రపంచంలోని దాదాపు 50 దేశాల్లోనూ ఆసక్తిని పెంచుతున్నారు. అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన రోజున దీపావళిని జరుపుకోవాలని, తమ నగరం లేదా గ్రామంలోని దేవాలయాలలో కార్యక్రమాలు నిర్వహించాలని సంఘ్ పరివార్ సభ్యులందరూ ప్రజలకు పిలుపునిచ్చారు. హిందూ రాష్ట్ర ఎజెండాను
వ్యాసాలు

బిల్కిస్ బానో తీర్పు: ఎక్కువ  ఉపశమనం, కొంచెం భరోసా

అత్యంత దారుణమైన వార్తలు, భయానక, దిగ్భ్రాంతికరమైన న్యాయ నిర్ణయాలు, అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తుల వ్యక్తిగత, అధికారిక ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు, ప్రమాదాల తుఫాను మధ్య జనవరి 8, సోమవారం నాడు సుప్రీం కోర్టు నిర్ణయం చాలా వరకు ఉపశమనం కలిగించింది. కొంత వరకు భరోసానిస్తుంది. జస్టిస్ బిబి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ 75వ స్వాతంత్య్ర  వార్షికోత్సవం సందర్భంగా మోడీ కేంద్ర , గుజరాత్ ప్రభుత్వాలు శాంతిభద్రతలతోనే కాకుండా మానవీయతకు చేసిన అత్యంత ఘోరమైన దుష్ప్రవర్తనను రద్దు చేసింది. 2002లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ మారణకాండ సందర్భంగా బిల్కిస్
వ్యాసాలు

పసి పాపల నిదుర కనులపై ముసిరిన యుద్ధోన్మాదం ఎంతో..

పాలస్తీనా స్వేచ్ఛాకాంక్షపై జరుగుతున్న యుద్ధంలో పసి పిల్లల మరణాలు ప్రపంచ మానవాళిని కలచివేస్తున్నాయి. యుద్ధం ఎక్కడ జరిగినా, ఏ రూపంలో జరిగినా నెత్తురు ప్రవహించాల్సిందే. చరిత్ర పొడవునా రాజకీయాల కొనసాగింపుగా సాగిన యుద్ధాలన్నీ తీవ్రమైన విధ్వంసానికి, విషాదానికి కారణమయ్యాయి. ఏ నేల మీది జరిగే యుద్ధాలకైనా దురాక్రమణే లక్ష్యం. అది పాలస్తీనాలో ఒక రకంగా ఉండొచ్చు. కశ్మీర్‌లో ఇంకోలా ఉండొచ్చు. దేశం మధ్యలోని దండకారణ్యంలో మరోలా ఉండొచ్చు. ఎక్కడైనా సరే, ఏ రూపంలో అయినా సరే దురాక్రమణ కోసం సాగే యుద్ధాలు పిల్లలను బలి తీసుకుంటాయి. పాలస్తీనాలో చనిపోతున్న పిల్లల కోసం అనుభవిస్తున్న అనంతమైన దు:ఖం దండకారణ్యాన్ని కూడా
వ్యాసాలు

త‌పాలా ఉద్యోగులంటే మోదీకి ఎందుకింత కక్ష ? 

చెడ్డ‌ పోస్టుమ్యాన్ ఉండ‌డు.. , మంచి పోలీస్ క‌నిపించ‌డు.. అనేది ఓ నానుడి. అంటే..  పోస్ట్ మ్యాన్ పని విధానం ఎంత‌  నిస్వా ర్థంగా త్యాగ‌పూరితంగా ఉంటుందో ఈ సామెత తెలియ‌జేస్తున్న‌ది. నేటికీ మారుమూల గ్రామం మొద‌లు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల దాకా త్యాగ‌పూరితంగా సేవ‌లు అందిస్తున్న ప్ర‌భుత్వ విభాగం ఏదైనా ఉన్న‌ది అంటే అది తంతి త‌పాలా శాఖ (పోస్ట‌ల్ డిపార్ట్ మెంటు) మాత్ర‌మేన‌ని చెప్పుకోవాలి. వృత్తి నిబ‌ద్ధ‌త‌తో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్న గ్రామీణ త‌పాలా ఉద్యోగులు త‌మ స‌మ‌స్య ల ప‌రిష్కారం కోసం  కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతూ స‌మ్మె చేస్తే, వారిని కేంద్రంలోని న‌రేంద్ర‌మోదీ బీజేపీ ప్ర‌భుత్వం